close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తేనె తీసుకుంటున్నారా?

గ్గూ జలుబూ జ్వరాల్లో చాలావరకూ వైరస్‌ల కారణంగానే వస్తుంటాయి. వీటిల్లో ఏది వచ్చినా కొందరు మాటిమాటికీ వైద్యుల్ని సంప్రదిస్తుంటారు. కానీ ఆ అవసరం లేదనీ దానికన్నా ముందు కాస్త తేనె తాగడం వల్ల ఫలితం ఉంటుందనీ లండన్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ అండ్‌ కేర్‌ ఎక్స్‌లెన్స్‌కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. తరచూ యాంటీబయోటిక్స్‌ తీసుకోవడంవల్ల రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. అందుకే మందులు మింగడం కన్నా తేనె వల్ల దగ్గుకి త్వరగా ఉపశమనం లభిస్తుందని అనేక పరిశోధనల్లో వెల్లడైందట. తేనెలోని డెక్స్‌ట్రోమెథార్ఫిన్‌ అనే పదార్థం దగ్గుని తగ్గిస్తుందని గుర్తించారు. కాబట్టి పిల్లలైనా పెద్దలైనా దగ్గూ జలుబూ లాంటి లక్షణాలు కనిపించగానే రోజూ కాస్త తేనె తాగితే త్వరగా తగ్గుతాయి. అంతేకాదు, అనారోగ్యమేమీ లేకున్నా కూడా రోజూ ఓ టీస్పూను తేనె తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరిగి తరచూ వైరస్‌ల బారిన పడకుండా ఉంటారని చెప్పుకొస్తున్నారు.


ఊబకాయానికి చెత్తా కారణమే!

ఇంటిని శుభ్రం చేయడానికి రకరకాల లోషన్లు వాడుతుంటాం. శుభ్రం చేయడం, వాడుకోవడం తేలికగా ఉంటుందన్న కారణంతో రకరకాల ప్లాస్టిక్‌ వస్తువుల్ని కూడా ఉపయోగిస్తుంటాం. అయితే ఆయా లోషన్లలోని రసాయనాలూ
ప్లాస్టిక్‌లోని థాలేట్లూ అన్నీ కలిసి మన శరీరంలోని హార్మోన్ల వ్యవస్థని అస్తవ్యస్తం చేస్తున్నాయన్నది తెలిసిందే. దాంతో సంతాన సమస్యలూ, కాలేయ వ్యాధులూ, క్యాన్సర్లూ... ఇలా రకరకాల సమస్యలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా వీటికి తోడు ఇంట్లో పేరుకునే చెత్తలోని రసాయనాలవల్ల జీవక్రియ దెబ్బతిని, కొవ్వు కణాలు పేరుకుని ఊబకాయానికి దారితీస్తోందనీ డ్యూక్‌ యూనివర్సిటీ నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకోసం వీళ్లు సుమారు 200 మందిని ఎంపికచేసి ఆ ఇళ్లలో పోగుపడే చెత్తనీ ఇంట్లో ఉండే పిల్లల్నీ పరిశీలించి చూడగా- చెత్తలోని రసాయనాలకీ ఇంట్లోని పిల్లల ఊబకాయానికీ సంబంధం ఉన్నట్లు గుర్తించారు.


ట్యాన్‌ నుంచి తప్పించుకునేదెలా?

ఎండలో కాస్త బయటకు వెళ్లగానే కొందరి శరీరం ట్యాన్‌కి గురవుతుంది. వేసవి అయితే అసలే చెప్పక్కర్లేదు. మార్కెట్లో దొరికే క్రీముల వల్ల ఫలితం అంతంత మాత్రమే. పైగా కొందరికి అవన్నీ పడవు కూడానూ. అలాంటివాళ్లు ఈ చిట్కాలు పాటిస్తే చాలావరకూ ట్యాన్‌ బాధ నుంచి తప్పించుకోవచ్చు.

