close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జ్ఞాపకాలతో కదిలి..

అడుగులు వదిలి..
జ్ఞాపకాలతో కదిలి..

ఇల్లు ఒక మ్యూజియంలా ఉంటుంది. దేశవిదేశాలకు చెందిన వస్తువులు, పతాకాలు, నాణేలు.. ఇలా ఎన్నో దర్శనమిస్తాయి. ఇవన్నీ ఎవరో తెచ్చి ఇచ్చినవి కావు. ఆ ఇంటి యజమాని స్వయంగా సేకరించినవి. ఇన్నిటి మధ్య తీరిక లేకుండా ఉంటాడా వ్యక్తి. ఆయన పేరు ఇంద్రనీల్‌ చౌధురి. ఊరు హైదరాబాద్‌. ఎప్పుడూ ఏదో దేశానికి వెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంటారు. ఇప్పటి దాకా 107 దేశాలు తిరిగొచ్చిన ఆయనను పలకరించింది విహారి. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

‘‘గ్రీన్‌లాండ్‌లో అతిథులను బాగా గౌరవిస్తారు! మంగోలియాలోనూ అంతే! ‘పెరూలోని ఇన్కా కోటల్లో విహారం మరచిపోలేని అనుభూతినిచ్చింది. బ్రెజిల్‌లో జరిగిన ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ క్షణాలు మళ్లీ మళ్లీ రావాలనిపిసుంటుంది! ఆ దేశాల గురించి గంటలకొద్దీ చెప్పొచ్చు. ఒక్కో పర్యటన గురించి ఒక్కో పుస్తకం రాసేయొచ్చు. ఈ ప్రపంచాన్ని చుట్టిరావాలని 1990 ప్రాంతంలో అనుకున్నాను. 150 దేశాలైనా పర్యటించాలని సంకల్పించా. ఇప్పటి వరకు 107 దేశాలు తిరిగాను. విలువైన సమయాన్ని వెచ్చించి.. అంతకన్నా ఘనమైన ప్రదేశాలను చూశాను. ఆయా దేశాల్లో అడుగులు వదిలి.. మధురమైన జ్ఞాపకాలతో ముందుకు కదిలాను. విదేశాల నుంచి ఎన్నడూ ఖాళీగా రాలేదు.. బ్యాగు నిండా అక్కడ దొరికే అరుదైన వస్తువులను మోసుకొచ్చినా.. మనసులో మోయలేనంత ఆనందాన్ని సొంతం చేసుకున్నాను.

ఇక్కడికి ఎందుకొచ్చావన్నారు?
నేను పర్యటించిన దేశాల్లో అందరికీ తెలిసిన దేశాలు ఉన్నాయి. పేరు చెప్పడానికి నోరు తిరగని దేశాలూ ఉన్నాయి. సంపన్న దేశాలూ ఉన్నాయి.. పేదవీ ఉన్నాయి. తూర్పు ఆఫ్రికా దేశాలన్నీ చూశాను. కరేబియన్‌ దేశాలూ చుట్టేశాను. కొన్ని దేశాలూ కుటుంబంతో కలిసి వెళ్లాను. కొన్ని ఒంటరిగా చూసొచ్చాను. ఈ ప్రయాణంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎన్నో!. ఆగ్నేయ యూరప్‌లోని కోసోవో దేశ పర్యటనలో గమ్మత్తయిన అనుభవం ఎదురైంది. ఒక భారతీయుడు వెకేషన్‌ కోసం తమ దేశానికి రావడం ఏంటని అక్కడి ఎంబసీ అధికారులకు అనుమానం వచ్చింది. ‘ఇలా దేశాలు తిరగడం నా అభిరుచి’ అని చెప్పినా నమ్మలేదు వాళ్లు. అరెస్ట్‌ చేసినంత పని చేశారు. ఇలాంటి తమాషా సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒంట్లో శక్తి ఉన్నంత కాలం ఇలా దేశవిదేశాలు పర్యటిస్తూనే ఉంటాను. నా ముందున్న లక్ష్యం 150 దేశాల పర్యటన పూర్తి చేయడమే.
గొప్ప సందేశం..
విదేశీ పర్యటనల్లోనే అంతర్జాతీయ క్రీడా వేదికలు ఉండేలా జాగ్రత్తపడతాను. ఫుట్‌బాల్‌ కప్‌లు, వింటర్‌ ఒలింపిక్స్‌, సమ్మర్‌ ఒలింపిక్స్‌, టెన్నిస్‌ క్రీడలు ఎక్కడ జరిగితే అక్కడ వాలిపోతా. ఒక బహుళజాతి సంస్థ అంతర్జాతీయ మార్కెటింగ్‌ విభాగం హెడ్‌గా పని చేస్తున్నా. నాకొచ్చే వేతనంలో సింహభాగం ప్రయాణానికే వెచ్చిస్తుంటా. ఈ విషయంలో నా భార్యకు ధన్యవాదాలు చెప్పాలి. పర్యటనలకు నేనెంత ఖర్చు చేసినా ఏమనదు. అవకాశం ఉంటే కుటుంబంతో వెళ్తుంటాను. ఒక అభిరుచిగా మొదలైన విదేశీ విహారం నా వ్యక్తిత్వంపై ఎంతో ప్రభావం చూపింది. ఇంత పెద్ద ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు అందులో నేనెంత అనే భావన కలుగుతుంది. ఇంతకు మించిన సందేశం ఏముంటుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.