close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇవి తినే పప్పీలు!

ఈ బుల్లి బుల్లి పప్పీలు భలే ఉన్నాయి కదూ... మీకు తెలుసా... వీటిని ఎంచక్కా చప్పరించేయొచ్చు. జపాన్‌కి చెందిన ఫెలిస్సిమో కంపెనీ పంచదారా మొక్కజొన్న పిండీ కలిపి చేసే మాష్‌మలోతో వీటిని తయారు చేసి అమ్ముతోంది మరి. ముద్దు ముద్దుగా ఉన్న ఈ కుక్క పిల్లల్ని ఐస్‌క్రీమ్‌లూ కేకులూ స్వీట్లమీద అలంకరించుకోవచ్చు. బాగున్నాయి కదూ...


అవతార్‌ సినిమాలోలానే...

మొక్కలూ గడ్డీ మీనియేచర్‌ కొండలూ ఆ మధ్యలో అటూ ఇటూ తిరిగే చేపలూ... అక్వేరియం చూడ్డానికి ఎంత బాగుంటుందో. మరి, అవతార్‌ సినిమాలోలా అక్వేరియంలోనూ తేలే కొండలు కనిపిస్తే చూసేవారికి చిత్రంగా ఉండదూ... అలాంటివే ‘అక్వేరియం ఫ్లోటింగ్‌ రాక్స్‌’. ఫ్యుమిస్‌ స్టోన్‌లా తేలిగ్గా ఉండి నీటిలో తేలే ఈ రాళ్లు చిన్న చిన్న కొండల ఆకారంలో ఉంటాయి. వీటికి కనీ కనిపించని సన్నటి వైరు కట్టి ఉంటుంది. దాని చివర ఉండే సక్షన్‌ కప్‌ను అక్వేరియంలో ఎక్కడ అంటిస్తే అక్కణ్నుంచి రాళ్లు తేలినట్లు కనిపిస్తాయి. మామూలుగానూ ఇవి తేలతాయి. కానీ అలా తేలడం వల్ల ఓచోట ఉండవు. అందుకే సక్షన్‌ కప్‌ సాయంతో మనక్కావల్సిన దగ్గర తేలే ఏర్పాటు చెయ్యొచ్చు. అక్వేరియంకు కొత్త లుక్‌ తెద్దామా మరి.


మనకు తగ్గ మంచం!

కాళ్ల దగ్గర నులివెచ్చగా ఉంటే ఎవరైనా త్వరగా నిద్రపోతారట. అందుకే, ‘360 స్మార్ట్‌బెడ్‌’ దానిమీద పడుకోగానే బయటి వాతావరణాన్ని బట్టి కాళ్ల దగ్గర పరుపుని కాస్త వేడి చేస్తుంది. అంతేకాదు, దీని మీద పడుకున్న ఇద్దరు వ్యక్తుల శరీరాకృతిని బట్టీ వారికి సౌకర్యంగా ఉండేలా పరుపు రెండు వైపులా వేరువేరుగా వంపులు తిరుగుతుంది. నిద్రపోతున్న వ్యక్తి గురక పెడుతుంటే వెంటనే గుర్తించి తల దగ్గర కాస్త ఎత్తు పెంచి గురక తగ్గేలా చేస్తుంది. ఇక, మనం రాత్రి ఎంత సేపు పడుకున్నాం అందులో గాఢ నిద్ర ఎంతసేపు ఉంది... ఇలాంటి విషయాలన్నిటినీ ఆప్‌ద్వారా మన ఫోన్‌కి పంపేస్తుంది ఈ స్మార్ట్‌బెడ్‌. ఇది చాలా స్మార్ట్‌ అన్నమాట.


అంటించెయ్యడమే...

అస్తమానం అటూ ఇటూ కదిలే చంటి పిల్లలకు బట్టలు వెయ్యడం కూడా కష్టమే. ఇక వాళ్లు పరుగుకంటే వేగంగా పాకుతుంటే షర్టుకి గుండీలు పెట్టడం ఎంత పెద్ద పనో చంటిపిల్లలున్న అమ్మలకే తెలుస్తుంది. ఈ సమస్యకు
పరిష్కారంగా వస్తున్నవే ‘మ్యాగ్నెటిక్‌ మీ’ పిల్లల బట్టలు. పసిబిడ్డల దగ్గర్నుంచి రెండేళ్ల వయసున్న చిన్నారుల వరకూ రకరకాల డిజైన్ల దుస్తుల్ని అమ్ముతోంది ఈ కంపెనీ. వీటిలో వేటికీ బటన్లుండవు. ఆ స్థానంలో షర్టు అంచుల లోపల చిన్న చిన్న అయస్కాంతాలను అమర్చుతారు. దాంతో ఈ షర్టులూ నిక్కర్ల అంచుల్ని ఒకదానిమీద ఒకటి పెడితే చాలు, అంటుకుపోతాయి. వీటిని తియ్యడమూ సులభమే. ఇక, ఈ అయస్కాంతాలు బట్ట లోపలుంటాయి కాబట్టి, గుండీల్లా గుచ్చుకుంటాయేమోనన్న భయమూ ఉండదు. ‘మ్యాగ్నెటిక్‌ మీ’ దుస్తులు ఆన్‌లైన్‌ షాపుల్లోనూ దొరుకుతున్నాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.