close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ మొక్కలు పాడతాయి

సహజమైన మొక్కలూ... సొగసైన రంగుల కాంతులూ... మైమరపించే సంగీతం... ఈ మూడూ మనసుకు ఆనందాన్ని పంచేవే. ఆలోచనలకు ఉత్తేజాన్ని ఇచ్చేవే. అయితే ఈ మూడింటినీ ఒకే రూపంలోకి మార్చేసి మనముందుకు తెస్తున్నవే ‘స్మార్ట్‌ మ్యూజిక్‌ ఫ్లవర్‌ పాట్‌లు’.
అందమైన కుండీకే యూఎస్‌బీ ఛార్జర్‌, బ్లూటూత్‌, ఎల్‌ఈడీ బల్బులను జతచేసి స్మార్ట్‌ కుండీలను తయారుచేస్తున్నారు. దీని బటన్‌ను నొక్కి కుండీలోని మొక్క ఆకులను తాకితే పియానో వాయిస్తున్నట్టుగా రకరకాల స్వరాలు మోగుతాయి. బ్లూటూత్‌తో స్మార్ట్‌ ఫోన్‌కి కనెక్ట్‌చేసి నచ్చిన పాటను వినొచ్చు. రాత్రిపూట ఎల్‌ఈడీ లైట్లను ఆన్‌చేసి చీకటికి రంగులద్దడంతోపాటు బెడ్‌ల్యాంప్‌గానూ వాడుకోవచ్చన్నమాట.


 

బొమ్మతో ఇట్టే వేసేయొచ్చు

మందులేసుకోవడం అంటే పెద్దవాళ్లకే చాలా కష్టమైన పని. ఇక పిల్లలకు మందులేయాలంటే అమ్మలకు అదో యుద్ధమే. అదిగో బూచి అని భయపెట్టినా ఇదిగో తాయిలమని ఆశ చూపినా - మందు వెయ్యబోతున్నారని ఇట్టే కనిపెట్టేసి వద్దంటే వద్దని మారాం చేస్తారు. అలాంటప్పుడు అమ్మల పనిని ఈజీ చేయడానికి మార్కెట్‌లోకి వస్తున్నవే ‘అవా ద ఎలిఫెంట్‌ టాకింగ్‌ చిల్డ్రన్స్‌ మెడిసిన్‌ డిస్పెన్సర్‌’. ఏనుగు ముఖాకృతిలో ఉండే ఈ బొమ్మకు పొడవాటి తొండం ఉంటుంది. టానిక్‌తో నింపిన డ్రాపర్‌ని ఆ తొండంలో ఫిట్‌ చేసి, బొమ్మకు వెనకున్న బటన్‌ని నొక్కితే రకరకాల శబ్దాలు చేస్తూ పిల్లలను ఆకర్షిస్తుంది. అదేంటో అనుకుని పిల్లలు ఆ బొమ్మను నోట్లో పెట్టుకోగానే డ్రాపర్‌ని నొక్కి సులువుగా మందులు వేసేయొచ్చు.

 


 

కాలి పగుళ్లకు సాక్సు

చిన్నాపెద్దా అని తేడాలేకుండా ఎక్కువమందిని వేధించే సమస్య మడమల నొప్పి. ఎక్కువసేపు నిలబడి పనిచేసేవారికి ఈ నొప్పి మరీ ఎక్కువగా ఉంటుంది. ఉన్న సమస్య చాలదన్నట్టు దానికి కాలి పగుళ్లు కూడా తోడైతే నిలబడడం, నడవడం నరకంగా మారతాయి. పగుళ్ల వల్ల నడుస్తున్నప్పుడు కాలికి ఏదైనా తగిలితే ప్రాణం పోయినంత నొప్పిగా ఉంటుంది. అలా అని నడవకుండా ఒకచోట కూర్చుని ఉండలేం కదా. దీనికి పరిష్కారమే బజారులోకి వస్తున్న ‘సిలికాన్‌ జెల్‌ హీల్‌ సాక్‌’. పలుచగా మడమలకు పట్టి ఉండే ఈ సాక్సు వేసుకుని తర్వాత మామూలుగా షూ లేదా చెప్పులు తొడుక్కోవచ్చు. ఇవి మడమలను పట్టి ఉంచడం వల్ల నడుస్తున్నప్పుడు నొప్పి తెలియకుండా ఉండటమేకాదు ఇందులో ఉండే సిలికాన్‌ జెల్‌ కాళ్ల పగుళ్లు తగ్గడానికీ ఉపయోగపడుతుంది.


 

నిమిషాల్లో...నచ్చిన మాస్క్‌

పని ఒత్తిడి, కాలుష్యం... కారణం ఏదైనా దాని ప్రభావం ముఖంమీద పడుతున్న మాట నిజం. పాడయిన చర్మం మళ్లీ తాజాగా, కాంతులీనేటట్లు చేయడానికి సాధారణంగా ఆడవాళ్లు ఎంచుకునే మార్గం ఫేషియల్స్‌. అయితే కాలం కంటే వేగంగా పరిగెడుతున్న ఈ రోజుల్లో పార్లర్లలో గంటలకొద్దీ సమయాన్ని కేటాయించడానికి అస్సలు కుదరదు. అలాంటి వారికి చక్కటి పరిష్కారంగా బజారులోకి వస్తున్నవే ‘ఫేస్‌ మాస్క్‌ మెషీన్‌లు’. మనకు నచ్చిన పండ్ల రసాలను ఇందులో పోస్తే చాలు, క్షణాల్లో ఫేస్‌మాస్క్‌ రెడీ అయిపోతుంది. అచ్చమైన పండ్లతో మనమే
ఈ మాస్కులను సొంతంగా తయారుచేసుకుంటాం కాబట్టి ఏవైనా కెమికల్స్‌ వాడారేమోనన్న అనుమానం కూడా ఉండదు. దీంతో సహజంగా తక్కువ సమయంలోనే నచ్చిన ఫేస్‌ మాస్క్‌ను ఇంట్లోనే వేసేసుకోవచ్చన్నమాట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.