close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఒకట్రెండు ఆటలే ఎందుకు?

ఒకట్రెండు ఆటలే ఎందుకు?

ఒక దేశం తరఫున ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ చేసినవారిలో మూడో స్థానంలో ఉన్న ఆటగాడు... సునీల్‌ ఛెత్రి. అవును, టీమ్‌ ఇండియా కెప్టెన్‌ ఛెత్రీనే. రొనాల్డో, మెస్సీల తర్వాత స్థానంలో ఉన్న ఛెత్రి 100 మ్యాచ్‌లలో 61 గోల్స్‌ చేసి ఈ రికార్డు సాధించాడు. మన సాకర్‌ వీరుడి కెరీర్‌ సంగతులివి...

రక్తంలోనే ఉంది...

నాన్న పుట్టి పెరిగింది డార్జిలింగ్‌లో. అమ్మానాన్న... ఇద్దరూ ఫుట్‌బాల్‌ ఆటగాళ్లే. నాన్న ఆర్మీ జట్టుకీ, అమ్మ నేపాల్‌ జాతీయ జట్టుకీ ఆడారు. నాలుగేళ్ల వయసు నుంచీ నేనూ ఫుట్‌బాల్‌ ఆడటం మొదలుపెట్టాను. శిక్షణ కోసం ఏ అకాడమీలోనూ చేరలేదు. నాన్నకు ఖాళీ దొరికితే నాచేత ఫుట్‌బాల్‌ ఆడించేవారు.


టర్నింగ్‌ పాయింట్‌...

నాన్న ఆర్మీ ఉద్యోగి. నేను పుట్టింది సికింద్రాబాద్‌లో. కోల్‌కతాలో కొన్నాళ్లు ఉన్నాం. స్కూల్‌ వయసుకి దిల్లీకి వచ్చాం. అక్కడ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్లో చదువుకునేవాణ్ని. ఆ స్కూల్‌ చదువుకీ, క్రమశిక్షణకీ పెట్టింది పేరు. కానీ అక్కడి మమతా మోడల్‌ స్కూల్‌ ఫుట్‌బాల్‌కి ప్రఖ్యాతి. అందుకే అక్కడికి మారిపోయాను. మమతా స్కూల్‌కి వెళ్లాక ఎక్కువ టోర్నమెంట్లు ఆడుతూ ఆటను బాగా నేర్చుకునే అవకాశం వచ్చింది.


మోహన్‌ బగాన్‌ పిలుపు

2002లో డ్యూరండ్‌ కప్‌ టోర్నీలో ఒక దిల్లీ క్లబ్‌ తరఫున ఆడాను. ఆ టోర్నీలో మంచి గుర్తింపు వచ్చింది. టోర్నీ ముగిశాక మోహన్‌ బగాన్‌ క్లబ్‌ నుంచి పిలుపొచ్చింది. జట్టులోకి తీసుకుని మూడేళ్ల కాంట్రాక్ట్‌ ఇచ్చారు. అది టర్నింగ్‌
పాయింట్‌. 20 ఏళ్ల వయసులో 2004లో భారత జట్టుకి ఎంపికయ్యాను. మొదటి మ్యాచ్‌ పాకిస్థాన్‌పైన. జీవితంలో మర్చిపోలేని రోజది.


రిటైర్మెంట్‌...

టని ఆస్వాదించని రోజున... సరిగ్గా రాణించని రోజున... రిటైర్మెంట్‌ గురించి ఆలోచిస్తాను. చుట్టూ మన ఆటను మెరుగు పర్చుకునే వాతావరణం ఉన్నపుడు రిటైర్మెంట్‌ ఆలోచనే రాదు. శిక్షణ సమయంలో టీమ్‌లో నాకంటే వేగవంతమైన యువ ఆటగాళ్లతో పోటీ పడి వయసుని మర్చిపోతాను.


వారే ఆరాధ్యం...

