close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చెక్కలాంటి రత్నం!

ఏ కోణంలో నుంచి చూసినా ఎలా చూసినా ఎవరైనా ఇక్కడ కనిపించే వాటిని చెక్క ప్రతిమలనీ చెక్కతో చేసిన నగలనీ అనుకోవాల్సిందే. మీరూ అలాగే అనుకున్నారా... అయితే ముమ్మాటికే పొరపాటే. ఎందుకంటే ఇదో రాయి- అంటే ఏదో మామూలు రాయి కాదు, ఓ రకం రత్నం. అచ్చం చెక్కలా ఉండడం దీని ప్రత్యేకత.

త్నాలు... అనగానే మిలమిల మెరుపుతో ఆకర్షణీయమైన రంగుల్లో ఉండే రాళ్లు గుర్తొస్తాయి మనకి. అలాంటి వాటన్నిటికీ పూర్తి భిన్నమైందే ‘టైగర్‌ ఐ’ జెమ్‌ స్టోన్‌. క్వార్ట్జ్‌ జాతికి చెందిన ఈ రాయి ముదురు గోధుమ, పసుపు వర్ణాలు కలగలిసినట్లుండడానికి కారణం వేల ఏళ్ల పాటు రసాయనిక చర్యలో భాగంగా ఈ రత్నం, లైమోనైట్‌ అనే మరో రాయితో పొరలుపొరలుగా కలిసిపోవడమే. ఇక, వీటిలో కొన్ని బంగరు వర్ణంలో ఉండి ఆ మధ్యలో నల్లటి చారలు కనిపించడంతో పాలిష్‌ చేసిన ఈ రాళ్లు అచ్చు గుద్దినట్లూ పులి కళ్లులా కనిపిస్తాయి. అందుకే, వీటిని ‘టైగర్‌ ఐ’ రాళ్లు అంటారు. చెక్కలా ఉంటాయి కాబట్టి, వుడ్‌ స్టోన్‌ అనే పేరూ ఉంది. దక్షిణాఫ్రికా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో ఎక్కువగా దొరికే టైగర్‌ ఐ రత్నాలు బర్మా, భారత్‌, కాలిఫోర్నియాల్లోనూ అక్కడక్కడా లభిస్తాయి. చూడచక్కగా ఉండే ఈ రాళ్లను చాలావరకూ ఆభరణాలూ దేవతా ప్రతిమల తయారీకే ఉపయోగిస్తారు. నెక్లెస్‌లూ పోగులూ ఉంగరాలూ బ్రేస్‌లెట్లూ పెండెంట్లూ... ఇలా ఈ రత్నంతో ఎన్నో రకాల నగలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఫ్యాషనబుల్‌గా ఉండి ఇవి ఏ దుస్తులమీదికైనా మ్యాచ్‌ అయిపోతాయి. అన్నట్టు చాలా దేశాల్లో టైగర్‌ ఐని జాతక రత్నంగానూ భావిస్తారు.

ఇందులో భూమితోపాటూ సూర్యుడి శక్తీ ఇమిడి ఉంటుందని చెబుతారు పండితులు. ఈ రాయిని ధరిస్తే ఆలోచనల్లో స్థిరత్వం వస్తుందంటారు. ఊహలను మాని వాస్తవిక పరిస్థితుల్ని అర్థం చేసుకునే శక్తినీ టైగర్‌ ఐ ఇస్తుందట. ఇది మెదడు మీద బాగా ప్రభావం చూపుతుందట. అందుకే, దీనికి మైండ్‌స్టోన్‌గానూ పేరుంది. అనుకున్నది సాధించే దిశగా మనసుని నడిపిస్తుందనీ సృజనాత్మకతనూ పెంచుతుందనే కారణంతో చిత్రకారులూ రచయితలతో పాటు ఇతర కళాకారులూ దీన్ని ధరిస్తుంటారు. ఈ రాయికున్న మంచి లక్షణాలతో పాటు, చెక్కలా కనిపిస్తూ మెరుస్తూ ఉంటుందని దీంతో తయారైన వినాయకుడూ శివలింగం... లాంటి దేవతా మూర్తుల విగ్రహాలను మనదగ్గర పూజ గదుల్లో పెట్టుకుంటారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.