close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చాంద్‌బాలీ నెక్లెస్‌లు

 

నెలవంకను తుంచి దానికి బంగారు పోతపోసి తయారుచేసినట్టుగా ఉండే చాంద్‌బాలీ జుంకాలు ఎవర్‌గ్రీన్‌ ఫ్యాషన్‌. అంత అందమైన వాటిని చెవులకే పరిమితం చేసేస్తే ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏముంటుంది చెప్పండి. అందుకే అర్ధచంద్రాకృతిలోని ఈ బిళ్లలను మెడ చుట్టూ పేర్చి, బంగారు గుండ్లతో గుదిగుచ్చి, రత్నాలూ వజ్రాలూ పొదిగి సొగసైన నెక్లెస్‌లను తయారుచేస్తున్నారు నేటి ఫ్యాషన్‌గురూలు. చాంద్‌బాలీ డిజైన్‌కు మధ్యలోనూ కిందా చిన్నచిన్న బంగారు గుండ్లూ, లక్ష్మీరూపులను జోడిస్తూ వాటికి అదనపు సొబగులు అద్దేస్తున్నారు. ఒక్క చాంద్‌బాలీ చెవిపోగుకే ఫిదా అయిపోయిన నేటి అమ్మాయిల మనసును ఇవి ఇట్టే కట్టిపడేస్తాయనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.

నగల బ్యాండ్‌ వేసేద్దాం

మగువ జడను మరింత అందంగా ముస్తాబు చేసుకోవడానికో వాలుజడలో వయ్యారాలు ఒలకబోసే పూలకు పసిడికాంతులను అద్దడానికో... కారణం ఏదైనా కాళ్లకు పట్టీల్లా మెడకు అందమైన గొలుసుల్లా తలకూ ఓ ఆభరణం ఉండాల్సిందే అంటారు నేటి మహిళలు. సూర్య వంక, చంద్ర వంక, చూడామణి, బంగారు చామంతులూ, జడ బిళ్లలూ... ఇలా తలను అలంకరించుకోవడానికి ఎన్ని రకాల ఆభరణాలున్నా మరో కొత్త నగ కోసం మగువ మనసు వెతుకుతూనే ఉంటుంది. అలాంటి వారికోసం రూపొందించినవే ఈ బంగారు రబ్బరు బ్యాండ్లు. సాధారణ రబ్బరు బ్యాండ్‌కే పచ్చలూ కెంపులూ గుదిగుచ్చి తయారుచేసిన బంగారు బిళ్లలను జతచేస్తున్నారు. బ్యాండ్‌ పాడైనా లేదా మ్యాచింగ్‌ బ్యాండ్‌ పెట్టుకోవాలనుకున్నా ఈ బంగారు బిళ్లల వెనకున్న హుక్కు సహాయంతో వేరే బ్యాండ్‌కి అమర్చేసుకోవచ్చు.
 

అందమైన భక్తి 

భారతదేశంలో ఆడవారికి భక్తి ఎంత ఎక్కువో బంగారం మీద మక్కువా అంతే ఎక్కువ. అలాంటప్పుడు అటు భక్తినీ ఇటు ఫ్యాషన్‌నీ జతచేస్తే అదిరిపోదూ... అనుకున్నారో ఏమో శ్రీవారి గోవింద నామానికి శంఖచక్రాలనూ జతచేసి అందమైన లాకెట్లను రూపొందిస్తున్నారు. వాటికి పచ్చలూ కెంపులూ అంటూ రకరకాల రంగురాళ్లను పొదిగేస్తూ ఒక కొత్త ట్రెండ్‌కి తెరతీస్తున్నారు. వడ్డికాసులవాడి నామాలూ ఆయుధాల రూపాలను అందమైన ఆభరణాల్లా మార్చేస్తూ నగల్లోనూ భక్తిని చాటుకుంటున్నారు. ఈ తరహా నగ ఒక్కటి పెట్టుకుంటే చాలు సంప్రదాయ నగలకు ట్రెండీ లుక్కును ఇట్టే తీసుకొచ్చేయొచ్చు. అందుకే చిన్నాపెద్దా అని తేడాలేకుండా ప్రతిఒక్కరూ ఈ నామాల లాకెట్లకే ఓటేస్తున్నారు.


 
 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.