నాన్నని ఆరాధ్య దైవంగా భావిస్తాను. ఆయన పెంపకమే నన్నీ స్థాయిలో నిలబెట్టింది. ఏ పనైనా పూర్తి అంకితభావంతో చేస్తారాయన. నేను ఫుట్‌బాల్‌ ఆడకుంటే ఆయనలా ఆర్మీలో చేరేవాణ్ని. ఫుట్‌బాల్‌లో మెస్సీ, బైచింగ్‌ భూటియా, రొనాల్డో నాకు ఆదర్శం.


నిద్ర కావాల్సిందే!

నేను ఎక్కువగా నిద్రపోతాను. కొన్నిసార్లు రోజులో 10 గంటలు నిద్రపోతాను. బాగా అలిసిపోయుంటే ఇంకా ఎక్కువసేపే నిద్రపోతాను. ఏ సమయంలోనైనా, ఎక్కడైనా నిద్రపోగలను.


ఇండియా గెలుస్తోంది

2015లో ఫుట్‌బాల్‌లో మన ర్యాంకు 173, ఇప్పుడు 97కి వచ్చింది. మనం ఆటలో మెరుగు పడుతున్నా, అగ్రశ్రేణి జట్లకంటే చాలా వెనకబడి ఉన్నాం. ముందు ఆసియాలో టాప్‌-10 జట్లలో ఒకటిగా ఎదగాలి. 2019 ఆసియా కప్‌ అందుకు సరైన వేదిక అవుతుంది.


లీగ్‌ మ్యాచ్‌లు...

విదేశీ లీగ్‌లు ఆడాను. ఇప్పుడు ఇండియన్‌ సాకర్‌ లీగ్‌లో బెంగళూరు ఎఫ్‌సికి ఆడుతున్నాను.  క్లబ్‌ల మౌలిక సదుపాయాలూ, శిక్షణా భిన్నంగా ఉండటంతోపాటు ఫుట్‌బాల్‌ సంస్కృతి వేర్వేరుగా ఉంటుంది. ఐఎస్‌ఎల్‌ వల్ల విదేశీ ఆటగాళ్లూ కోచ్‌లతో ఆడుతున్నాం. దానివల్ల ఎంతో ప్రయోజనం కలుగుతోంది. అయిదేళ్ల ఐఎస్‌ఎల్‌ అనుభవంతో ఆటని ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతున్నాను.


పెళ్లి...

త 14 ఏళ్లుగా పరిచయం ఉన్న అమ్మాయి సోనమ్‌నే గతేడాది పెళ్లాడాను. అంటే నేను నా ఫ్రెండ్‌తో కలిసి ఉన్నట్లే. మేం బెంగళూరులో ఉంటాం. నేను పర్యటనలకు వెళ్లినపుడు తను కోల్‌కతా వెళ్తుంది. సోనమ్‌ వాళ్ల నాన్నగారు సుబ్రతా భట్టాచార్య ఇండియా తరఫునా, మోహన్‌ బగాన్‌ క్లబ్‌ తరఫునా ఆడారు.


ఫుట్‌బాల్‌ చూడండి...

న ఫుట్‌బాల్‌ జట్టుకి తగిన ఆదరణ లేకపోవడం బాధగా అనిపించి... ‘మైదానాలకు రండి, మా ఆటను చూడండి. నచ్చితే మెచ్చండి, లేకుంటే తిట్టండి’ అని ఈమధ్య సోషల్‌ మీడియాలో చెప్పాను. దానికి మంచి స్పందన వచ్చింది. ఇండియా ఏ ఆటలో ప్రపంచకప్‌, పతకాలు గెలిచినా గొప్పగా ఫీలవుతాను. 130 కోట్ల జనాభా ఉన్న మనం ఒకటి రెండు ఆటలకే ఎందుకు ప్రాధాన్యం ఇవ్వాలనేది నా ప్రశ్న.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.