close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అడవి దాగిన అందాలు

ఎకో వైపు
అడవి దాగిన అందాలు

సంక్రాంతి సెలవులను భిన్నంగా ఆస్వాదించాలనుకునే వారికి అడవి దాగిన అందాలు ఆహ్వానిస్తున్నాయి. ఇక్కడ సరస్సులో బోటు షికారు చేయవచ్చు, గుట్టలెక్కవచ్చు, ప్రకృతి ఒడిలో సేదతీరవచ్చు. తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఎకో టూరిజానికి కొత్త విడిదిగా మారింది.

ఒకప్పుడు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అలరించిన లక్నవరం సరస్సు, ఏటూరునాగారం అభయారణ్యం, పాండవుల గుట్ట.. ఇప్పుడు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో భాగమయ్యాయి. వీటికి ప్రాచుర్యం కల్పించడం కోసం అటవీశాఖ గతేడాది ఎకో టూరిజం క్యాలెండర్‌ను రూపొందించింది. సంక్రాంతి సెలవుల్లో వన విహారానికి అటవీ శాఖ వివిధ ప్యాకేజీలను ప్రకటించింది. ‘లక్నవరం ఫెస్ట్‌’ను జనవరి 13, 14వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా లక్నవరం సరస్సు చుట్టూ సైక్లింగ్‌, గుడారాల్లో బస, సరస్సులో బోటు షికారు, ట్రెక్కింగ్‌, ఐలాండ్‌ విజిట్‌, లేక్‌వ్యూ సఫారీ ఉంటుంది. పర్యటనలో ఎడ్లబండ్లపై విహారం ఉంది. భోజన వసతి కూడా కల్పిస్తారు. ‘లక్నవరం ఫెస్ట్‌’ ప్యాకేజీ ధర రూ.1,500 ఒక్కొక్కరికి.

గుట్టలెక్కేద్దాం: రేగొండ మండలం పాండవుల గుట్ట రాక్‌ క్లైంబింగ్‌కు ప్రసిద్ధి. జనవరి 14, 21, 28వ తేదీల్లో ఇక్కడ రాక్‌క్లైంబింగ్‌ నిర్వహించనున్నారు. నిపుణుల సమక్షంలో తాళ్ల సాయంతో గుట్టను అధిరోహించాల్సి ఉంటుంది. టికెట్‌ ధర రూ.400.

అరణ్యంలో హాయిగా: ఏటూరు నాగారం అభయారణ్యంలోని తాడ్వాయి దగ్గర పర్యాటకులు బస చేయడానికి ఆరు కుటీరాలు ఏర్పాటుచేశారు. కుటీరం అద్దె ఒక్క రాత్రికి రూ.1,000. ఉదయాన్నే అడవిలో సైక్లింగ్‌ ఉంటుంది. బ్లాక్‌బెర్రీ ఐలాండ్‌ సందర్శనతో పాటు, కొండేటి వ్యూ పాయింట్‌ నుంచి బర్డ్‌వాచింగ్‌ అవకాశం ఉంది. వనకుటీరాల వద్ద గిరిజన మ్యూజియం సందర్శించవచ్చు. వీటితోపాటు పరిసరాల్లో హేమాచల లక్ష్మీనరసింహస్వామి, మేడారం సమ్మక్కసారలమ్మ, రామప్ప దేవాలయాలను చూడొచ్చు. మరిన్ని వివరాలకు 7382619363 ఫోన్‌నెంబర్‌ను సంప్రదించవచ్చు.

వనవిహారం చేయాలంటే ముందుగా వరంగల్‌ చేరుకోవాలి. అక్కడి నుంచి లక్నవరం, ఏటూరు నాగారం, తాడ్వాయ్‌ చేరుకోవచ్చు. బస్సులు అందుబాటులో ఉంటాయి.

- పాండురంగశర్మ, ఈనాడు, వరంగల్‌


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.