close
పావురానికి రూ.10 కోట్లు!

ఓ పక్షి... అందులోనూ పావురం పదికోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందంటే ఎవరైనా నమ్ముతారా... కానీ నమ్మాల్సిందే. బెల్జియంకు చెందిన అర్మాండో అనే రేసింగ్‌ పావురం ఈ ఘనత సాధించింది. దీన్ని పెంచుకుంటున్న జోయెల్‌ వెర్చూట్‌ అనే ఆయన ఈమధ్యే ఈ పావురాన్ని ‘పిపా’ అనే వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టగా చైనాకు చెందిన ఓ వ్యక్తి రూ.10 కోట్లు చెల్లించి కైవసం చేసుకున్నాడు. ఇప్పటివరకూ జరిగిన ఎన్నో పోటీల్లో ఇది మిగిలిన పావురాలకన్నా ముందుగా గమ్యాన్ని చేరుకుని తొలిస్థానాన్ని కైవసం చేసుకుందట. అందుకే, దానికంత ధర. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పావురం ఇదేనట.


ఎలుకకి ఎంత శుభ్రమో..!

బ్రిటన్‌కి చెందిన 72 ఏళ్ల స్టీఫెన్‌ మెకీ ఓ మెకానిక్‌. రోజూ తన షెడ్‌లో పనిచేసుకుని సాయంత్రానికి అలసిపోయి చిన్న చిన్న మేకులూ స్క్రూలూ క్లిప్పుల్ని ఏరి ఒక దాన్లో వేసే ఓపిక లేక అలాగే వదిలేసి తలుపులు మూసేసి వెళ్లిపోయేవాడు. ఆశ్చర్యం ఏంటంటే... అతడు తెల్లవారి వచ్చి చూసేసరికి ఆ వస్తువులన్నీ పక్కన ఉన్న డబ్బాలో ఉంటున్నాయట. ‘వేసిన తాళం వేసినట్లే ఉంటుంది... మరి, లోపలికి ఎవరొస్తున్నారు... కొంపదీసి ఏ దయ్యమో కాదుకదా...’ అని భయపడిన స్టీఫెన్‌ ఆ రహస్యాన్ని తెలుసుకునేందుకు ఒకరోజు చీకట్లోనూ వీడియో తీసే కెమేరాలను ఆన్‌చేసి షెడ్‌లో పెట్టాడు. మరుసటి రోజు వచ్చి ఆ కెమేరాలో రికార్డ్‌ అయిన దృశ్యాన్ని చూశాక అతడికి నోట మాట రాలేదట. విషయం ఏంటంటే... అవన్నీ సర్దుతున్నది ఓ ఎలుక. ఒక్కో వస్తువునీ నోటితో కరుచుకుని తీసుకెళ్లి టబ్‌లో వెయ్యడం, మళ్లీ రావడం... ఇలా రోజూ రాత్రిపూట ఓ రెండు గంటలు దానిపని అదేనట. స్టీఫెన్‌ ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చెయ్యడంతో అదికాస్తా వైరల్‌ అయ్యి అందరూ ‘ఈ ఎలుకకి ఓసీడీ (అతిశుభ్రం జబ్బు) ఉందేమో, మనుషులు శుభ్రంగా లేకపోతే దానికి నచ్చట్లేదేమో...’ అని వ్యంగ్యంగా ఛలోక్తులు విసురుతున్నారు.


చెట్టులో ‘చిత్రం’!

చెట్టు కాండాన్ని నరికితే లోపల తెల్లటి చెక్క భాగమూ గుండ్రని గీతలూ కనిపిస్తాయని అందరికీ తెలిసిందే. ఫెర్న్‌ చెట్లు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. వీటి కాండాలను కోస్తే లోపలున్న చెక్క భాగంలో ముదురు ఎరుపు రంగులో పాములా మెలికలు తిరిగిన డిజైన్లు కనిపిస్తాయి. ఆకర్షణీయంగా కనిపించే వీటిని చూస్తే నిజంగా సహజంగా ఏర్పడినవా... అనే సందేహం కలిగినా కలుగుతుంది. వి‘చిత్రం’గా ఉంది కదూ...


ఈ గాజు ముక్కలు కరిగిపోతాయ్‌!

ఈమధ్య అమెరికాలోని లేక్‌ మిషిగన్‌ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్‌ 30సెల్సియస్‌ వరకూ పడిపోయాయి. దాంతో సరస్సులోని నీటి ఉపరితలం గడ్డకట్టుకుపోయింది. తర్వాత కొంతకాలానికి వాతావరణం నెమ్మదిగా వేడెక్కడంతో ఉన్నట్లుండి మిషిగన్‌ సరస్సు పైభాగమంతా పగిలిన గాజుముక్కలతో నిండిపోయింది. అదెలా అంటారా... నిజానికి అవన్నీ ఐసు ముక్కలే. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలో మార్పులు జరిగేసరికి సరస్సు పైభాగంలో మందపాటి పొరలా గడ్డకట్టిన ఐసు మధ్యలో ఒత్తిడి ఏర్పడి ఇలా మొనదేలిన గాజుపెంకుల్లా పగిలిందట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.