* ట్యాన్‌ అయిన భాగంలో ఓ నిమ్మచెక్కను రోజుకి రెండుసార్లు రుద్ది ఓ పావుగంట తరవాత స్నానం చేయాలి. ఇలా రెండు నుంచి నాలుగు నెలల పాటు చేస్తే నిమ్మలోని ఆమ్లాలవల్ల చర్మం మీద ఉన్న ట్యాన్‌ మెల్లగా తొలగిపోతుంది.

* అచ్చంగా నిమ్మరసం వల్ల చర్మం మండుతుందీ అనుకుంటే టేబుల్‌స్పూను చొప్పున నిమ్మరసం, కీరా ముద్ద, రోజ్‌ వాటర్‌ తీసుకుని బాగా కలిపి ఆయా భాగాల్లో రాసి పావుగంట తరవాత కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే ఫలితం ఉంటుంది.

* టేబుల్‌స్పూను చొప్పున ఎర్ర కందిపప్పు పొడి, టొమాటో రసం, అలోవెరా గుజ్జు కలిపి ఒక వారం పాటు రోజు విడిచి రోజు పట్టించి అరగంట తరవాత చల్లని నీటితో కడిగేయాలి. తరవాతి నుంచీ వారానికి రెండుసార్లు చేస్తే సరిపోతుంది.

* అరకప్పు పండిన బొప్పాయి గుజ్జులో టేబుల్‌స్పూను తేనె కలిపి ట్యాన్‌ అయిన భాగాలకు పట్టించి అరగంట తరవాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు మూడుసార్లు చేస్తే బొప్పాయిలోని ఎంజైమ్‌ల వల్ల చర్మం మీద ఉన్న ట్యాన్‌ పోతుంది. తేనె చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

* టేబుల్‌స్పూను చొప్పున పెరుగు, టొమాటోరసం తీసుకుని వారానికి రెండుమూడుసార్లు పట్టిస్తే ట్యాన్‌తోబాటు మచ్చలు కూడా తొలగిపోయి, చర్మం మెరుపుని సంతరించు కుంటుంది.


పిండి పదార్థాలూ మంచివే!

మధ్య మధుమేహం, ఊబకాయం... వంటి కారణాలతో అందరూ పిండిపదార్థాలు తినడం పూర్తిగా మానేయడం, లేదా తగ్గించేయడం చేస్తున్నారు. అయితే అది నిజం కాదనీ సంక్లిష్ట పిండిపదార్థాలు మెదడు ఆరోగ్యానికి ఎంతో అవసరమనీ సిడ్నీ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. ఇందుకోసం కొంతమందిని ఎంపిక చేసి వాళ్లకు తక్కువ ప్రొటీన్‌, ఎక్కువ సంక్లిష్ట పిండిపదార్థాలు ఉన్న ఆహారాన్ని కొంతకాలంపాటు ఇచ్చారట. తరవాత వాళ్ల మెదడు పనితీరునీ ముఖ్యంగా జ్ఞాపకశక్తిని పరిశీలించి చూడగా అది మెరుగయినట్లు గుర్తించారు. సాధారణంగా మెదడులోని హిప్పోక్యాంపస్‌ భాగంలోని కణాల క్షీణత వల్లే ఆల్జీమర్స్‌ వచ్చే అవకాశం ఎక్కువ. కానీ సంక్లిష్ట కార్బొహైడ్రేట్లు తీసుకునేవాళ్లలో మెదడు పనితీరు మెరుగవడంతోబాటు మతిమరపు వచ్చే అవకాశం తక్కువ అని తేల్చారు. అంతేకాదు, ఈ రకమైన పిండిపదార్థాల వల్ల గుండె ఆరోగ్యం కూడా బాగుండి ఆయుఃప్రమాణం పెరుగుతుందనీ సదరు నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి మధుమేహంతోనూ ఊబకాయంతోనూ బాధపడేవాళ్లను తప్పిస్తే- మిగిలినవాళ్లు అచ్చంగా ప్రొటీన్‌ ఫుడ్స్‌ని మాత్రమే తినకుండా కార్బొహైడ్రేట్లనూ తీసుకోవాలని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.


(28 ఏప్రిల్‌ 2019)

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.