close
చల్లపల్లి చూసొద్దాం

లోకల్‌టూర్‌
చల్లపల్లి చూసొద్దాం

ప్పుడు రాజులు లేరు. రాజ్యాలు అంతకన్నా లేవు. సంస్థానాలూ లేవు. జమీందార్లూ లేరు. కానీ, ఆనాటి రాచరికపు ఠీవిని ఈనాటికీ కళ్లముందుంచే ఆనవాళ్లకు మాత్రం కొదువలేదు. కోటలు, బురుజులు, గడీలు ఊరూరా కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని కోటలు బీటలు వారి చరిత్రను వెక్కిరిస్తుంటే.. ఇంకొన్ని భవనాలు అంతే అందంగా ఘన చరిత్రకు వారధిగా నిలుస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి కృష్ణాజిల్లాలోని చల్లపల్లిరాజా వారి కోట. నాలుగు శతాబ్దాల చరిత్రకు దర్పణంగా ఉన్న చల్లపల్లి కోట వారాంతపు పర్యాటక విడిదిగా అలరిస్తోంది.
చల్లపల్లి రాజావారి కోట అంటే కృష్ణా-గుంటూరు జిల్లాలో తెలియని వారు ఉండరు. దేవరకోట సంస్థానానికి చల్లపల్లి రాజధానిగా ఉండేది. ఈ జమీ పరిధిలో సుమారు వందకుపైగా గ్రామాలు ఉండేవి. యార్లగడ్డ వంశీయులు చల్లపల్లిని పాలించేవారు. 190 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న దేవరకోట సంస్థానం.. 1949లో భారతదేశంలో విలీనమైంది.
అక్కడంతా ప్రశాంతం..
చల్లపల్లిలో ప్రధాన ఆకర్షణ.. రాజావారి కోట. బురుజులు, భవంతులతో 20 ఎకరాలు విస్తరించి ఉంటుంది. అశోక వృక్షాలు, భారీ చెట్లతో, నిండైన పచ్చదనంతో ఆ ప్రాంతమంతా ప్రశాంతంగా ఉంటుంది. కోటలోని అపురూప శిల్ప సంపద అందరినీ ఆకట్టుకుంటుంది. కోట ప్రధాన ద్వారం ఆనాటి అద్భుత నిర్మాణశైలికి ప్రతీకగా నిలుస్తుంది. కోట ముఖద్వారం దగ్గర ఏర్పాటు చేసిన కంచుగంట ఆ రోజుల్లో చల్లపల్లివాసులకు గడియారంగా ఉపయోగపడేది. గంట గంటకూ.. ఆ కంచు గంట మోగించే వాళ్లు. దానిని బట్టి కోట చుట్టుపక్కల ప్రజలు సమయాన్ని తెలుసుకునేవారు. నేటికీ ఆ సంప్రదాయం కొనసాగుతుండటం విశేషం. కోటలోని ప్రధాన భవనంలో ఉన్న శిల్పాలు, పింగాణి సామగ్రి, గృహోపకరణ వస్తువులను చూసేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపుతుంటారు.
ఇలా వెళ్లొచ్చు..
విజయవాడ నుంచి చల్లపల్లి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయవాడ నుంచి బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.
సమీపంలో..
చల్లపల్లికి సమీపంలో ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి.
మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం  (8 కిలోమీటర్లు)
శాస్త్రీయ నృత్య కేంద్రమైన కూచిపూడి (16 కిలోమీటర్లు)
పెదకళ్లేపల్లి శ్రీదుర్గానాగేశ్వరస్వామి ఆలయం (10 కిలోమీటర్లు)
కృష్ణానది సముద్రంలో కలిసే హంసలదీవి (35 కిలోమీటర్లు)
బౌద్ధ క్షేత్రం ఘంటసాల (8 కిలోమీటర్లు)


నౌకా విహారం..

ల్లపల్లికి 25 కిలోమీటర్ల దూరంలో నాగాయలంక  లాంచీల రేవు దగ్గరున్న శ్రీరామపాదక్షేత్రం ఎంతో ప్రసిద్ధి. ఇక్కడి నుంచి పడవల్లో కృష్ణానదిపై విహరించవచ్చు. నాగాయలంక మండలం గుల్లలమోద సమీపంలో 110 అడుగుల ఎత్తులో లైట్‌హౌస్‌ ఉంది. దీనిని చూసేందుకు నాగాయలంక నుంచి ప్రత్యేక లాంచీల్లో పర్యాటకులు తరలివెళ్తుంటారు.

- హరిప్రసాద్‌, చల్లపల్లి  

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.