close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఏం లైబ్రరీ అండీ..!

ఏం లైబ్రరీ అండీ..!

ఎవరైనా గ్రంథాలయానికి చదువుకోవడానికి వెళతారు. కానీ చైనాలోని టియాన్‌జిన్‌ బిన్‌హై లైబ్రరీకి మాత్రం ఆ భవంతిని చూడటానికే వెళుతున్నారు. ఐదంతస్తుల ఎత్తున కట్టిన అరలూ, అందులో పుస్తకాలూ... అన్నింటినీ అందుకోవడానికి వీలుగా అరల మధ్య నడిచే వీలు కల్పించే దారులూ... ఇలాంటి ఎన్నో విశేషాలు ఆ లైబ్రరీకి రోజుకు పదిహేను వేల మందికిపైగా బారులు తీరేలా చేస్తున్నాయి.గ్రంథాలయమంటే ఒక గదీ మధ్యలో పొడవాటి బల్లా, దాని చుట్టూ కుర్చీలూ, అరల్లో వరసలుగా పేర్చిన పుస్తకాలూ.... ఇవే గుర్తుకు వస్తాయి. కానీ ఆధునిక నిర్మాణ శైలీ అందులోని వినూత్న మార్పులూ గ్రంథాలయాల రూపురేఖల్నే మార్చేస్తున్నాయి. వాటినీ అద్భుత కట్టడాలుగా తీర్చిదిద్దుతున్నాయి. అందుకు ఉదాహరణ చైనాలోని టియాన్‌జిన్‌ బిన్‌హై లైబ్రరీ. దాదాపు ముప్ఫైఏడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదంతస్తుల ఎత్తున పన్నెండు లక్షల పుస్తకాల దాకా అందంగా అమర్చగలిగేలా కట్టిన ఈ భవంతి చూపరుల్ని కట్టిపడేస్తోంది.అద్భుతం...
కిరాణా షాపులకన్నా మాల్స్‌ విజయం సాధించగలగడానికి కారణం అక్కడి వస్తువులన్నింటినీ వినియోగదారులకు కనిపించేలా, వాళ్లు వస్తువుల్ని చేత్తో పట్టుకుని చూసే వీలు కల్పించేలా సర్దిపెట్టడమే. టియాన్‌జిన్‌ గ్రంథాలయ నిర్మాణంలోనూ ఇదే నియమాన్ని అనుసరించారు. అక్కడి పుస్తకాలన్నింటినీ పాఠకుల కళ్లకు కనిపించేలా చేతికి అందుబాటులో ఉండేలా వరసల్లో సర్దారు. అందువల్ల అక్కడికి వచ్చిన ఎవరికైనా పుస్తకాన్ని చదవాలన్న కోరిక తప్పక కలుగుతుంది. ఇంకా, పాఠకుల్ని ఆకర్షించడం కోసం లైబ్రరీలోని ఐదంతస్తుల్నీ అరలు అరలుగా తీర్చిదిద్దారు. నేల నుంచి సీలింగ్‌ దాకా ఉన్న ఈ షెల్ఫులను చేరేందుకు మెట్లతో పాటు పుస్తకాల వరసల పక్కనే నడిచేదారినీ నిర్మించారు. కావాలంటే అక్కడే కూర్చుని చదువుకోవచ్చు కూడా. బిల్డింగు మధ్యలో గ్లోబు ఆకృతిలో ఆడిటోరియం ఉంది. ఈ మొత్తం భవనాన్నీ బయటి నుంచి చూస్తే కన్నుని పోలి ఉండేలా నిర్మించారు. అందుకే ఈ భవంతిని ‘ద ఐ’గా పిలుస్తారు. నెదర్లాండ్స్‌కి చెందిన ఒక సంస్థ మూడేళ్లలో పూర్తి చేసిన ఈ అద్భుత గ్రంథాలయ భవనాన్ని చూసేందుకు రోజూ పదిహేనువేల మందికిపైగా వస్తున్నారట. మొత్తానికి ఈ లైబ్రరీ ఇటు పుస్తకాలతో పాఠకుల్నీ అటు అందంతో పర్యటకుల్నీ ఆకర్షించేస్తోందన్నమాట!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.