close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నట్టింట్లో చిట్టిల్లు

బొమ్మరిల్లు. అదో పిల్లల ఆటవస్తువు. చిన్న పిల్లలు ఉన్నవారింట్లో మాత్రమే కనిపించే వస్తువు. కానీ ఇది నిన్నమొన్నటి మాట. ఎందుకంటే... ఇప్పుడు బొమ్మరిళ్లు అలంకరణ వస్తువులు కూడా. ఇంటిని అందంగా తీర్చిదిద్దాలంటే అందమైన బొమ్మల్ని షోకేసుల్లో పెట్టడం, చూడచక్కని పెయింటింగుల్ని గోడకు తగిలించడం... అందరికీ తెలిసిందే. అయితే, ఆ బొమ్మల్లో మన కళ్లకు నచ్చేవే కానీ మనసుకు నచ్చేవి చాలా తక్కువ. ఆ లోటును భర్తీ చెయ్యడానికి వచ్చినవే ఈ మీనియేచర్‌ డాల్‌హౌస్‌లు. పెద్దరికం... పిల్లలకెంతో నచ్చే అనుకరణయితే, బాల్యం... పెద్దవాళ్లకు ఓ అందమైన జ్ఞాపకం. అవునుమరి, ఎంత పెద్దయినా చిన్న చిన్న బొమ్మరిళ్లను చూసినపుడు మనసులోతుల్లోని ఆ జ్ఞాపకాలు కళ్లముందుకొచ్చినట్లనిపించదూ... అందుకే, పిల్లలు ఆడుకునేందుకూ పెద్దలకు ఇంటి అలంకరణకు పనికొచ్చేలానూ మీనియేచర్‌ డాల్‌హౌస్‌లను రూపొందించి ఆ ఇద్దరి మనసుల్నీ దోచేస్తున్నారు కొందరు సృజనకారులు.

ఫ్రేముల్లానూ...
మినీ డాల్‌హౌస్‌లు చూడ్డానికి చిన్న ల్యాప్‌టాప్‌ వెడల్పులో ఉంటాయి కానీ, పెద్ద పెద్ద బొమ్మరిళ్లలో ఉండే అన్ని హంగులూ ఆర్భాటాలూ వీటిలో ఉంటాయి. ఇంట్లోని కిటికీలకు కర్టెన్ల దగ్గర్నుంచీ మంచమూ దానిమీద దుప్పట్లూ దిండ్లూ, చిన్న చిన్న బీరువాలూ అందులో ఇంకా చిన్న వస్తువులూ పుస్తకాలూ, టేబుల్‌ మీద కంప్యూటరూ గోడకు గడియారమూ పెయింటింగులూ, బుల్లి డ్రెస్సింగ్‌ టేబుళ్లూ కుర్చీలూ, ఫ్లవర్‌ వేజ్‌లూ, మొక్కల కుండీలూ... ఇలా ఈ చిట్టి బొమ్మరిళ్లలో లేని వస్తువులుండవు. అంత చిన్న బొమ్మరింట్లో అన్నన్ని వస్తువుల్ని అచ్చం నిజమైన వాటిలా రూపొందించి పెట్టడమంటే ఎంత గొప్ప విషయమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీటిలో చిన్నగా పెట్టెల్లా ఉండే ఇళ్లను టేబుల్‌ మీదా షోకేసుల్లోనూ వాల్‌ షెల్ఫుల్లోనూ అలంకరణకు పెట్టుకోవచ్చు. ఇవి పిల్లలు కావలసినపుడు తీసుకుని ఆడుకునేందుకూ వీలుగా ఉంటాయి. అలాకాదు, ఏ గోడకో పెయింటింగులా తగిలించేస్తే బాగుంటుందనుకునేవారికి ఫొటో ఫ్రేముల్లానే ఉండే పలుచటి పెట్టెల్లోపల బొమ్మరిళ్లను రూపొందిస్తున్నారు. ఇక, ఈ మినీ డాల్‌హౌస్‌లలో ఉండే మరో ప్రత్యేకత ఏంటంటే వీటిలోని లైట్లను రాత్రిపూట వెలిగించొచ్చు. కాబట్టి, పగలూ రాత్రీకూడా ఈ చిట్టి ఇళ్లు మన ఇంటికి కొత్తందాన్నీ మనసుకు ఆనందాన్నీ ఇస్తాయనడంలో ఆశ్చర్యమేముందీ. మీకూ నచ్చాయా అయితే, ఇంకెందుకాలస్యం, ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చేయండి.


  ణిపూర్‌లోకెల్లా ఎత్తైన కొండశిఖరం మీద ఉన్న చిన్న పట్టణమే ఉఖ్రూల్‌. అక్కడినుంచి 35 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే లాంగ్‌పీ గ్రామాలకు చేరుకోవచ్చు. ఎలా మొదలైందో తెలియదుకానీ ఈ కొండగ్రామాల్లో నివసించే థంకూల్‌ నాగా తెగ ప్రజలకు పాత్రల తయారీ జీవనోపాధిగా మారింది. వీటి తయారీ కష్టం కాబట్టి ధర ఎక్కువగా ఉండేది. దాంతో ఈ పాత్రలను సంపన్నులూ రాజకుటుంబీకులూ మాత్రమే కొనుగోలు చేసేవారు. అందుకే దీన్ని రాయల్‌ పాటరీ అనీ పిలుస్తారు.

కళల దేవత!
స్థానికులు రుచిగా ఉంటుందన్న కారణంతో వేడుకల్లో వడ్డించే మాంసాన్ని తప్పనిసరిగా ఈ కుండల్లోనే వండుతారు. ఎలాంటి రసాయనాలూ వాడకుండానే నల్లగా ఆకర్షణీయంగా మెరుస్తూ కనిపించే ఈ పాత్రలు ఆరోగ్యానికీ మంచివట. ఇవి ఎంతో నాణ్యమైనవి కూడా.

కుండలూ పాత్రల తయారీకి చక్రాన్ని ఉపయోగించకుండా కేవలం చేత్తోనూ కొన్ని ఆకారాలకోసం అచ్చుల్నీ ఉపయోగిస్తూ చేయడం ఇక్కడి కళాకారుల ప్రత్యేకత. కళలదైవంగా కొలిచే పంథొబి దేవతే ఈ పాత్రల తయారీని నేర్పించినట్లుగా భావిస్తారు. అందుకే పిల్లలు పుట్టినప్పుడూ పెళ్లి వేడుకల్లోనూ ఈ మట్టికళావస్తువుల్ని తప్పక వాడతారు మణిపూర్‌వాసులు. అలంకరణకూ వండుకునేందుకూ ఆహారపదార్థాలను నిల్వచేసుకునేందుకూ ఇలా అవసరాలకు తగినట్లుగా ఆయా పాత్రలను తయారుచేస్తున్నారిప్పుడు. దాంతో ఈ లాంగ్‌పీ కళ అంతర్జాతీయంగానూ పేరొందింది.