close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఊసరవెల్లి అమ్మాయిలు!

ఆకుల్లో ఉంటే ఆకు రంగులో కొమ్మ మీద ఉంటే కొమ్మ వర్ణంలోకీ మారిపోయే ఊసరవెల్లిని కనిపెట్టడం చాలా కష్టం. అలా అని అదేం పెద్ద గొప్ప కాదులెండి. ఎందుకంటే, మనుషులు రంగులు మార్చితే ఊసరవెల్లి సైతం అక్కడున్నది మనిషా లేక తనలాంటి మరో ఊసరవెల్లా అన్నది తెలుసుకోలేదు. అసలు విషయం ఏంటంటారా... ఇక్కడ కనిపించేది ఊసరవెల్లి కాదు... ఇటలీకి చెందిన బాడీ పెయింటింగ్‌ ఆర్టిస్ట్‌ జొహెనెస్‌ స్టోటర్‌ ఇద్దరమ్మాయిలకు బాడీ పెయింటింగ్‌ వేసి ఇలా మార్చాడు. ఓసారి మీరూ పరీక్షగా చూడండి... ఊసరవెల్లి కాళ్లున్న చోట అమ్మాయిల చేతులూ ఆపైన వాళ్ల శరీరాలూ కనిపిస్తాయి.

అచ్చం అనుష్కలా...

బాలీవుడ్‌ అందాల నటీ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ భార్యా అయిన అనుష్క శర్మ గురించి తెలియని వారు దాదాపు ఉండరు. మరి, ఈ ఫొటోలో ఆమె పక్కన ఉన్నదెవరో తెలుసా... ‘ఏదో సినిమాకోసం అనుష్క జుట్టుకి తెల్లరంగు వేస్తే ఆమాత్రం గుర్తు పట్టలేం అనుకుంటున్నారా...’ అనేయకండి. ఆ రెండో అమ్మాయి ముమ్మాటికీ అనుష్క కాదు. అచ్చం ఆమెలా ఉన్న జూలియా మైఖేల్స్‌. తను అమెరికాకు చెందిన గాయని. వీళ్లిద్దరూ ఒకేలా ఉండడాన్ని గమనించిన వాళ్లు కొన్నాళ్ల నుంచీ ఇద్దరి ఫొటోల్నీ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చెయ్యడం మొదలుపెట్టారు. అవి వైరల్‌ అవడంతో జూలియా మైఖేల్స్‌ ఈమధ్య ఆ ఫొటోల్ని అనుష్కాశర్మకు ట్వీట్‌ చేసింది. ‘మనిద్దరం ట్విన్స్‌లా ఉన్నాం’ అన్న ఆమె ట్వీట్‌కి స్పందించిన అనుష్క ‘ఓ మై గాడ్‌, అవును. నాలాగే ఉన్న నిన్నూ మరో అయిదుగుర్నీ కనిపెట్టాలని ఎప్పట్నుంచో వెతుకుతున్నా’ అని సరదాగా రిప్లై ఇచ్చింది. వీళ్లిద్దర్నీ చూస్తుంటే మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురుంటారన్న మాట నిజమే అనిపిస్తోంది కదూ...

కోటలు కాదు ఇళ్లు

ఎక్కడైనా పురాతన కోటలు ఒకటీ రెండూ కనిపిస్తేనే వాటిని ఎంతో ఆసక్తిగా చూస్తాం. అలాంటిది ఓ ఊరు నిండా డిస్నీ సినిమాల్లో కనిపించేలాంటి వందలకొద్దీ చిన్న చిన్న కోటలు ఉంటే చూడ్డానికి ఎంత బాగుంటుందో కదా... అవే ఈ ఫొటోల్లో కనిపిస్తున్న విల్లాలు. అవును,  టర్కీలోని ముదుర్ను పట్టణానికి దగ్గర్లో ఉన్న ఈ కోటలన్నీ అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఇళ్లు. 732 విల్లాలతో వేసిన ఈ వెంచర్‌ మొత్తం విలువ సుమారు పద్నాలుగు వేల కోట్లరూపాయలట. సారోత్‌ గ్రూప్‌ అనే స్థానిక కంపెనీ ప్రాచీన ఫ్రెంచ్‌ కోటల నిర్మాణ శైలిలో కట్టిన ఈ ఇళ్లు ఒకేలా ఉండి చూపరుల్ని ఆకట్టుకుంటున్నాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.