close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దేనికి ఎన్ని చెట్లు..?

దేనికి ఎన్ని చెట్లు..?

  జీవుల మనుగడకు అడవులూ చెట్లూ ఎంత అవసరమో తెలిసిందే. అందుకే, మనవంతుగా పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కల్ని పెంచడానికీ ప్రయత్నిస్తుంటాం. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనం రోజువారీ వాడే రకరకాల ఉత్పత్తుల తయారీకి లక్షలాది చెట్లు నేలకొరుగుతున్నాయని.
ప్రతిరోజూ 80వేల ఎకరాల అడవులు నాశనం అవుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే మరో వందేళ్లలో ప్రపంచంలోని మొత్తం వర్షారణ్యాలు కనిపించకుండాపోయే ప్రమాదం ఉంది. దీనికి ప్రధానకారణం వ్యవసాయం కోసం అడవుల్ని నరికివేయడం, చెక్క ఉత్పత్తులూ, కాగితం, కాగితంతో తయారయ్యే టిష్యూలూ పేపర్‌ కప్పులూ కార్డుబోర్డు బాక్సుల్లాంటి ఉత్పత్తుల వాడకం విపరీతంగా పెరగడమే. వీటివల్ల ఇప్పటికే ప్రపంచంలోని 80శాతం అటవీ ప్రాంతం కనుమరుగైపోయింది.
* అడవుల నరికివేతవల్ల వచ్చే పాతికేళ్లలో 28000 అరుదైన మొక్కల జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది.
* ఏటా 30కోట్ల చెట్లను కాగితం తయారీకోసం కొట్టేస్తున్నారు.
* మొత్తం కాగితం తయారీలో భారత్‌ వాటా మూడు శాతం. ప్రపంచ జనాభాలో అమెరికాది కేవలం 5శాతమే. కానీ మొత్తమ్మీద వాడే కాగితంలో 30శాతం వాటా ఆ దేశానిదే. సగటు అమెరికన్‌ పౌరుడు ఏటా 317 కిలోల కాగితాన్ని వాడుతున్నాడు మరి.
* ప్రతి రోజూ 27వేల చెట్లు టాయ్‌లెట్లలోనూ భూమిలోనూ కరిగిపోతున్నాయి. ఎలా అంటే... టాయ్‌లెట్‌ టిష్యూల రూపంలో.
* సిగరెట్ల తయారీలో వాడే కాగితం కోసం రోజుకి 15 లక్షల చెట్ల మీద గొడ్డలి వేటు పడుతోంది. ఒక చెట్టుని నరికితే మూడువందల సిగరెట్లు తయారవుతాయి.
* ప్రతి నిమిషానికీ అయిదు ఫుట్‌బాల్‌ ఫీల్డ్‌లకు సమానమైన అడవుల్ని అనధికారికంగా నాశనం చేస్తున్నారు.
* అడవుల్ని నరికివెయ్యడానికి మరో ప్రధాన కారణం వ్యవసాయమే. ఏటా దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లోని 1.3 కోట్ల హెక్టార్ల అడవులు వ్యవసాయ భూములుగా మారుతున్నాయి.
* ప్రపంచ వ్యాప్తంగా తయారయ్యే చెక్క ఉత్పత్తుల్లో సగానికి పైగా వాడుతున్నది అమెరికా, ఐరోపా దేశాలూ జపాన్‌లేనట. 70శాతం కాగితం ఉత్పత్తుల్ని వాడేదీ ఈ దేశాలే.
* మిగిలిన దేశాలతో పోల్చితే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు 12 రెట్లు అధికంగా చెక్కను వాడుతున్నాయి.
* ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం భూమ్మీద ఉన్న ఉష్ణమండల అడవుల్లో సగానికి సగం ఇప్పటికే తుడిచిపెట్టుకుపోయాయి.
* 15శాతం గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌లకు కారణం అడవుల్ని నరికివెయ్యడమే. భూమ్మీద ఉన్న వివిధ జాతుల జంతువులూ చెట్లలో 70శాతం అడవుల్లోనే కనిపిస్తాయి. అందుకే, అడవుల్ని నరికివేయడంవల్ల జీవ వైవిధ్యం దెబ్బతినడంతో పాటు
ఔషధాల తయారీకి ఉపయోగపడే చెట్లకూ కొరత ఏర్పడుతోంది.

రెన్సీ నోట్ల తయారీకోసం కోట్ల చెట్లు నేలకొరుగుతున్నాయి. ఒక్క భారత్‌లోనే నోట్ల తయారీకి ఏటా 5.27 లక్షల చెట్లను నరికివేయాల్సొస్తోంది.

ర్యావరణహితం కోసం ప్లాస్టిక్‌ కప్పులకు బదులు పేపర్‌ కప్పుల్ని వాడటం మొదలుపెట్టాం. కానీ కాగితం కప్పుల తయారీకి ఏటా రెండుకోట్ల చెట్లను నరికేస్తున్నారు.

క టన్ను కాగితాన్ని రీసైకిల్‌ చెయ్యగలిగితే 17 చెట్లను కాపాడగలిగినట్లే. ప్రపంచం మొత్తమ్మీద ప్రింట్‌ అయ్యే వార్తా పత్రికల్ని రీసైకిల్‌ చేస్తే ఏటా 25 కోట్ల చెట్లను కాపాడొచ్చట.

న్ని దేశాల్లో కలిపి ఏటా 1500 కోట్ల పెన్సిళ్లు తయారవుతున్నాయి. ఒక చెట్టుతో 1.7 లక్షల పెన్సిళ్లు తయారవుతాయి. ఆ లెక్కన ఏటా నేలకొరిగే చెట్లెన్నో..?

నం వేసుకునే రేయాన్‌ టీషర్టులూ డ్రెస్సుల తయారీ కోసం ఏటా 12కోట్ల చెట్లు నేల కొరుగుతున్నాయి. 30శాతానికి పైగా రేయాన్‌ వస్త్రం పురాతన అడవుల్లోని చెట్ల గుజ్జుతోనే తయారవుతోంది. రేయాన్‌, కాగితం పరిశ్రమల కారణంగా పన్నెండేళ్ల కాలంలో ఇండోనేషియాలో 1.5 కోట్ల హెక్టార్ల అటవీప్రాంతం కనుమరుగైపోయిందంటేనే పర్యావరణానికి ప్రమాదం ఏ స్థాయిలో పొంచి ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.