close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జ్యూస్‌ తాజాగా...

ఎండకు బయటకు వెళ్లేప్పుడు శక్తినిస్తాయని పండ్ల రసాలు తీసుకెళుతుంటాం. అయితే మామూలు బాటిళ్లలో పోసుకెళితే ఎండ వేడిమి వల్ల అవి త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. కానీ ‘శాన్స్‌ ట్రావెల్‌ జ్యూస్‌ అండ్‌ స్మూతీ ప్రిజర్వింగ్‌ బాటిల్‌’లో పోస్తే మాత్రం పండ్లరసాలు చాలా సేపు తాజాగా ఉంటాయి. ఈ బాటిల్‌కు వాక్యూమ్‌ పంప్‌ తరహా ఏర్పాటు ఉంటుంది. మనం జ్యూస్‌ను పోసి మూత పెట్టి, మూత పై భాగాన్ని కిందకి రెండు మూడు సార్లు నొక్కామంటే లోపలి గాలి అంతా బయటకు పోయి బాటిల్‌ ఎయిర్‌ సీల్‌ అయిపోతుంది. లోపల గాలి లేకపోవడం వల్ల జ్యూస్‌లూ, స్మూతీల్లాంటి పండ్లతో చేసిన పదార్థాల ఆక్సీకరణ వేగం తగ్గి అవి ఎక్కువ సేపు తాజాగా ఉంటాయి.


పట్టుకెళదాం సులభంగా...

ఊరెళ్లాలి... రోజూ వాడే పెద్ద మాయిశ్చరైజర్‌ బాటిళ్లూ, షాంపూలూ, కండిషనర్లూ, ఫేస్‌వాష్‌లూ, లోషన్లూ... ఇవన్నీ బ్యాగులో పెట్టుకోవాలంటే బోలెడు బరువూ, స్థలం వృథా. అలా కాకుండా ఎన్ని రోజులు వెళుతున్నామన్నదాన్ని బట్టి అంతే మొత్తంలో ఇవన్నీ తీసుకెళ్లే అవకాశాన్ని కల్పిస్తాయి ‘పోర్టబుల్‌ సిలికాన్‌ స్వ్కిషీ బాటిళ్లు’. మాయిశ్చరైజర్లూ షాంపూల్లాంటి వాటిని కావలసినంత మొత్తంలో ఈ చిన్న బాటిళ్లలో పోసుకుని సౌకర్యంగా తీసుకెళ్లొచ్చు. ఇవి ఉన్నాయంటే, ఇక బ్యాగు బరువు తగ్గినట్టే! 


సర్దేద్దాం అందంగా...

నాన్‌ స్టిక్‌ పాన్‌లూ, గిన్నెల్ని ఎంత జాగ్రత్తగా సర్దినా ఒకదానిమీద ఒకటి పెట్టడం వల్ల గీతలు పడుతుంటాయి. అంతేకాక గిన్నెమీద గిన్నె బోర్లించడం వల్ల ఒకటి తీసేప్పుడు మరొకటి పడటం, లేదా చప్పుళ్లు రావడం జరుగుతుంటాయి. ఈ ఇబ్బందులన్నీ లేకుండా కావల్సిన పాత్రల్ని అందుబాటులో చూడచక్కగా సౌకర్యవంతంగా సర్దుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి ‘పాన్‌ అండ్‌ పాట్‌ ఆర్గనైజర్‌ ర్యాక్‌’లు. స్టాండ్‌లా ఉండే వీటిలో కొన్ని తీసి పెట్టుకునే వీలుండే ప్లేట్లు ఉంటాయి. మనం అవసరాన్ని బట్టి ఆ ప్లేట్లను అడ్జస్ట్‌ చేస్తూ పాత్రలను ఒకవరసలో ఒకదానిమీద ఒకటి అందంగా ఉండేలా సర్దుకోవచ్చు.


మంచం పక్కనే సౌకర్యంగా...

పడుకునేప్పుడు చేతికుండే వాచీ, అరచేతిలోనే ఉండే సెల్‌ఫోనూ దానితో పాటే హెడ్‌ ఫోన్సూ, కళ్లజోడూ, ఆడపిల్లలైతే క్లిప్పులూ, ఇంకొంత మందికి ఓ పుస్తకం... మంచం మీద పక్కన చేరాల్సిందే. పడకగదిలో టేబుల్‌ కూడా ఉండి మనకు లేచి అవన్నీ అక్కడ పెట్టే ఓపికున్న సందర్భాల్లో తప్ప చాలా వరకూ వాటి స్థానం మంచమే. కానీ అలా పెట్టడం వల్ల మనం పక్కకు తిరిగినప్పుడు అవి నొక్కుకుపోయే ప్రమాదమూ, లేదా ఆయా వస్తువులు పాడయ్యే అవకాశమూ ఉంటుంది. అలాంటి ఇబ్బందికి చెక్‌ చెబుతూ మంచానికే చిన్న అరను అమర్చుకునే వీలు కల్పిస్తూ తయారవుతున్నాయి ‘బెడ్‌ షెల్ఫీ’ అరలు. వీటి ఒక కొసను మంచం చివరకు తగిలించి, అరతో పాటు కింద వైపు వచ్చే స్క్రూలను టైట్‌ చేశామంటే ఆ అరలు మంచానికి పట్టి ఉంటాయి. ఇక మనక్కావలసిన వస్తువులన్నీ అక్కడ పెట్టేసుకోవచ్చు. భలే ఐడియా కదూ!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.