close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దిల్లీ గల్లీల్లో...

రాజధాని రుచులు
దిల్లీ గల్లీల్లో...

‘సాపాటు ఎటూ లేదు’ అంటూ అప్పట్లో పాటందుకున్నారు కొందరు యువకులు. రాజధాని నగరంలో వీధి వీధి తిరిగితే వాళ్లు ఆ మాట అనుండేవాళ్లు కాదేమో! చారిత్రక నగరమైన హస్తినలో ఓ చోట వేడి వేడిగా పరాటాలు అమ్ముడవుతుంటాయి. ఇంకో చోట కారంగా చాట్‌ పిలుస్తుంటుంది. మరోచోట కుల్ఫీలు తియ్యంగా రమ్మంటాయి. ఇలా రకరకాల రుచులు పలకరిస్తుంటాయి. ఏ ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి రుచులు ఓ పట్టు పట్టాలన్నది పర్యాటక ప్రియుల నియమం. దిల్లీవాసులు ఇష్టంగా ఆరగించే కొన్ని ఉపహారాలు.. అవి దొరికే స్థలాల వివరాలు ఇక్కడిస్తున్నాం. ఈసారి హస్తినకేగినప్పుడు.. అవేమిటో మీరూ రుచి చూసేయండి.


వీధంతా పరాటాలే..

పాతదిల్లీలో ఓ గల్లీ మొత్తం పరాటాలే పలకరిస్తాయి. చాందినీ చౌక్‌ సమీపంలో ఉండే ఆ వీధి వెంట వెళ్లే వారెవ్వరూ.. పరాటాల రుచి చూడకుండా బయటకు రాలేరు. అంత రుచిగా ఉంటాయవి మరి. 1870లో ‘పరాటే వాలీ గలీ’కి పునాది పడింది. అప్పట్లో ఐదారుగురు ఇక్కడ పరాటాలు అమ్మే చిన్న హోటళ్లు మొదలుపెట్టారు. ఇప్పటికీ వారి వారసులే ఇక్కడ పరాటా కేంద్రాలు నిర్వహిస్తున్నారు. యాభైకిపైగా పరాటా కేంద్రాలు ఉన్నాయిప్పుడు. పరాటాలోకి కేవలం శాకాహార కూరలనే వండుతారు. అందులోనూ ఉల్లిపాయ, వెల్లుల్లి వేయకుండా చేయడం వీరి ప్రత్యేకత. ఎర్రకోటకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ‘పరాటే వాలీ గలీ’.


కురేమాల్‌ కుల్ఫీ

దిల్లీ నగరంలో కుల్ఫీలు చాలా చోట్ల దొరుకుతాయి. సీతారామ్‌ బజార్‌లోని కురేమాల్‌ కుల్ఫీ సెంటర్‌లో రుచి మాత్రం మరెక్కడా దొరకదు. 1900 తొలినాళ్లలో కురేమాల్‌ కుటుంబం ఈ కుల్ఫీ సెంటర్‌ను ప్రారంభించింది. ఆనాటి నుంచి రకరకాల కుల్ఫీలతో దిల్లీవాసుల మనసులు గెలుచుకుంటున్నారు కురేమాల్‌ వారసులు. కాలానుగుణంగా వెరైటీ రుచులను పరిచయం చేస్తున్నారు. మామిడి, ఆరెంజ్‌, దానిమ్మ పళ్లతో రూపొందించిన కుల్ఫీలు నిమిషాల్లో అమ్ముడవుతాయిక్కడ. చాందినీ చౌక్‌ నుంచి అర కిలోమీటర్‌ దూరంలో ఉండే కురేమాల్‌ కుల్ఫీ సెంటర్‌ ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు తెరిచి ఉంటుంది.


మున్నీలాల్‌ చాట్‌