close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అరచేతిలో ఎడిటింగ్‌ స్టూడియో!

అరచేతిలో ఎడిటింగ్‌ స్టూడియో!

సోషల్‌ మీడియాని వినియోగించేవాళ్లలో రెండు రకాల వాళ్లుంటారు. అక్కడ కనిపించే వీడియోని లైక్‌, షేర్‌ చేసేవాళ్లు మొదటి రకం. వాటిని రూపొందించేవాళ్లు రెండో రకం. చాలా మంది మొదటి రకానికే చెందుతారు. కారణం వాళ్లకి వీడియో తీయడంపైన ఆసక్తి లేకపోవడం కాదు, ఈ వీడియో ఎడిటింగ్‌ ఆప్స్‌ గురించి తెలియకపోవడమే!

ప్‌స్టోర్‌, ప్లేస్టోర్‌లలో ఎక్కువగా డౌన్‌లోడ్‌ అయ్యే ఆప్స్‌లో ‘ఫిల్మోరాగో’ ఒకటి.ఎడిటింగ్‌కి కావాల్సిన వీడియోలూ, ఫొటోల్ని ఫోన్‌ నుంచి ఎంపికచేసుకుంటే అవన్నీ ఈ ఆప్‌లో ఒకేచోట కనిపిస్తాయి. తర్వాత ఎడిటింగ్‌ మొదలుపెట్టొచ్చు. ఈ దశలో ఫొటోలూ, వీడియో క్లిప్పుల్ని కావాల్సిన వరసలో పెట్టి ఆప్‌లోని రెడీమేడ్‌ థీమ్స్‌ నుంచి నచ్చినదాన్ని ఎంపికచేసుకుంటే మొత్తంగా వీడియో సిద్ధమైపోతుంది. వీడియో మధ్యలో కొంత భాగం వేగంగా లేదా నెమ్మది (స్లోమోషన్‌)గా వెళ్లేలా కూడా చేసుకోవచ్చు. దీన్లో ఉండే ‘పిక్చర్‌-ఇన్‌-పిక్చర్‌’ ఫీచర్‌ ద్వారా ఒక వీడియో మధ్యలో ఏదైనా ఫొటో లేదంటే వీడియో వచ్చేలా చేసుకోవచ్చు. వీడియో సిద్ధమయ్యాక ఫోన్లో ఉన్న సోషల్‌ మీడియా ఆప్స్‌ ద్వారా దాన్ని షేర్‌ చేయొచ్చు.

అడోబ్‌ ప్రిమియర్‌ క్లిప్‌...
ఈ ఆప్‌లో ఆటోమెటిక్‌, ఫ్రీఫామ్‌ అనే రెండు రకాల ఆప్షన్స్‌ ఉంటాయి. ఆటొమేటిక్‌లో ఏదైనా వీడియోకి బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్‌ని ఎంపికచేసుకోవచ్చు. వీడియోని పూర్తిగా మార్చాలనుకుంటే ఫ్రీఫామ్‌లో ఎడిట్‌ చేయాలి. కావాల్సిన వీడియోలూ, ఫొటోల్ని ఒకచోట చేర్చి వాటిని క్రమపద్ధతిలో పెట్టాలి. ఆపైన ఆయా భాగాలకు సంబంధించిన వేగం, సైజు, రంగు, నేపథ్య సంగీతం... ఇలా అన్నిటినీ ఎంపికచేసుకుని ఆ ఫిల్టర్స్‌ని అప్లైచేస్తే వీడియో సిద్ధమవుతుంది. మిగతా ఆప్స్‌లో లేనన్ని ఫేడ్‌, మోషన్‌ ఆప్షన్స్‌ దీన్లో ఉంటాయి. ఈ ఆప్‌ వీడియో షేరింగ్‌ సోషల్‌ నెట్‌వర్క్‌ కూడా.

