close
ఫ్యాషన్‌ మేళా!

నడిచి వెళుతుంటే శత్రువులు సైతం ఇంకోసారి తలతిప్పి చూసేలా ఉండాలన్నదే ఫ్యాషనిస్టుల ఉవాచ. అలా ఉండాలంటే మార్కెట్లోకి అడుగుపెడుతోన్న కొత్త ఫ్యాషన్లూ ట్రెండ్‌లమీద ఓ కన్నేసి ఉంచాల్సిందే మరి..!


 

బుజ్జి బుట్టలు..!

చెవి తమ్మి దగ్గర చిన్న దుద్దులా ఉండి, దానికన్నా రెట్టింపు లేదా అంతకన్నా ఎక్కువ సైజులో బుట్ట వేలాడుతుంటే ఆ అందమే వేరు. అందుకే ఆ బుట్ట లోలాకుల్లో వస్తోన్న డిజైన్లకు లెక్కే లేదు. అయితే ఎంత అందంగా ఉన్నా దుద్దుకి వేలాడే బుట్ట సైజే ఎప్పుడూ పెద్దగా ఎందుకు ఉండాలి... అనుకున్నట్లున్నారు కొందరు డిజైనర్లు. ఆలోచన రావడమే ఆలస్యం... ఈ సరికొత్త బుజ్జి బుట్టల డిజైన్‌ను సృష్టించేశారు. అటు పెద్ద దుద్దులు పెట్టుకున్నట్లూ గ్రాండ్‌గానూ ఉంటుంది... ఇటు లోలాకులు వూగిసలాడుతూ ట్రెండీగానూ ఉంటాయి... పైగా కొత్త ఫ్యాషనాయె... ఇక, అమ్మాయిలు పెట్టుకోకుండా ఎలా ఉండగలరు?


అద్దాలుఅదిరాయి

  కాలంతో సంబంధం లేకుండా అతినీలలోహిత కాంతి నుంచి రక్షించుకునేందుకు సన్‌గ్లాసెస్‌ తప్పనిసరి యాక్సెసరీస్‌గా మారిపోయాయి. అందుకే వాటిల్లో ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లను తీసుకొస్తున్నాయి ఆయా కంపెనీలు. డియోర్‌ స్లి్పట్‌ గ్లాసెస్‌ ఈ కోవకే చెందుతాయి. గ్రాఫిక్‌ స్టైల్‌ను తలపించే ఈ అద్దాల మధ్యలో వేరే రంగులో ఓ పట్టీ లాంటిది ఉండి కళ్లకు ఓ ప్రత్యేక లుక్‌ని తీసుకొస్తాయి. అంతేకాదు, నూటికి నూరుశాతం యూవీ కాంతి నుంచీ కళ్లనూ కాపాడతాయి. బాగున్నాయి కదూ.


పాదాలకు పూలందం

  ధ్యమధ్యలో కాస్త పక్కకు వెళ్లినా అమ్మాయిల డ్రెస్సులూ యాక్సెసరీల్లో పూలదే హవా. వద్దనుకున్నా చూపు వాటిమీదే వాలిపోతుంటుంది. అందుకే చెప్పులూ షూలలో కూడా బోలెడు రకాల పూల డిజైన్లు కనువిందు చేస్తుంటాయి. అయితే ఈ పూల డిజైన్లు బట్టతో చేసిన చెప్పుల్లోనూ లేదా రాళ్లతో అలంకరించిన వాటిల్లోనే ఎక్కువ. లెదర్‌ శాండల్స్‌లో మాత్రం రంగురంగుల పూల డిజైన్లు అరుదనే చెప్పాలి. ఆ లోటు తీర్చేందుకా అన్నట్లు ఇటలీకి చెందిన రెనె కయోవిలా అనే డిజైనర్‌, ఏకంగా లెదర్‌తోనూ అందాల పూల శాండల్స్‌నూ షూలనూ రూపొందించాడు. పాదాలకు పూల ఆభరణాలను అలంకరించినట్లు ఉన్న ఆ చెప్పుల డిజైన్లు అందరికీ తెగ నచ్చేయడంతో వాటికి నకళ్లు కూడా మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. అమ్మాయిల కళ్లను కట్టిపడేస్తున్నాయి.


బాగుందే... భుజం జారిందే..!

సింగిల్‌ షోల్డర్‌, సింగిల్‌ స్లీవ్‌ ఫ్యాషన్‌ అనగానే ఒకప్పుడు హాలీవుడ్‌ తారలే గుర్తుకొచ్చేవారు. మనదగ్గర ఉన్నా ఏ ఫ్యాషన్‌ వేదికలకో పరిమితమయ్యేది. మహా అయితే బాలీవుడ్‌ భామలు మాత్రం ఆ ఏక భుజ డ్రెస్సుల్లో తళుక్కుమనేవారు. అదీ వెస్ట్రన్‌ టాప్‌ల్లోనే సుమా. కానీ ఇప్పుడు డిజైనర్లు మన సంప్రదాయ అనార్కలీలూ కమీజ్‌లకు కూడా ఆ సింగిల్‌ షోల్డర్‌ అందాలను జోడిస్తున్నారు. దాంతో అవి ర్యాంప్‌లమీదుగా నడిచొచ్చి అమ్మాయిల వార్డ్‌రోబుల్లోనూ కొలువుదీరుతున్నాయి.


