close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అర్జీల దేవుడు!

అర్జీల దేవుడు!

ఆల‌యానికి వెళ్లేప్పుడు ఎక్కడైనా పువ్వులూ కొబ్బరికాయల్లాంటివి పట్టుకెళ్తారు. కానీ, ఉత్తరాఖండ్‌లోని అల్మోరా పట్టణానికి దగ్గర్లో ఉన్న ‘చితయి గోలు’ దేవుడి గుడికి మాత్రం రూ.100, రూ.10ల స్టాంప్‌ పేపర్లను తీసుకెళ్తారు. కోర్టులో ఉన్న తమ కేసుని గెలిపించమని అర్జీ రాసి గుడిలో కడతారు. శివుడి ప్రతిరూపంగా కొలిచే ఇక్కడి దేవుడు కోర్టు కేసుల్లో భక్తులకు సరైన తీర్పు వచ్చేలా అనుగ్రహిస్తాడనేది స్థానికుల నమ్మకం. అందుకే, వందల ఏళ్ల నుంచీ ఇక్కడి దేవుడికి అర్జీలు పెట్టుకునే ఆనవాయితీ కొనసాగుతోంది. కొందరైతే లాయర్‌ని కూడా తీసుకొచ్చి స్టాంప్‌ పేపర్ల మీద తమ సమస్యను రాయించి గుళ్లొ కడతారు. ఇతర సమస్యలున్న వారూ కష్టాలను తీర్చమనీ కోర్కెలు తీర్చమని కూడా స్టాంప్‌ పేపర్‌మీదే రాసి వేలాడదీస్తారు. సమస్య తీరాక మళ్లీ వచ్చి ఆ పేపర్లను విప్పి కృతజ్ఞతగా మందిరంలో ఓ గంటను కట్టి వెళ్తుంటారు. అలా ఈ ఆలయం ఎప్పుడూ పత్రాలూ గంటలతో నిండిపోయి ఉంటుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.