వీడియో షో
దీన్లో సాధారణంగా తీసిన వీడియోకి రంగుల్నీ, వేగాన్నీ, సంగీతాన్నీ జతచేసి ఎడిట్‌ చేసుకోవచ్చు. లేదంటే కావాల్సిన ఫొటోల్ని ఉపయోగించి వీడియోని తయారుచేసుకోవచ్చు. వీడియోలో కనిపించేలా వాటికి సంబంధించిన విషయాల్ని అక్షర రూపంలో కనిపించేలా చేయొచ్చు. ‘ఎఫ్‌ఎక్స్‌’ హంగులూ ఇవ్వొచ్చు. కావాల్సిన వస్తువులే కనిపించేలా రివర్స్‌ ఫిల్టర్‌నీ ఉపయోగించుకోవచ్చు. వీడియో సంగీతం మీద ప్రధానంగా దృష్టిపెట్టేవాళ్లకి ఈ ఆప్‌ బాగా పయోగపడుతుంది. ఇందులో సొంత మ్యూజిక్‌నీ జోడించవచ్చు. లైవ్‌ డబ్బింగ్‌ చెప్పొచ్చు. ఆడియో వేగాన్నీ, తీవ్రతనీ నియంత్రించవచ్చు.

మూవీమేకర్‌
ఈ ఆప్‌ పూర్తిపేరు మూవీ మేకర్‌ ఫిల్మ్‌మేకర్‌ యూట్యూబ్‌ అండ్‌ ఇన్‌స్టాగ్రామ్‌. ఇది వీడియోల్ని ఎడిట్‌ చేసే ఆప్‌ మాత్రమే కాదు, వీడియో షేరింగ్‌ ఆప్‌ కూడా. కాబట్టి మన వివరాలతో అకౌంట్‌ తెరవాలి. ఆప్‌లోకి వెళ్లాక దాంట్లో ఉండే ప్లస్‌ గుర్తుని ట్యాప్‌ చేసి కావాల్సిన వీడియోలూ, ఫొటోల్ని ఎంపికచేసుకోవచ్చు. ఎడిటింగ్‌ సమయంలో వీడియోకి ఆప్‌లో ఉండే వందల సంఖ్యలోని స్టిక్కర్లనీ, ఎఫెక్ట్స్‌నీ జోడించవచ్చు. దీన్లో అధిక సంఖ్యలో ఫిల్టర్లు ఉంటాయి. కాబట్టి వీడియోకి కావాల్సిన చిన్న చిన్న హంగుల్నీ తేవొచ్చు. ఆప్‌లో ఉండే నేపథ్య సంగీతం కాకుండా సొంత సంగీతాన్నీ ఎంచుకోవచ్చు. వీడియో సిద్ధం అయ్యాక అది మన అకౌంట్‌లో ఉంటుంది. దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆప్‌లోనే మిగతా వారితో షేర్‌ చేయొచ్చు.

మెజిస్టో...
అత్యంత సులభంగా ఉపయోగించడానికి వీలుండే వీడియో ఎడిటింగ్‌ ఆప్‌లలో ఇదొకటి. కొన్ని నిమిషాల్లో కొద్ది క్లిక్స్‌తోనే ఫోటోలూ, వీడియోల్ని మంచి కథలుగా మలుస్తుందీ ఆప్‌. ఫొటోలూ, వీడియోల్ని ఎంపికచేశాక అవి ప్రేమ, డ్యాన్స్‌, జ్ఞాపకాలు, ఇల్లు, కథనం... వీటిలో ఏ విభాగానికి చెందుతాయో చెప్పాలి. అందుకు సరిపోయే నేపథ్య సంగీతం క్లిప్‌లు వస్తాయి. వీడియో, ఫొటోలోని వ్యక్తుల ముఖకవళికలూ, వారు చేసే పనుల్ని గుర్తించి దానికి తగ్గ సంగీతాన్ని సూచించేలా కృత్రిమ మేధను ఈ సంస్థ ఉపయోగిస్తుంది. కాబట్టి సంగీతం చక్కగా సరిపోతుంది. అక్కడ ఉండే సంగీతం క్లిప్‌లే కాకుండా సొంతవీ ఎంచుకోవచ్చు.

ఇవి కాకుండా అలైవ్‌, ఇన్‌షాట్‌, ఓవర్‌ వీడియో, క్విక్‌, క్యూట్‌ కట్‌, వివా వీడియో... లాంటి ఆప్స్‌ కూడా వీడియో ఎడిటింగ్‌ని సులభతరం చేస్తున్నాయి. ఈ వీడియో ఎడిటింగ్‌ మొబైల్‌ ఆప్‌లను మనకున్న సమయం, అభిరుచిని బట్టి ఎంచుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిన ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేయండి. సృజనను బయటికి తీయండి, మీ వీడియోని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయండి!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.