close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
యూట్యూబ్‌ అప్పట్లో ఆ సైట్‌ అట!

యూట్యూబ్‌ అప్పట్లో ఆ సైట్‌ అట!

మనం చేసే వంటలూ జరుపుకొనే పండగలూ లేదూ అంటే మన ఆలోచనలూ... ఇలా దేన్నైనా వీడియో రూపంలో బంధించి ప్రపంచానికి తెలియజేయాలంటే యూట్యూబ్‌ని మించిన సాధనం మరొకటి ఉండదు. అక్కడెక్కడో కూరగాయలమ్మే నేపాల్‌ ముద్దుగుమ్మ నుంచి కన్నుకొట్టి కుర్రకారుని ఫిదా చేసిన ప్రియా వారియర్‌ వరకూ ఎంతోమందిని రాత్రికి రాత్రే స్టార్లను చేయడం యూట్యూబ్‌కే సొంతం. ఇంతలా ప్రపంచాన్ని కట్టిపడేసిన యూట్యూబ్‌కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు...
యూట్యూబ్‌ వ్యవస్థాపకుల జీవితాల్లో ఎదురైన సంఘటనల ఆధారంగా ఇది రూపుదిద్దుకుంది. యూట్యూబ్‌ సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌ చెన్‌ శాన్‌ఫ్రాన్సిస్కోలో ఇచ్చిన విందుకు సంబంధించిన వీడియోను తన స్నేహితులకు మెయిల్‌ చేద్దామని ప్రయత్నించి విఫలమయ్యాడట. అలాగే మరో వ్యవస్థాపకుడు జావెద్‌ కరీం తనకు ఇష్టమైన జానెట్‌ జాక్సన్‌ వీడియోల కోసం సోషల్‌ మీడియాలో వెతకగా, ఒక్కటి కూడా కనిపించలేదట. ఈ రెండు సందర్భాలూ ఎదురవడం యాదృచ్ఛికమే అయినా
తర్వాతి కాలంలో వీరిద్దరూ కలిసి యూట్యూబ్‌ ఛానల్‌ను డిజైన్‌ చేయడానికి అవే కారణమయ్యాయి.
* పేపాల్‌లో ఉద్యోగం చేస్తున్న చార్డ్‌ హార్లే, స్టీవ్‌ చెన్‌, జావెద్‌ కరీం అనే ముగ్గురు సహోద్యోగులు కలిసి దీన్ని రూపొందించారు. పేపాల్‌ కంపెనీని ఈబే సంస్థ కొనుక్కోవడంతో తమ వాటాగా వచ్చిన డబ్బులతోనే ఈ ముగ్గురూ 2005లో యూట్యూబ్‌ని
ప్రారంభించారు. గూగుల్‌ 2006లో పది వేల కోట్ల రూపాయలను చెల్లించి దీన్ని
కొనుగోలు చేసింది.
* అమెరికాలో పాపులరైన హాట్‌ ఆర్‌ నాట్‌ వెబ్‌సైట్‌ స్ఫూర్తితో మొదట దీన్ని వీడియో డేటింగ్‌ వెబ్‌సైట్‌గా ప్రారంభించారు.తర్వాతి రోజుల్లో ఈ సైట్‌ని
యూట్యూబ్‌గా తీర్చిదిద్దారు.
* యూట్యూబ్‌ని జనాల్లోకి తీసుకెళ్లడానికి దీని వ్యవస్థాపకులు... ‘అందమైన
అమ్మాయిలు ఎవరైనా వారికి సంబంధించిన పది వీడియోలను పోస్టుచేస్తే వారికి వంద డాలర్లు ఇస్తామ’ని ప్రకటన విడుదల చేశారు. అయితే దీనికి ఒక్కరి నుంచి కూడా స్పందన రాకపోవడం విశేషం.
ప్రపంచంలోని ప్రతీ నెటిజన్‌ యూట్యూబ్‌ని ఇప్పటివరకూ సరాసరి 140 సార్లు చూశాడని అంచనా.
* నిమిషానికి మూడు వందల గంటల వీడియోలు అప్‌లోడ్‌ అవుతూ ఉంటాయి. అలాగే ప్రతి యూట్యూబ్‌ వీడియోకీ నిమిషానికి సరాసరి 400 ట్వీట్లు వస్తాయి.
* ఇప్పటివరకూ పోస్టు చేసిన యూట్యూబ్‌ వీడియోలన్నింటినీ చూడాలంటే సుమారు రెండు వేల సంవత్సరాలు పడుతుందట.
* ఇందులో వీడియోలు అప్‌లోడ్‌ చేసే వారి సంఖ్యలో సగం మంది ఆ వీడియోలకు యూట్యూబ్‌ చెల్లించే డబ్బుతోనే ఉపాధి పొందుతున్నారట.
* యూట్యూబ్‌లో ఉన్న లాంగెస్ట్‌ వీడియో సమయం 571 గంటల 1 నిమిషం 41 సెకన్లు. ఇది 2009లో జొనాథన్‌ హ్యార్కిక్‌ అనే వీడియో బ్లాగర్‌ చేసిన చిలీ పర్యటనకు సంబంధించింది.
* ప్రస్తుతం యూట్యూబ్‌కి 130 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. వీరిలో 62 శాతం పురుషులూ, 38 శాతం స్త్రీలూ. రోజూ 30 లక్షల మంది కొత్తగా యూట్యూబ్‌ని చూస్తారట.
* యూట్యూబ్‌లో బాగా పాపులరైన వెయ్యి ఛానళ్లలో 600 ఛానళ్లను జర్మనీలో నిషేధించారట.
* యూట్యూబ్‌లో ఎక్కువ మంది సెర్చ్‌ చేసింది ‘హౌ టూ కిస్‌’ అన్న వీడియో కోసం.


