close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సోంపు తింటున్నారా?

భోజనానంతరం అరగడానికి నమిలే సోంపులో పీచు, విటమిన్‌-సి, కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్‌... వంటి పోషకగుణాలతోబాటు ఔషధగుణాలు మరెన్నో. ఇందులోని విటమిన్‌-సి రోగనిరోధకశక్తిని పెంచి దెబ్బతిన్న కణాలను బాగుచేస్తుంది. హానికర ఫ్రీ రాడికల్స్‌ని నియంత్రిస్తుంది.
* గింజల్లో యాంటీఆక్సిడెంట్లతోబాటు ఔషధగుణాలు కలిగిన కర్బన పదార్థాలు చాలానే ఉన్నాయి. అవన్నీ యాంటీక్యాన్సర్‌, యాంటీమైక్రోబియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండటంతో అనేక వ్యాధుల్ని అడ్డుకుంటాయి.
* రోజూ రెండు గ్రా. గింజలతో కషాయం చేసుకుని తాగేవాళ్లలో ఆకలి తగ్గుతుందట. ఇందులోని అనెతోలె అనే గాఢతైలానికి ఆకలిని తగ్గించే గుణం ఉందని అనేక పరిశీలనల్లో తేలింది.
* సోంపు గింజల్లోని పీచు కారణంగా హృద్రోగాలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇందులోని పొటాషియం బీపీ పెరగకుండానూ కాపాడుతుంది. 
* ఈ గింజల్లోని అనెతోలె అనే శక్తిమంతమైన పదార్థానికి రొమ్ము, కాలేయ క్యాన్సర్‌ కణాలు వ్యాపించకుండా అడ్డుకునే శక్తి ఉందని అనేక 
పరిశీలనల్లో స్పష్టమైంది. 
* సోంపులోని డైఅనెతోలె, ఫొటోఅనెతోలె వంటి పదార్థాలు బాలింతల్లో పాలు బాగా పడేలా చేస్తాయట.
* సోంపు వయసుతోబాటు వచ్చే వృద్ధాప్యాన్నీ, మెనోపాజ్‌లో తలెత్తే సమస్యల్నీ తగ్గిస్తుంది. కాబట్టి రోజూ కాసిని సోంపు గింజల్ని నోట్లో వేసుకోవడం మర్చిపోకండి. 

ముసలితనం రాకుండా...

వృద్ధాప్యంలోనూ హుషారుగా, చలాకీగా తిరగాలని ఎవరికి ఉండదు? అదీ ఓ ట్యాబ్లెట్‌ వేసుకుంటే చాలు, ఎక్కడలేని శక్తినీ పుంజుకోగలమంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ మెడికల్‌ బ్రాంచ్‌కు చెందిన పరిశోధకులు. సాధారణంగా 35 సంవత్సరాలు దాటినప్పటి నుంచీ కండరాలూ, ఎముకల్లో శక్తి సన్నగిల్లుతుంటుంది. దెబ్బతిన్న కణాలు తిరిగి వృద్ధిచెందడం కూడా తగ్గుతుంది. దాంతో కండరాల పరిమాణం కూడా తగ్గి ముసలితనం మీదపడుతుంటుంది. దీన్ని ఆపగలిగే చికిత్సలేవీ ఇంతవరకూ రాలేదు. అయితే తొలిసారిగా వృద్ధాప్యంలోనూ బలంగా చురుగ్గా ఉండేందుకు ఓ మందును కనిపెట్టాలనుకున్నారు పరిశోధకులు. అందులో భాగంగా కండరాల క్షీణతకు కారకమయ్యే ప్రొటీన్‌ని గుర్తించి, అది పనిచేయకుండా ఉండేలా ఓ మందుని రూపొందించారు. అంతేకాదు, ఈ సరికొత్త మందు  కండరాల మూలకణాల్ని తిరిగి పునరుద్ధరించేలా చేయడంతోబాటు దెబ్బతిన్న కండర కణజాలాన్ని బాగుచేయగలదని తేలింది. ఇందుకోసం ఆ మందుని ముందుగా ముసలి ఎలుకల్లో ప్రయోగించి చూడగా- కండరాలు 70 శాతం వరకూ శక్తిని పుంజుకున్నాయట. అంటే మున్ముందు డెబ్భయ్యేళ్లవారూ చురుగ్గా పరుగులు తీసే రోజు రానుందన్నమాట.

మెరిసిపోదామా!

చర్మం రంగు తెలుపా చామనఛాయా అన్న దాంతో సంబంధం లేకుండా అది ప్రకాశవంతంగా మెరుస్తుంటే చూసేకొద్దీ చూడాలనిపిస్తుంటుంది. అందుకే చర్మం మెరుపుని సంతరించుకోవడానికి రకరకాల క్రీమ్‌లు వాడుతుంటారు. కానీ వాటికన్నా ఇంట్లోని చిట్కాలతో అందంగా మెరిసేలా చేయవచ్చు. అదెలా అంటే...
* బియ్యం, నువ్వులు చెరి సగం తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. తరవాత రెండింటినీ కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తరవాత చల్లని నీటితో కడిగేయాలి. దాంతో చర్మం తేమని సంతరించుకుని అందంగా మెరుస్తుంటుంది.
* కొవ్వు తక్కువగా ఉన్న పాలని తీసుకుని దాన్ని ముఖానికి పలుచని పూతలా వేసి చర్మంలో కలిసిపోయేలా మృదువుగా మర్దన చేయాలి. ఆ తరవాత ఫేస్‌వాష్‌తో కడిగేస్తే ముఖంమీద ఉన్న నల్ల 
మచ్చలన్నీ తొలగిపోయి, నున్నగా మెరుస్తుంది.
* ముఖాన్ని శుభ్రంగా కడిగి తేనె, ముల్తానా మట్టి కలిపిన మిశ్రమాన్ని పట్టించి పావుగంట తరవాత కొద్దిగా నీళ్లు తీసుకుని మెల్లగా మర్దన చేస్తున్నట్లుగా రుద్ది కడిగేయాలి. తరవాత కోల్డ్‌ క్రీమ్‌లాంటిది పలుచగా రాసి పడుకోవాలి. రోజూ ఇలా చేస్తుంటే క్రమంగా చర్మం మెరుపుని సంతరించుకుంటుంది.

టూకీగా...

అవిసె గింజల్లోని పీచు జీర్ణశక్తికి తోడ్పడే పొట్టలోని బ్యాక్టీరియాని పెంచుతుందనీ, దాని ఫలితంగా జీవక్రియా వేగం పెరుగుతుందనీ తద్వారా ఊబకాయం తగ్గుతుందనీ డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌, స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయాల నిపుణుల పరిశీలనల్లో తేలింది.
* జింక్‌ లోపంతో బాధపడేవాళ్లకి బీపీ వచ్చే అవకాశం ఉందని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ పేర్కొంటోంది.
* శ్వాసకోశ సంబంధ సమస్యలతో బాధపడేవాళ్లు విటమిన్‌-డి సప్లిమెంట్లు తీసుకోవడంవల్ల ఆ వ్యాధులు తగ్గుముఖం పడతాయన్నది లండన్‌లోని క్వీన్‌మేరీ విశ్వవిద్యాలయ నిపుణుల పరిశోధన.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.