close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఒక్క నిమిషంలో...

ఒక్క నిమిషం... అరవై సెకన్లు. ఇలా కళ్లుమూసి అలా తెరిచేలోపు గడిచిపోతుంది. కానీ ఆ నిమిషంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జరిగిపోతుంటాయి. అవేంటో చూద్దామా..?

* రూ.20.83 లక్షలు... గత ఏడాదిగా భారతీయ కుబేరుడు ముఖేష్‌ అంబానీ సంపాదన ప్రతి నిమిషానికీ ఇంత మొత్తం పెరుగుతోంది.

* ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన అమెజాన్‌ సీయీవో జెఫ్‌ బెజోస్‌ సంపాదన నిమిషానికి రూ.కోటికి పైనే.

* ప్రతి నిమిషం ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ అయ్యే ఫొటోలూ వీడియోల సంఖ్య 66 వేలకు పైనే.
* ఒక్క నిమిషంలో భూగోళంలో 35 ఎకరాల అడవుల్ని నరికివేస్తున్నారు.
* వివిధ దేశాల్లోని జనం అందరూ కలసి ఆన్‌లైన్‌ షాపింగ్‌ కోసం ప్రతి నిమిషం రూ.ఆరు కోట్లను ఖర్చు చేస్తున్నారు.
* నిమిషంలో 15-20 సార్లు కనురెప్పలాడిస్తాం.
* నిమిషానికి భూమ్మీద 144 మంది ఒక చోటు నుంచి మరో చోటుకి తరలిపోవడం లేదా ఇల్లు మారడం చేస్తుంటారట.
* 2018 జులై 16న ‘ప్రైమ్‌ డే’ అమ్మకాల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 69,444 ఉత్పత్తుల్ని అమ్మి అమెజాన్‌ రికార్డు సృష్టించింది.
* వివిధ దేశాల్లో ఉన్న జనం అందరూ కలిపి నిమిషంలో 52.16 లక్షల కిలోల ఆహారాన్ని లాగించేస్తున్నారు. అదే నిమిషంలో 24.94 లక్షల కిలోల ఆహారం వృథాగా చెత్త కుప్పల్లో కలిసిపోతోంది.
* యూట్యూబ్‌లో ప్రతి అరవై సెకన్లకూ 400 గంటల నిడివి ఉన్న వీడియోలు అప్‌లోడ్‌ అవుతున్నాయి.
* పొగ తాగడం, పొగాకు నమలడం వల్ల వచ్చే వ్యాధులు నిమిషానికి 13 మందిని బలి తీసుకుంటున్నాయి.
* 4,500...ప్రపంచవ్యాప్తంగా నిమిషంలో లాగించేసే మెక్‌డొనాల్డ్స్‌ బర్గర్ల సంఖ్య.
* 250... నిమిషంలో ఇంతమంది పిల్లలు భూమ్మీదికొచ్చేస్తున్నారు.
* నిమిషంలో ట్రక్కు ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రంలోకి చేరుతున్నాయి.
* 2800... ఒక్క నిమిషంలో ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే స్మార్ట్‌ ఫోన్ల సంఖ్య.
* అరవై సెకన్లలో 3.8 కోట్ల వాట్సాప్‌ మెసేజ్‌లను పంపేస్తున్నారు.
* ప్రతి నిమిషానికీ ట్విటర్లో నమోదయ్యే ట్వీట్ల సంఖ్య 3.5 లక్షలకు పైనే.
* ఒక్క నిమిషంలో భూమ్మీద 69,444 బ్యారెళ్ల చమురుని ఇంధనంగా వాడేస్తున్నారు.
* ఏం తెలుసుకోవాలన్నా వెంటనే గూగుల్‌లో వెతికేస్తాం కదా... ఇంతకీ నిమిషంలో ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌లో ఎన్ని వెతుకులాటలు జరుగుతున్నాయో తెలుసా... 38 లక్షలు.
* ఒక్కనిమిషంలో... రక్తం మన శరీరంలోని రక్తనాళాల గుండా మూడుసార్లు ప్రవహిస్తుంది.
* 10,416... ప్రతి నిమిషానికీ ఉబర్‌లో బుక్‌ అయ్యే ట్రిప్‌లు.
* 105... ప్రతి నిమిషం ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకునే మరణాల సంఖ్య.
* మనిషి మెదడు నిమిషంలో 900 పదాలను చదవగలదట. మనుషుల్నిబట్టి ఈ లెక్క అటూ ఇటూ అవుతుందిలెండి. ఈ పేజీని మీరెంత టైమ్‌లో చదివారు?

* రోజులో ఏ నిమిషంలో చూసినా 8 నుంచి 10 లక్షలమంది గాల్లోనే ఉంటారట. అంటే, అంతమంది విమానంలో ప్రయాణిస్తుంటారు.

* ప్రపంచవ్యాప్తంగా అరవై సెకన్లలో 15.62 లక్షల కప్పుల కాఫీని తాగేస్తున్నారట.

* ఆర్కిటిక్‌ తీరంలోని మంచు కరగడం వల్ల సముద్రాల్లోకి అరవై సెకన్లలో 8,40,000 టన్నుల నీరు చేరుతోంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.