close
బుక్‌ యువర్‌ బస

దిక్సూచి
బుక్‌ యువర్‌ బస

విహార యాత్రకు కుటుంబంతో వెళ్లినా.. ఒంటరిగా బయల్దేరినా.. ప్రయాణంలో పదనిసలు మామూలే! విడిదిలోనూ విసుగు తలెత్తితే..? ఆనందం ఆవిరైపోతుంది. వేళ కాని వేళ పర్యాటక కేంద్రానికి చేరుకుంటాం. ఆ సమయంలో హోటల్స్‌లో గదులు అందుబాటులో ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా... తక్కువ అద్దె ఉన్న గదులు సౌకర్యంగా ఉండవు. మంచి హోటల్‌ ఎంచుకుంటే.. జేబు గుల్లవుతుంది. ఈ సమస్యకు పరిష్కారం ‘హాస్టల్‌ వరల్డ్‌’ యాప్‌. దేశవిదేశాల్లోని పర్యాటక కేంద్రాల్లో విడిది కావాలంటే ఈ యాప్‌లో ఇట్టే దొరికేస్తుంది. పేయింగ్‌ గెస్ట్‌ గదులు, హాస్టళ్లు, చిన్నా-పెద్దా లాడ్జ్‌లు వివరాలు యాప్‌లో ఉంటాయి. గదుల అద్దె వివరాలు, అక్కడ లభించే సౌకర్యాలు అన్నీ యాప్‌లో చూడొచ్చు. రూ.400 అద్దె (ఇద్దరికి) ఉన్న గదులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. అంతేకాదు.. అంతకుముందు ఆ గదిలో బస చేసిన యాత్రికుల రివ్యూలూ చదువుకోవచ్చు. హైదరాబాద్‌, వైజాగ్‌, బెంగళూరు, జైపూర్‌, దిల్లీ, పూరి, వారణాసి తదితర ప్రదేశాలతో పాటు విదేశీ పర్యాటక కేంద్రాల్లోనూ బస బుక్‌ చేసుకోవచ్చు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.