close
సోజో సొగసులివి..!

కంచిపట్టులో ఉప్పాడ జాంధానీ డిజైన్లనూ ఉప్పాడలో కంచి బుటీలనూ నేస్తూ సరికొత్త డిజైన్లు సృష్టిస్తున్నారు నేటి చేనేతకారులు. ఈ ‘కలనేత చేనేతలకే ఎందుకు సొంతం కావాలి, కలగలుపు నగలను రూపుదిద్దలేమా’ అనుకుంటున్నారు ఆధునిక నగల డిజైనర్లు. అందులో భాగంగా పుట్టుకొచ్చినవే ఈ సరికొత్త సోజో ఆభరణాలు... మీనాకారీ-థెవా-విక్టోరియన్‌ డిజైన్ల కలబోత అందాలు..!

బంగారు ఆభరణాల్లో పసిడి సొగసులూ, రాళ్ల నగల్లో రత్నాల మెరుపులూ కనిపించడం సహజం. కానీ అటు పసిడి సోయగాన్నీ ఇటు రాళ్ల మిలమిలల్నీ కలగలిపిన అందమైన నగల్ని రూపొందిస్తున్నారు ఆధునిక నగల డిజైనర్లు. వజ్రాల నగల్లో టెంపుల్‌ జ్యువెలరీ అందాల్నీ తుషిలో నక్షీ పనితనాన్ని చొప్పించడమూ అందులో భాగమే. ఇప్పుడు కొత్తగా కొన్ని ప్రాంతాల్లోనూ మరికొన్ని కుటుంబాల్లోనూ మాత్రమే చేయగలిగే అరుదైన కళాత్మకమైన మీనాకారీ, థెవా పనితనానికి విక్టోరియన్‌ తరహా డిజైన్లను జోడించి అద్భుతమైన సోజో అందాల్ని సృష్టిస్తున్నారు కొందరు డిజైనర్లు. సోజో అనేది గ్రీకు పదం. పరిపూర్ణత్వం అని దీని అర్థం. బంగారు చెక్కుళ్లకు రంగుల్ని అద్దుతూ వజ్రాలు, కెంపులు, పచ్చలు... వంటి రత్నాలను జోడిస్తూ విక్టోరియన్‌ శైలిలో అందమైన కళారూపాలుగా మలచడమే ఈ సోజో ఆభరణాల ప్రత్యేకత.

మీనాకారీ అంటే...