close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొవ్వొత్తి వెలుగుతోంది... కొత్తగా!

దీపావళి... అంటేనే దీపాల పండుగ. ఆరోజు ఇల్లూ వాకిళ్లే కాదు, ఆకాశం కూడా వెలుగుల అందాలతో కనువిందు చేస్తుంది. ఇక, పండుగ రోజు ప్రమిదలకు పసుపూ కుంకుమా రాసి నూనె పోసి వత్తులు వెలిగిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ రోజులు మారాయి. సంప్రదాయం కూడా రోజురోజుకీ సరికొత్తగా ముస్తాబవుతోంది. అవును, పండుగైనా పార్టీ అయినా ఏం చేసినా ఎంత అందంగా ఇంకెంత వినూత్నంగా చేశామన్నదే ఈతరం పాటిస్తున్న మంత్రం. అందులో భాగంగానే ఒకప్పటి సాదాసీదా మట్టి ప్రమిదలకు రకరకాల రంగులద్దడం, చమ్కీలు అంటించడం మొదలు పెట్టారు. వాటిలో రకరకాల ఆకారాల్లో రూపొందించినవీ వస్తున్నాయి. అయితే, పట్టణాలూ నగరాల్లో ఉండే చిన్న చిన్న ఇళ్లలో ఎక్కువ ప్రమిదల్ని పెట్టడం వీలుకాదు. పైగా ఇప్పుడందరివీ హడావుడి జీవితాలు. అందుకే, మరీ ఎక్కువ సంఖ్యలో ప్రమిదల్ని వెలిగించి పెట్టడం కష్టం కాబట్టి, ప్రమిదలతో పాటు కొవ్వొత్తుల్నీ వెలిగించడం ప్రారంభించారు. అలా కొవ్వొత్తులూ దీపావళి పండుగలో భాగమైపోయాయి. ‘ఇదంతాసరే, ప్రమిదల్నీ కొవ్వొత్తుల్నీ అందరూ పెడతారు. అన్నిటి వెలుగూ ఒకేలా ఉంటుంది. మరి మన ప్రత్యేకత చూపించేదెలా...’ అనుకునేవారికోసం వస్తున్నవే ఈ వినూత్నమైన కొవ్వొత్తులు.

బర్గర్లూ బిస్కెట్లూ, కోతులూ కోడిగుడ్లూ, పండ్లూ పాలూ, నోట్ల కట్టలూ, మొక్కజొన్న కండెలూ, కుండీల్లోని మొక్కలూ, బహుమతి ప్యాక్‌లూ ఇలాంటి రూపాలతో పాటు, చేతిలానూ మనిషి ముఖంలానూ... ఇలా ఎన్నో రూపాల్లో రూపొందుతున్నాయివి. ‘ఇవి కొవ్వొత్తులు...’ అని చెప్పినా నమ్మలేనంత వింత వింత రూపాల్లో ఉండడమే వీటి ప్రత్యేకత. మామూలు ప్రమిదలకు తోడు ఓ పక్కన ఇలాంటి వాటిని కొన్నిటిని పెట్టి ఇంటిల్లిపాదినీ కాసేపు ఆశ్చర్యానందాల్లో ముంచెత్తొచ్చు. వీటిలో రంగు రంగుల మంటలొచ్చేవీ హైటెక్‌ ఫీచర్లున్నవీ బల్బులా కనిపించేవీ... ఇలా రకరకాల ఫీచర్లతోనూ ఎన్నో వస్తున్నాయి. మరి ఈ దీపావళిని చేద్దామా ఇంకొంచెం కొత్తగా.

దేనికైనా మ్యాచింగే