close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
శృంగారం ఎంత ఆరోగ్యమో..?!

శృంగారం ఎంత ఆరోగ్యమో..?!

చాలామంది శృంగారం అంటే పడక సౌఖ్యం కోసమే అనుకుంటారు. కానీ దానివల్ల ఆరోగ్యానికీ బోలెడు ప్రయోజనాలు అంటున్నారు నిపుణులు.
కరిగిపోతాయి క్యాలరీలు: ట్రెడ్‌మిల్‌మీద 40 నిమిషాలపాటు చేసే వాకింగ్‌, లేదా యోగా చేయడం వల్ల కరిగే క్యాలరీలకన్నా  30 నిమిషాల శృంగారం కారణంగా అధిక క్యాలరీలు ఖర్చవుతాయట. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి దీన్ని మించిన వ్యాయామం లేదట.
ఆనందం: శృంగారం కారణంగా ఎండార్ఫిన్లు ఎక్కువగా  విడుదలవుతాయి. ఫలితంగా ఒత్తిడి తగ్గి ఆనందంగా ఉంటారు. అదేసమయంలో సంతానసాఫల్యత పెరుగుతుంది. రోగనిరోధకశక్తీ వృద్ధి చెందుతుంది. దీనివల్ల విడుదలైన ఆక్సీటోసిన్‌ కారణంగా తలనొప్పి, మైగ్రెయిన్‌, కీళ్లనొప్పుల బాధలు తగ్గుతాయి.
ఎముకలకీ బలం: మెనోపాజ్‌ సమయంలో ఈస్ట్రోజెన్‌ స్థాయిలు పడిపోవడం కారణంగా చాలామంది మహిళలు  ఆస్టియోపొరోసిస్‌ బారిన పడుతుంటారు. అయితే వారంలో కనీసం రెండుసార్లు శృంగారంలో పాల్గొనే మహిళల్లో  ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ మిగిలినవాళ్ల శాతంకన్నా రెట్టింపు ఉంటుంది. దాంతో ఎముక ఆరోగ్యం క్షీణించదు. వారానికి మూడుసార్లు శృంగారంలో పాల్గొనే మహిళల్లో పక్షవాతం, గుండెజబ్బులు కూడా రావట. యోనిగోడలు సైతం పొడిబారకుండా తేమగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
బంధం పదిలం: భార్యాభర్తల మధ్య శృంగారం అనేది శారీరక  ఆరోగ్యానికే కాదు, మానసిక అనుబంధం బలపడ్డానికీ కారణమవుతుంది. పైగా రోజూ శృంగారంలో పాల్గొనే మహిళల్లో కటిభాగంలో కండరాలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. దాంతో గర్భాశయం జారిపోకుండా ఉంటుంది. మూత్రనాళ సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి.
ముఖానికీ అందం: వారానికి మూడుసార్లు శృంగారంలో పాల్గొనే మహిళలకు ప్రత్యేకించి ఫేసుక్రీములతో పనిలేదని ఓ అధ్యయనంలో తేలింది. వీళ్లు అసలు వయసు కన్నా ఏడెనిమిదేళ్లు చిన్నగా కనిపిస్తారట.


ప్రసవవేదన తగ్గాలంటే...

ర్భిణీలు వ్యాయామం చేయడం వల్ల ప్రసవ సమయంలో నొప్పుల సమయం తగ్గుతుందని మాడ్రిడ్‌ టెక్నికల్‌ విశ్వవిద్యాలయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకోసం వీళ్లు దాదాపు 500 మంది మహిళల్ని ఎంపికచేసి పరిశీలించారట. వాళ్లలో సగంమందితో వారానికి మూడుసార్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేయించారట. ప్రసవించేటప్పుడు మాత్రం నొప్పులు పడే సమయం, తల్లి బరువు, బిడ్డ బరువు, కాన్పు జరిగిన తీరు... ఇలా అన్ని విషయాలనూ ఐదు వందలమందిలోనూ క్షుణ్ణంగా పరిశీలించి చూశారు. మిగిలినవాళ్లతో పోలిస్తే వ్యాయామాలు చేయించిన తల్లుల్లో నొప్పులు పడే సమయం చాలా తక్కువ ఉన్నట్లు తేలింది. అంతేకాదు, వ్యాయామాలు చేసినవాళ్లలో కాన్పు తరవాత శరీరాకృతి ఏమాత్రం పాడవకుండా తిరిగి యథాస్థితికి త్వరగా వచ్చినట్లూ గుర్తించారు. మొత్తమ్మీద గర్భిణీగా ఉన్నప్పుడు పనులు చేసుకుంటూ చురుగ్గా ఉన్నవాళ్లకి కాన్పు తేలికగా అవుతుందన్న పెద్దలమాట నిజంగానే చద్దిమూటే మరి.


