close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే...

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే...

రీరావయవాల్లో ప్రధానమైన వాటిల్లో మూత్రపిండాలు ఒకటి. అవి సరిగ్గా పనిచేస్తేనే మిగిలిన భాగాలూ ఆరోగ్యంగా ఉంటాయి. శరీరంలో పేరుకున్న టాక్సిన్లనీ నీటినీ బయటికి పంపడం, రక్తకణాల ఉత్పత్తిని ప్రేరేపించడం... ఇలా ఎన్నో విధుల్ని నిర్వర్తిస్తాయి. అయితే ఇటీవల రకరకాల కారణాలతో చాలమంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. ఆ సమస్య రాకుండా నియంత్రించాలంటే విధిగా ఆహారంలో వీటిని తీసుకుంటే సరి.
* నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదే కానీ అది మితిమీరకూడదు. ఆడవాళ్లు 8, మగవాళ్లు 13 గ్లాసుల నీరు తాగితే సరిపోతుంది. అయితే ఎవరైనా ఎంత నీరు తాగాలి అనేది ఆయా వ్యక్తుల శరీర తత్వం, వాళ్ల దినచర్యని బట్టి ఉంటుంది.
* ఉల్లి, ఎరుపురంగు క్యాప్సికమ్‌ల్లో పొటాషియం తక్కువగా ఉండటంవల్ల అవి మూత్రపిండాలకు మేలుచేస్తాయి. అలాగే ఉల్లిలోని క్రోమియం జీవక్రియకీ మంచిదే. కిడ్నీల ఆరోగ్యానికి కాలీఫ్లవర్‌ ఎంతో మేలు. దీన్ని ఉడికించీ లేదా వేడినీళ్లలో ఓసారి ముంచి తీసి తినాలి.
* రోజూ ఓ ఆపిల్‌ తినడం వల్ల మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు రాకుండా నిరోధించవచ్చు. ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే చేపలు కిడ్నీల పనితీరుని పెంపొందిస్తాయి. గుమ్మడి గింజలు కూడా మూత్రాశయంలో రాళ్లు ఏర్పడకుండా చూస్తాయి. ఊదారంగు చిలగడదుంప, పుచ్చకాయ, ఎర్ర ద్రాక్ష, స్ట్రాబెర్రీ, చెర్రీలు కూడా కిడ్నీ వ్యాధులు రాకుండా రక్షిస్తాయి.


పెదాలమీద ఆ నలుపేంటి?

రచూ పెదాలను తడుపుతుండటం లేదా రకరకాల లిప్‌బామ్‌లూ లిప్‌స్టిక్‌లూ వాడటం వల్ల పెదాలు సున్నితత్వాన్నీ మెరుపునీ కోల్పోయి నల్లబడి, పొడిబారి పోతాయి. అలాంటి పెదాలను మళ్లీ మెరిపించాలంటే ఇంట్లోనే ఇలా చేసి చూడండి...
* టేబుల్‌స్పూను నిమ్మరసంలో టేబుల్‌స్పూను తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు పట్టించి ఓ గంటసేపు ఉంచాలి. తరవాత మెత్తని తడిబట్టతో తుడిచేయాలి. ఇలా రోజుకి కనీసం మూడుసార్లు చేయాలి. నిమ్మరసం వల్ల పెదాలకున్న నలుపు రంగు పోతే, తేనె వల్ల అవి మృదువుగా మారతాయి. లేదంటే పడుకునే ముందు కాటన్‌ బడ్‌తో గ్లిజరిన్‌ను పెదాలకు రాసి పడుకుంటే ఎండకీ గాలికీ రంగుమారి, పొడిబారిన పెదాలు మళ్లీ యథాస్థితికి వస్తాయి.
* అలొవెరా గుజ్జును రాసినా మేలే. ఇందులోని పాలీఫినాలిక్‌ ఆమ్లాలు పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తాయి. అందులోని పోషకాల కారణంగా పెదాలు మృదువుగా మారి, మెరుస్తుంటాయి.
* నల్లబడిన పెదాలకు ఆపిల్‌ సిడార్‌ వినెగర్‌ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. టీస్పూను వినెగర్‌లో టీస్పూను నూనె కలిపి దాన్ని దూది సాయంతో పెదాలకు పట్టించి, పది నిమిషాల తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగితే మంచిది. రోజుకి ఒకసారి ఇలా చేయాలి. ఆపిల్‌ సిడార్‌ వినెగర్‌లో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలకి పిగ్మెంటేషన్‌ని తగ్గించే లక్షణం ఉంటుంది.


