close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రిలీజ్‌ సినిమా చూడాల్సిందే!

రిలీజ్‌ సినిమా చూడాల్సిందే!

చందా కొచ్చర్‌... దేశంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ... ఎండీ, సీయీవో. ఫోర్బ్స్‌ ప్రపంచ 100 శక్తిమంతమైన మహిళల్లో ఆమె ఒకరు. తన అనుభవ పాఠాలూ, అభిరుచులూ, అభిప్రాయాల్ని చందా
పంచుకుంటున్నారిలా...

చిన్ననాటి లక్ష్యం...

ఏఎస్‌ ఆఫీసర్‌ అవ్వాలనేది నా చిన్ననాటి లక్ష్యం. ఐఏఎస్‌ అయితే ఒక గౌరవప్రదమైన హోదాలో, బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్నట్లని అప్పట్లో నా భావన. అందుకే చిన్నప్పట్నుంచీ కష్టపడి చదివేదాన్ని. 

లెక్కల్లో ముందు...

జైపూర్‌ నుంచి ముంబయి వచ్చాక బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాల్లోని అవకాశాల గురించి తెలిసింది. ఎకనమిక్స్‌లో ఆనర్స్‌ డిగ్రీ చేసి, ‘జమ్నాలాల్‌ బజాజ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ నుంచి ఎంబీఏ చేశాను. స్కూల్‌ రోజుల నుంచీ లెక్కలంటే కొట్టిన పిండి. క్లిష్టమైన గణితాంశాలున్నా ఏమాత్రం ఇబ్బందిలేకుండా చదివేదాన్ని. డిగ్రీలో, ఇంకా వృత్తిపరమైన కోర్సుల్లో అది నాకు కలిసొచ్చింది. 

మన చేతుల్లోనే

  మయపాలన, కఠోర శ్రమ, ప్రాధాన్యాల్ని ఎంచుకోవడం... తెలిస్తే వ్యక్తిగత, వృత్తిగత జీవితాల్లో విజయవంతంగా ముందుకు వెళ్లొచ్చు. మా అమ్మాయి ఆర్తి పరీక్షల సమయంలో తనతో ఉండేదాన్ని, అబ్బాయి అర్జున్‌ స్క్వాష్‌ మ్యాచ్‌లు చూడ్డానికి వెళ్లేదాన్ని. ముఖ్యమైన ఆఫీసు సమావేశాలపుడు మాత్రమే స్కూల్లో పేరెంట్స్‌-టీచర్స్‌ మీటింగులకు వెళ్లలేకపోయేదాన్ని. ఏది ముఖ్యమో తేల్చుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. 

అమ్మాయి మెచ్చింది..

న్ను ఐసీఐసీఐ ఎండీ, సీయీవోగా కంపెనీ ప్రకటించినపుడు... ‘నువ్వు అంత బాధ్యతాయుతమైన, కీలకమైన హోదాకు వెళ్లడానికి ఎంత కష్టపడి పనిచేసుంటావో అర్థం చేసుకోగలను. అయినా, ఇంట్లో ఎప్పుడూ మాకు అమ్మగానే కనిపించావు. నువ్వు గొప్ప మహిళవి’ అంటూ అప్పుడు అమెరికాలో చదువుతున్న మా అమ్మాయి... మెయిల్‌ పంపింది. అదెంతో ఇష్టంగా, గర్వంగా అనిపించింది. 

నా భర్త నా క్లాస్‌మేట్‌

నేను తలరాతను నమ్ముతాను. ఎంబీఏ చేయకుంటే నా రాత మరోలా ఉండేది. నా భర్త దీపక్‌ ఎంబీఏలో నా క్లాస్‌మేట్‌. అదే కాలేజీలో క్యాంపస్‌ ఇంటర్వ్యూలో కేవీ కామత్‌ నన్ను 1984లో ఐసీఐసీఐకి ఎంపికచేశారు. 1993లో ఐసీఐసీఐ కమర్షియల్‌ విభాగంలోకి అడుగుపెట్టినపుడు అందులో మొదటి ఉద్యోగిని నేనే. 

మహిళలు రావాలి...

హిళలు ఎక్కువగా ఉండే రంగాల్లో బ్యాంకింగ్‌ ఒకటి. ఇక్కడి వాతావరణం మహిళలకు అనుకూలంగా ఉండటమే అందుకు కారణం. నిజానికి బోర్డు పరీక్షల ఫలితాలపుడు అమ్మాయిలే మొదటి స్థానాల్లో నిలవడాన్ని చూస్తున్నాం. కానీ ఉన్నత చదువుల్లో, ఉద్యోగార్థుల్లో వారు తగ్గిపోతున్నారు. అది మారాలి. 

సత్యనారాయణస్వామి కథ...

దేవుణ్ని నమ్ముతాను. వీలున్నపుడు గుడికి వెళ్తాను. ఒకప్పుడు రోజూ ఉదయాన్నే విష్ణు సహస్రనామాలు చదివేదాన్ని. ఇప్పుడంత సమయం ఉండటంలేదు. ప్రతి పున్నమికీ మొబైల్‌లో సత్యనారాయణ స్వామి కథ పెట్టుకొని వింటాను. దేవుడి ఆశీస్సులూ, కుటుంబ సభ్యుల సహకారం- ఈ రెండూ నా ఎదుగుదలలో కీలకం. 

చీరలు ముందే కొంటా

  వారాంతాల్లో కుటుంబ సభ్యులందరం కలిసే డిన్నర్‌ చేస్తాం. ఆ వారం రిలీజైన సినిమా తప్పక చూస్తాం షాపింగ్‌కీ వెళ్తుంటాం. షాపింగ్‌లో ఎక్కువగా చీరలే కొంటాను. చీరల్ని ఫలానా సందర్భం కోసమని అప్పటికప్పుడు కొనాలనుకుంటే మంచివి ఎంచుకోలేం. అందుకే బాగున్నవి కనిపించినపుడల్లా కొని పెడతా. 

అమ్మ స్ఫూర్తి...

నా చిన్నపుడు జైపూర్‌లో ఉండేవాళ్లం. నాన్న చనిపోయాక ముగ్గురు పిల్లలతో అమ్మ ముంబయి వచ్చింది. చిన్న ఉద్యోగం చేసుకుంటూ మమ్మల్ని చదివించి జీవితంలో స్థిరపడేలా చేసింది. క్లిష్టమైన పరిస్థితుల్లో కుంగిపోకుండా, వాటిని అవకాశాలుగా ఎలా మలచుకోవచ్చో అమ్మని చూసి నేర్చుకున్నాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.