వినసొంపైన నగలు!

చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ లేకుండా నిమిషం గడవదు. అలాగని దాన్ని ఎక్కువసేపు చెవి దగ్గర పెట్టుకోలేం. ఓపక్క రేడియేషనూ మరోపక్క చెయ్యి నొప్పి. అందుకే ఇప్పుడు చెవిలో పెట్టుకుని మాట్లాడే బ్లూటూత్‌లూ మెడలో వేలాడే ఇయర్‌ఫోన్లూ కూడా ఇలా ఆభరణాల్లా మెరిసోతున్నాయి. ఇవి చూడ్డానికి మామూలు పూసల దండల్లానే ఉంటాయి. కానీ లాకెట్‌లా రూపొందించిన బ్లూటూత్‌కి సన్నటి ఇయర్‌ఫోన్‌ వైరును అమర్చి దానికి ముత్యాలూ పూసలూ గుచ్చుతారు. ఆ వైరు చివర ఉన్న ఇయర్‌ఫోన్లూ లాకెట్‌లానే ఉండి, దండలో అమరిపోతాయి. లేదంటే మెడ వెనక వేలాడతాయి. ఫోన్‌ వచ్చినప్పుడు బ్లూటూత్‌ బటన్‌ నొక్కి ఇయర్‌ఫోన్లు చెవిలో పెట్టుకుని మాట్లాడొచ్చు. ఇలానే హారాల్లాంటి ఇయర్‌ఫోన్లూ వస్తూ అమ్మాయిల్ని అలరిస్తున్నాయి.


గోరంత మెరుపు..!

కప్పుడు గోళ్లకు ఏదో ఒక రంగు వేసుకోవడమే ఫ్యాషన్‌. తరవాత అందులో బోలెడు డిజైన్లూ... ఆపైన వాటికి బోలెడు రకాల అలంకారాలూనూ. ఇలా గోళ్ల రంగుల్లో కొత్త ఫ్యాషన్లు నిరంతరం పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా అద్దాల గోళ్లు వచ్చి, అమ్మాయిల్ని మురిపిస్తున్నాయి. ఈ రకం గోళ్ల కోసం రంగులతో పెద్దగా పనిలేదు. అచ్చం అద్దంలా గోళ్లను మెరిపించే మెటాలిక్‌ నెయిల్‌ ఫాయిల్స్‌ వస్తున్నాయి. వీటిల్లో వెండి, బంగారు రంగులతోపాటు ఇతర రంగుల్లో మెరిసే కాగితాలూ ఉంటున్నాయి. ఈ కాగితాల్ని ఎక్కడా ముడతలు లేకుండా గోటికి అతికించేస్తే చాలు. అవి అద్దాల్లా మెరిసిపోతాయి. అయితే ఇందుకోసం ముందుగా గోటికి పారదర్శకమైన రంగు వేసి దానిమీద ఈ కాగితాన్ని అతికించి అంచుల దగ్గర జాగ్రత్తగా కత్తిరిస్తే సరి. కాగితం అతుక్కున్నాక అవసరమైతే మళ్లీ పారదర్శక రంగుని ఓసారి వేస్తే అది వూడిపోకుండా మరింత అందంగా కనిపిస్తుంది.


వాచీకో జీన్స్‌

కుర్రకారుకి జీన్స్‌ మీద చెప్పలేనంత క్రేజు. ఆ విషయాన్ని గ్రహించే కాబోలు... ఫాస్ట్‌ట్రాక్‌ నుంచి ఆపిల్‌ వరకూ అన్ని రకాల వాచీలకూ సరిపోయేలా జీన్స్‌ స్ట్రాప్స్‌ను రూపొందించేస్తున్నారు. ఎంత ఖరీదైన వాచీ అయినా ఎప్పుడూ అదే స్టెయిన్‌లెస్‌ స్టీలూ లెదరూ నైలానూ టైటానియం బ్యాండ్లే పెట్టుకోవాలంటే బోరే కదా. అందుకే ఇప్పుడు జీన్స్‌ క్లాత్‌తోనూ అందమైన వాచీ స్ట్రాప్‌లెన్నో లభిస్తున్నాయి. లెదర్‌ డయల్‌ కాస్త పాతబడగానే నచ్చిన రంగు జీన్స్‌ స్ట్రాప్‌ను తగిలించేస్తే క్లాసీ వాచ్‌ కూడా ఫ్యాషన్‌గా మారిపోదా మరి!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.