close
ప్యాకేజీతో చుట్టేయండి..

ప్యాకేజీతో చుట్టేయండి..

పర్యాటకులకు పసందైన వినోదాన్ని అందించడానికి ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ టూరిజం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌సీటీసీ) కొత్త కొత్త ప్యాకేజీలు ప్రకటిస్తూనే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి దేశీయ యాత్రలతో పాటు విదేశీ విహార ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. విశాఖ నుంచి సింగపూర్‌, హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ టూర్‌కు ప్యాకేజీలను సిద్ధం చేసింది. తిరుమల క్షేత్ర దర్శనానికి ప్రత్యేకంగా నాలుగు ప్యాకేజీలు నిర్వహిస్తోంది. నచ్చిన ప్యాకేజీని ఎంచుకొని మెచ్చిన ప్రదేశానికి సులభంగా చుట్టిరావొచ్చంటున్నారు ఐఆర్‌సీటీసీ అధికారులు. ఆ ప్యాకేజీల వివరాలు..

సింగపూర్‌ వయా మలేసియా

ధర: రూ.61,660 నుంచి రూ.70,025 (పెద్దలకు)
పిల్లలకు (2-11 సం) : రూ.50,940 నుంచి రూ.57,419
ఎప్పుడు: మార్చి 24న
ఎన్ని రోజులు: ఐదు రాత్రులు/ ఆరు పగళ్లు
ఏమేం చూపిస్తారు: తూర్పు మలేసియా, సింగపూర్‌
ప్రత్యేకతలు: సింగపూర్‌లో నైట్‌ సఫారీ, వైబ్రంట్‌ చైనాటౌన్‌, ప్రత్యేక విహార కేంద్రాల సందర్శన, సెంటోసా కేబుల్‌ కార్‌ విహారం, మేడమ్‌ టుస్సాడ్‌ మైనపు మ్యూజియం, యూనివర్సల్‌ స్టూడియో సందర్శన, కౌలాలంపూర్‌లో సాహస క్రీడలు, బాతూ గుహలు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, చారిత్రక ప్రదేశాల విహారం మరెన్నో..

చలో దుబాయ్‌

ధర: రూ.69,698 (ఒక్కొరికి)
పిల్లలకు (2 నుంచి 11 సం): రూ.56,507
ఎడారి దేశంలోని అద్భుతాలు చూడాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ హైదరాబాద్‌-దుబాయ్‌-అబుదాబి ప్యాకేజీ నిర్వహిస్తోంది.
ఎప్పుడు: మార్చి 18న
ఎన్ని రోజులు: నాలుగు రాత్రులు/ ఐదు పగళ్లు
ఏమేం చూపిస్తారు: దుబాయ్‌, అబుదాబి
ప్రత్యేకతలు: దుబాయ్‌ నగర సందర్శన, క్రూయిజ్‌లో విహారం, షేక్‌ జయిద్‌ మసీదు, గ్లోబల్‌ విలేజ్‌, మిరాకిల్‌ గార్డెన్‌, ఎడారిలో జీప్‌ సఫారీ, అబుదాబి నగరం చుట్టిరావడం మరెన్నో..

తిరుమల ప్రత్యేకం

ఐఆర్‌సీటీసీ పర్యాటకుల సౌకర్యార్థం హైదరాబాద్‌ నుంచి విరివిగా తిరుమల యాత్ర ప్యాకేజీ నిర్వహిస్తోంది. ‘శ్రీ బాలాజీ దర్శనం టూర్‌’, ‘గోవిందం’, ‘వెంకటాద్రి’, ‘వెంకటాద్రి శ్రీపురం’ ఇలా నాలుగు రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.

విమానంలో..
విమానంలో తిరుమలకు వెళ్లదలచిన వారి కోసం ‘శ్రీ బాలాజీ దర్శనం టూర్‌’ ప్యాకేజీని ప్రకటించింది.
ఎప్పుడు: మార్చి 9, 10, 16, 17, 23, 24, 30, 31 తేదీల్లో
ఎన్ని రోజులు: 1 రాత్రి/ 2 పగళ్లు
ఏమేం చూపిస్తారు: తిరుపతి, కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచనూరు, తిరుమల
ధర: రూ. 10,135 నుంచి రూ.12,112
పిల్లలకు (5-11 సం..): రూ.8,999 నుంచి రూ.10,135

వెంకటాద్రి-శ్రీపురం ప్యాకేజీ
ఎప్పుడు: ప్రతి శుక్రవారం
ఎన్ని రోజులు: 3 రాత్రులు/ 4 పగళ్లు
ఏమేం చూపిస్తారు: కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీపురం, తిరుమల, తిరుచానూరు
ప్యాకేజీ ధర: రూ.5,575 నుంచి రూ.9,213 పిల్లలకు (5-11 సం) రూ.5,164 నుంచి రూ.7,307

భజ ‘గోవిందం’
ఎన్ని రోజులు: 2 రాత్రులు/ 3 పగళ్లు ఎప్పుడు: ఆదివారం నుంచి గురువారం
ఏమేం చూపిస్తారు: తిరుమల, తిరుచానూరు
ధర: రూ.3,785 నుంచి రూ.6377
పిల్లలకు (5-11 సం): రూ. 2,974 నుంచి రూ.4,745

మరిన్ని వివరాలకు క్లిక్‌.. www.irctctourism.com

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.