close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గులాబీలు మీ ఫొటోతో..!

గులాబీ ప్రేమకే కాదు, అభిమానానికీ, స్నేహానికీ కూడా ప్రతీక. అందుకే ప్రియమైన వాళ్లకు శుభాకాంక్షలు చెప్పేటప్పుడు ఈ అందాల పువ్వు ఎప్పుడూ ముందే ఉంటుంది. ఆ గులాబీకి సరికొత్త సొగసుల్ని అద్దుతూ... శుభాకాంక్షలకు కొంగొత్త రూపాన్నిస్తూ ఇప్పుడు ఫొటో ప్రింటెడ్‌ రోజెస్‌ మనముందుకు వస్తున్నాయి. మనసుకు నచ్చిన వారి ఫొటో కనిపించడమే ఈ రోజాల ప్రత్యేకత.

అందాల పూలను బహుమతులుగా ఇవ్వడం ఎప్పటి నుంచో మనకు అలవాటు. అభిమానాన్ని చూపించడానికైనా, ఆత్మీయతను చాటడానికైనా, స్నేహ పరిమళాలు పూయించడానికైనా పూలకు మించిన కానుకలు కనిపించవు. చూడచక్కగా తీర్చిదిద్దిన బొకేల రూపంలో ఇచ్చినా ఆకట్టుకునే విడిపూల రూపంలో అందించినా వేటి ప్రత్యేకత వాటిదే. కానీ పూలను మాత్రం ఎందుకు ఎప్పుడూ ఒకే తరహాలో ఇవ్వాలి... వాటి మీదా మన ముద్ర కనిపించేలా, తీసుకున్న వాళ్లు ఇది తమకు ప్రత్యేకమనిపించేలా కొత్తగా ఏదన్నా మార్పు చేస్తే బాగుంటుంది కదా... అనే ఫ్లోరిస్టుల ఆలోచనల ఫలితంగానే ‘ఫొటో ప్రింటెడ్‌ రోజెస్‌’ పుట్టుకొచ్చాయి. అంటే ఈ తరహా గులాబీల మీద మనకు నచ్చిన వాళ్ల ఫొటో ముద్రించి ఉంటుందన్నమాట. మనం ఫొటో ఇస్తే చాలు ఎరుపూ, తెలుపూ, పీచ్‌, గులాబీ... ఇలా ఏ రంగు గులాబీ మీద కావాలంటే ఆ రంగు గులాబీ మీద దాన్ని అచ్చేసి ఇస్తారు. నలుపూ తెలుపుతో పాటు వివిధ రంగుల్లోనూ ఈ ఫొటోలు ప్రింట్‌ అవుతున్నాయి. పెళ్లికూతురు పెళ్లికొడుకు, భార్య భర్త, అమ్మా పాపాయిలతో పాటు స్నేహితుల ఫొటోలూ, అభిమాన కథానాయకుల చిత్రాలతో వీటిని రూపొందిస్తున్నారు. ఇలా ఫొటో అచ్చేసిన గులాబీలను మిగతా పూలూ ఆకులకు కలిపి బొకేలుగానూ తయారు చేస్తున్నారు. పుట్టిన రోజు, పెళ్లి, వివాహ వార్షికోత్సవం, ఫ్రెండ్‌షిప్‌డే, వేలంటైన్స్‌డే... ఇలా వేడుక ఏదయినా ఈ తరహా పూలను బహుమతిగా అందిస్తే చూసిన వాళ్లు ఆశ్చర్యపోకుండా మాత్రం ఉండలేరు. అలిగిన ప్రేయసికి తన సొగసైన బొమ్మను గులాబీ రూపంలో అందిస్తే అమాంతం అబ్బాయిని అల్లుకుపోదూ! సీరియస్‌బాస్‌ను సిన్సియర్‌గా ఫ్లాట్‌ చేయాలన్నా ఇంతకు మించిన అందమైన ఎత్తుగడ ఇంకోటి కనిపించదు. ఇక అమ్మలకు పాపాయితో కలిసి ఉన్న ఫొటోను ముద్రించి ఇస్తే ఆ పూలనూ పాపాయంత ప్రేమిస్తారనడంలో సందేహమక్కర్లేదు. మొత్తానికి, చిన్నా పెద్దా తేడా లేకుండా ఎవరి మనసునైనా దోచేయాలంటే ఈ ప్రింటెడ్‌ రోజెస్‌ ఓ మంచి బహుమతి. అందుకే హైదరాబాద్‌ సహా దేశంలోని ప్రముఖ నగరాలన్నింటిలో ఎన్నో సంస్థలు ఈ తరహా సేవల్ని అందిస్తున్నాయి. ఈసారి వేడుకకి మీ ప్రియమైన వారి గుండెల్లో ఈ గులాబీ బాణాలు గుచ్చేయండి మరి!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.