* యూట్యూబ్‌ 61 దేశాల్లో, 76 భాషల్లో అందుబాటులో ఉంది. ఇది ఎక్కువ మంది చందాదారులు ఉన్న ఛానల్‌కి బటన్‌ అవార్డుని అందిస్తుంది. లక్షమంది ఉంటే సిల్వర్‌ ప్లే, పది లక్షలైతే గోల్డ్‌ ప్లే, కోటి మంది అయితే డైమండ్‌ ప్లే, అయిదు కోట్లు దాటితే రూబీ ప్లే బటన్‌ అవార్డులను ఇస్తుంది. ఇప్పటి వరకూ ‘ప్యూడిపై’ అనే ఛానల్‌కి మాత్రమే రూబీ ప్లే బటన్‌ అవార్డు లభించింది.


* దక్షిణ కొరియా పాప్‌ సింగర్‌ పీఎస్‌వై ‘గంగ్నమ్‌ స్టయిల్‌’ పేరుతో 2012లో ఒక ఆల్బమ్‌ను రిలీజ్‌ చేశాడు. ఇది యూట్యూబ్‌లో వైరల్‌గా మారి వంద కోట్ల మంది చూసిన తొలి వీడియోగా రికార్డు సృష్టించింది.


* 2005 ఏప్రిల్‌లో మొదటి వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. జావెద్‌ కరీం జూ దగ్గరున్న ఈ వీడియోను ‘మీ ఎట్‌ ద జూ’ పేరుతో పోస్టు చేశారు. 19 సెకండ్ల నిడివి ఉన్న దీన్ని ఇప్పటివరకూ నాలుగు కోట్ల మంది చూశారు, మూడు లక్షల మంది కామెంట్లు రాశారు.


* యూట్యూబ్‌లో ‘డూ ద హార్లెమ్‌ షేక్‌’ అనే వీడియో కోసం సెర్చ్‌ చేస్తే మన స్క్రీన్‌ మీద ఆ వీడియోలన్నీ షేక్‌ అవుతూ కనిపిస్తాయట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.