close
ట్రెక్కింగ్‌కు వెళ్తున్నారా!

తస్మాత్‌ జాగ్రత్త
ట్రెక్కింగ్‌కు వెళ్తున్నారా!

సాహస యాత్రలకు సై అంటున్న యువతీయువకులు వారాంతాల్లో ఎకో టూరిజం పేరుతో బృందాలుగా అడవుల్లోకి వెళ్లిపోతున్నారు. ట్రెక్కింగ్‌, ర్యాపెలింగ్‌, రాక్‌ క్లైంబింగ్‌ వంటి విన్యాసాలతో ఆటవిడుపు పొందుతున్నారు. సాహస క్రీడల్లో అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. ప్రమాదాలు ఎదురవుతాయి. ఇటీవల తమిళనాడులోని తేని జిల్లాలో చోటుచేసుకున్న కార్చిచ్చు ఘటనే ఇందుకు ఉదాహరణ. వనవిహారం భద్రంగా జరగాలంటే ఈ సూచనలు పాటించండి.
* చాలామంది బృందాలుగా అడవుల్లోకి వెళ్లిపోయి ట్రెక్కింగ్‌ (పర్వతారోహణ)లో పాల్గొంటూ ఉంటారు. కొన్ని సంస్థలు కూడా ట్రెక్కింగ్‌లు ఏర్పాటు చేస్తూ ఉంటాయి. అయితే ట్రెక్కింగ్‌ నిర్వహించాలంటే అటవీ శాఖ నుంచి అనుమతి తప్పకుండా తీసుకోవాలి. అనుమతి లభించిన తర్వాతే యాత్రికులను ఆహ్వానించాలి.
* ట్రెక్కింగ్‌ వెళ్తున్న బృందానికి సారథ్యం వహిస్తున్న వ్యక్తికి తాము వెళ్తున్న ప్రదేశం గురించి అవగాహన ఉండాలి.
* బృందంలో సభ్యుల సంఖ్య చాలా పరిమితంగా ఉండాలి. సభ్యుల సంఖ్య పెరిగే కొద్దీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశమూ పెరుగుతుంది.
* ట్రెక్కింగ్‌ మొదలయ్యే ముందు.. అడవిలో వెళ్తున్న దారి, ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎంత సమయంలో ఎక్కడికి చేరుకోవాలి, ఆహారం, నీటి వసతి వీటన్నిటి గురించి తెలియజేయాలి.
* వైద్య సేవలు అందుబాటులో ఉండేలా జాగ్రత్త వహించాలి. అత్యవసర పరిస్థితుల్లో వాహనం అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ప్రాథమిక చికిత్స కిట్‌ అందరి దగ్గరా ఉండాలి.
* నిర్దేశించుకున్న మార్గంలోనే ట్రెక్కింగ్‌ కొనసాగించాలి. అంతేకానీ, ముందుగా వెళ్లిపోయిన వారిని అందుకోవాలని అడ్డదారుల్లో ప్రయాణిస్తే ఊహించని పరిణామాలు ఎదురవ్వొచ్చు.
* ఆడవిలో మంటతో చెలగాటం ఆడటం ఒక్కోసారి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. పొగ తాగి.. సిగరెట్‌ పీకలను ఆర్పేయకుండా పాడేయటం చాలా ప్రమాదకరం. వంట చేసుకున్నా, చలిమంట వేసుకున్నా.. మైదాన ప్రాంతంలోనే చేయాలి. చెట్ల మధ్యలో ఇలాంటి పనులు చేస్తే ఇబ్బందులపాలు కావొచ్చు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.