ఎందుకా మౌనం?

దంపతుల్లో ఒకరు విషయం ఏమిటో చెప్పకుండా మౌనంగా శృంగార జీవితానికి దూరంగా ఉంటే రెండోవ్యక్తి మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఆ విషయం మీదే వాళ్లతో గొడవపడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఇవి విడిపోవడానికీ దారితీస్తుంటాయి. అలాంటి సమయంలోనే సంయమనం అవసరం అంటున్నారు నిపుణులు. ఉదాహరణకు భర్త మాట్లాడకుండా దూరంగా ఉంటే భార్య ఫీలవడం సహజం. అలాంటప్పుడు దానికి కారణమేంటో తెలుసుకోవడానికి గుచ్చిగుచ్చి ప్రశ్నించడం, విమర్శించడం వల్ల ఉపయోగం లేకపోగా నష్టమే ఎక్కువ. కొంత సమయం ఇచ్చి, వాళ్లంతట వాళ్లే చెప్పేవరకూ ఓపికగా ఉండాలి. వాళ్ల మౌనానికి కారణం ఏమిటనేది తెలిసినా కూడా వాళ్లంతట వాళ్లు చెప్పనంతవరకూ ఉచిత సలహాలు ఇవ్వకూడదు. అవతలివాళ్లు మరీ సున్నిత మనస్కులు అయితే ఆ సలహాలు వాళ్లకి మరింత మనస్తాపాన్ని కలిగిస్తాయి. ఎంతకీ ఎప్పటికీ బయటపడకపోతే, అప్పుడు విషయమేంటో తెలుసుకునేందుకు ఆప్యాయతతో ప్రేమతో పలకరించాలి. పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తూ దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తే తప్పక ఫలితం ఉంటుంది.


ఫిట్‌గా ఉన్నారా?!

మీరు ఫిట్‌గా ఉన్నారా లేదా అన్నది తెలుసుకోవడానికి మొత్తం బాడీ టెస్టులు అవసరం లేదు. అద్దంలో ఒకసారి మీ నడుం చుట్టుకొలతను చూసుకోండి. అది పెరిగి వేలాడుతూ ఉంటే, మీరు ఫిట్‌గా లేరని అర్థమైనట్లే. పైగా దానివల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ శాతం పెరుగుతుంది. దీనివల్ల మొత్తం జీవక్రియ దెబ్బతింటుంది అని డెన్మార్క్‌కు చెందిన కోపెన్‌హాగన్‌ విశ్వవిద్యాలయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకోసం వాళ్లు బాడీమాస్‌ ఇండెక్స్‌ ఆధారంగా అనేకమందిని పరిశీలించి చూశారట. అందులో నడుం చుట్టుకొలత అధికంగా ఉన్నవాళ్లలో బాడీమాస్‌ ఇండెక్స్‌ ప్రకారం ఉండాల్సిన దానికన్నా అధిక బరువు ఉండటంతో బాటు, వాళ్లలో ఇన్‌ఫ్లమేషన్‌ శాతం కూడా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అదే ఫిట్‌గా ఉండేవాళ్లలో పొట్ట దగ్గర కొవ్వు లేకుండా ఉండటంతో బాటు ఇన్‌ఫ్లమేషన్‌ శాతం కూడా తక్కువగా ఉన్నట్లు తేలింది. కాబట్టి జాగ్రత్త సుమా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.