close
ఓ సారి ఇలా ఓ సారి అలా

మధ్య ఫ్యాషన్‌కు వేగం మరీ ఎక్కువయిపోయింది. ఈ రోజు కొత్తగా ఉన్నది రేపటికి బోరయిపోతుంది. అదీగాక ఒక ఫంక్షన్‌కి వేసుకున్నది మరో వేడుకలో ధరించాలంటే నేటి తరం అమ్మాయిలకు తగని చిరాకు. ఎప్పటికప్పుడు కొత్త లుక్‌లో కనిపించాలి. హెయిర్‌స్టైలూ, యాక్సెసరీలూ, నగలతో కొంత తేడా తీసుకొచ్చినా ‘ప్చ్‌... లాభం లేదు. డ్రెస్సు ఒకసారి వేసుకున్నదే కదా’ అని నిట్టూరుస్తారు. అలాగని ఎన్ని డ్రెస్సులని కొనగలరు? ఆ సమస్యను కొంతైనా తగ్గించేందుకే అన్నట్లు డిజైనర్లు ఈ కొత్త రకం టూ ఇన్‌ వన్‌ డ్రెస్సుల్ని తీసుకొచ్చేశారు. దాంతో ఒకే డ్రెస్సుతో రెండు రకాలుగా ముస్తాభైపోతున్నారు. ఒక డ్రెస్సు ఖరీదుతోనే రెండు రకాల డ్రెస్సుల్ని సొంతం చేసుకుంటున్నారు. మళ్లీ మళ్లీ వేసుకుంటున్నారు. మొత్తమ్మీద ఈతరం అమ్మాయిలు ఈ టూ ఇన్‌ వన్‌ డ్రెస్సుల మీద మాత్రం మనసు పారేసుకుంటున్నారన్నది నిజం.