close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆమె

ఆమెకి కావలసినంత టైమ్‌ తీసుకోనివ్వండి... ఆమె తాగే కప్పు కాఫీ అయినా హాయిగా తాగనివ్వండి. ఎన్ని ఉదయాలు తనవాళ్ళ కోసం ఎన్ని చల్లని కాఫీలు తాగలేదు ఆమె! అందరికీ అన్నీ రెడీచేసి, అలసిపోయి కాఫీ కప్పు తీసుకుని కూర్చున్న ఆమెను కాసేపు అలాగే ఉండనివ్వండి!

బయట హోటల్‌కి వెళ్ళినపుడు ఆమెకి నచ్చినవి ఆర్డర్‌ చెయ్యనివ్వండి... రోజూ ఇంట్లో అందరికీ ఇష్టమైనవి వండడమే తప్ప ఒక్కరోజైనా తనకు నచ్చింది వండుకుందామని ఆమె ఆలోచించదు కదా..! బయటకి వెళ్ళేటప్పుడు తయారవ్వడానికి ఆమెకి కావలసినంత సమయం తీసుకోనివ్వండి... తన భర్తా పిల్లలూ అందరిముందూ అందంగా కనిపించాలని వారి బట్టలు ఉతికి, ఇస్త్రీ చేసి, గుండీలూ అవీ సరిగా ఉన్నాయా లేదా అని పదేపదే చెక్‌ చేసి అందరికీ అన్నీ ఆమె సమయానికి సమకూర్చలేదా? టీవీ చూసే పది నిమిషాలు అయినా ఆమెకి నచ్చినది చూడనివ్వండి...ఆమె ఎంతసేపు చూస్తుందని? చూసినా పరధ్యానంగానే కదా... ‘అయ్యో, ఆయనకీ పిల్లలకూ డిన్నర్‌ టైమయిందేమో, అత్తగారికి మందుల టైమేమో’ అన్న ధ్యాసే కదా ఆమెకెప్పుడూ! బ్రేక్‌ఫాస్ట్‌ ఆలస్యం చేస్తే చెయ్యనివ్వండి... మనకి బాగా రుచిగా చేసిపెట్టాలన్న తాపత్రయంతోనే కదా ఎప్పుడైనా కాస్త ఆలస్యం. మాడినవీ పనికిరానివీ తనకోసం ఉంచుకుని రుచిగా ఉన్నవీ బాగున్నవీ మనకు వడ్డిస్తుంది కదా పాపం. సాయంత్రం వేళ టీ తాగాక, కాసేపు అన్నీ మరచి హాయిగా కిటికీలోంచి బయట ప్రపంచాన్ని చూస్తూ తననితాను మరచిపోతే పోనివ్వండి... ఎన్ని సాయంత్రాలు ఇంటి పనుల కోసం కేటాయించలేదు ఆమె. ఎన్ని పగళ్ళూ ఎన్నెన్ని రాత్రులూ తనవారి కోసం నిద్రా తిండీ మాని సేవ చేయలేదు. మరి తనకోసం జీవితంలో ఆమాత్రం సమయం ఇవ్వడం మన కనీస బాధ్యత కదా..!


అలాగా!
ప్రపంచంలో మగవాళ్ళు చెప్పే అతిపెద్ద అబద్ధం... ఇంట్లో నా నిర్ణయమే ఫైనల్‌. ఆడవాళ్ళుచెప్పే అతి పెద్ద అబద్ధం... నాదేముంది, మా ఆయన్ని అడిగి చెబుతాను.

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.