close
సోలోగా..కులాసాగా..

సోలోగా..కులాసాగా..

ఉద్యోగంలో ఒత్తిడికి విరుగుడు విహారమే! కార్పొరేట్‌ ఉద్యోగాలు చేస్తున్న మహిళలు ఇదే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. వారాంతాల్లో చిన్న చిన్న ప్రయాణాలకు వెళ్లిపోతున్నారు. ఏడాదికి ఒకట్రెండుసార్లు పెద్దటూరుకే ప్లాన్‌ చేస్తున్నారు. అదీ ఒంటరిగా! సోలో ప్రయాణాలు కులాసాగా సాగాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
* ముందస్తుగా ప్లాన్‌ చేసుకోవాలి. వెళ్తున్న ప్రాంతం గురించి ఎంతో కొంత తెలుసుకోవాలి. అక్కడ బస చేయడానికి ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో చూసుకోవాలి.
* కొత్త ప్రదేశంలో ఎవరినీ గుడ్డిగా నమ్మేయొద్దు. అలాగని అందరినీ అనుమానంగా చూడటం సరికాదు. నలుగురితో మాట్లాడండి. స్థానిక ప్రత్యేకతల గురించి తెలుసుకోండి. మీ వ్యక్తిగత వివరాలు వారికి పూర్తిగా చెప్పాల్సిన పని లేదు.
* వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు దగ్గర ఉంచుకోండి. డబ్బు ఒకే చోట కాకుండా.. రెండు మూడు చోట్ల దాచుకోండి.
* ఆత్మరక్షణకు అవసరమైన ముఖ్య వస్తువులు దగ్గర ఉంచుకోండి. పెప్పర్‌ స్ప్రే, పర్సనల్‌ సేఫ్టీ అలారమ్‌ మీ అందుబాటులో ఉండాలి. వ్యక్తిగత రక్షణ కోసం మొబైల్‌ అప్లికేషన్ల సహకారం తీసుకోండి.
* ఎక్కడికి వెళ్లినా.. కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉండండి. మీ క్షేమ సమాచారాలు వీలైనప్పుడల్లా వారికి తెలియజేయండి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.