పొట్టలో బాగోలేదా?

యటి ఫుడ్‌ తినడం వల్ల కొందరికీ, కారాలూ స్వీట్లూ ఎక్కువగా తినడం వల్ల ఇంకొందరికీ...  ఇలా రకరకాల కారణాలతో తరచూ పొట్ట అప్‌సెట్‌ అవుతుంటుంది. అలాంటి సమయంలో ఏది తినాలన్నా భయంగానే ఉంటుంది. అందుకే అప్పుడు ప్రత్యేకించి కొన్నింటిని తినడం ద్వారా జీర్ణవ్యవస్థను మళ్లీ యథాస్థితికి తీసుకురావచ్చు అంటున్నారు పోషకనిపుణులు. అవేమంటే...
* డయేరియాతో బాధపడేవాళ్లకి బొప్పాయి సూపర్‌ ఫుడ్‌. ఇది అజీర్తినీ మలబద్ధకాన్నీ తొలగిస్తుంది. ఇందులోని పాపైన్‌ అనే ఎంజైమ్‌ జీర్ణక్రియను పెంపొందిస్తుంది. అలాగే అరటిపండు తిన్నా మేలే.
* కాస్త వాము లేదా సోంపుని నమిలినా లేదా వీటి కషాయం తాగినా మంచిదే. వీటిల్లోని ఫైటో న్యూట్రియంట్లు పొట్ట ఉబ్బరాన్నీ తేపుల్నీ తగ్గిస్తాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్‌నీ తగ్గిస్తాయి.
* జీలకర్ర కూడా మంచిదే. దీన్ని పొడిచేసి మజ్జిగ లేదా సూపు, సలాడ్లలో కలిపి తీసుకున్నా మేలే. ఏ రూపంలో జీలకర్ర తిన్నా అది జీర్ణ సంబంధ స్రావాల విడుదలకు తోడ్పడి జీర్ణక్రియను చక్కదిద్దుతుంది.
* భోజనానంతరం కాస్త అల్లంరసంలో నిమ్మకాయ పిండుకుని తాగినా అద్భుతంగా పనిచేస్తుందట.
* పెరుగు కూడా చాలా మంచిది. అందుకే పొట్ట బాగోలేనపుపడు కాస్త మజ్జిగన్నమో పెరుగన్నమో తినమని పెద్దవాళ్లు అంటుంటారు. ఇది ప్రొబయోటిక్‌. పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు దోహదపడి అసౌకర్యాన్ని తొలిగిపోయేలా చేస్తుంది.


పురుషులూ పారాహుషార్‌!

నిద్రలేమి వల్ల వచ్చే సమస్యలు అన్నీఇన్నీ కావు. ముఖ్యంగా తక్కువగా నిద్రపోయే పురుషుల్లో మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ. వాళ్లలో టెస్టోస్టెరాన్‌, కార్టిసాల్‌ హార్మోన్ల మధ్య అసమతౌల్యం ఏర్పడుతుంది. అంటే శరీరానికి అవసరమైన టెస్టోస్టెరాన్‌ స్థాయులు పడిపోయి, ఒత్తిడికి కారణమైన కార్టిసాల్‌ శాతం పెరిగిపోతుంది. ఫలితంగా శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంటుంది. దీన్నే ఇన్సులిన్‌ నిరోధంగా పిలుస్తారు. అది క్రమంగా మధుమేహానికి దారి తీస్తుంది. కాబట్టి నిద్రలేమితో మధుమేహం ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.