close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
2017లో అ‘ధర’గొట్టిన కార్లు!

2017లో అ‘ధర’గొట్టిన కార్లు!

  కారంటే ఇప్పటికీ మనదేశంలో విలాసమే. నాలుగు లక్షల రూపాయల కారు కొనుక్కోవాలన్నదీ చాలామందికి పెద్ద కలే. ఇది నాణానికి ఓ వైపు. మరోవైపూ ఒక్క కారు కోసం కోట్లు ఖర్చుపెట్టేవారున్నారు.ఫోర్బ్స్‌ లిస్టు ప్రకారం  2017లో ప్రపంచ మార్కెట్లోకి విడుదలైన
అత్యంత ఖరీదైన తొలి అయిదు కార్లు ఇవే.

ఆస్టన్‌ మార్టిన్‌ వాకైర్‌... రూ.25 కోట్లు

ఆస్టన్‌ మార్టిన్‌, రెడ్‌బుల్‌ రేసింగ్‌ కంపెనీలు కలిసి రూపొందించిన హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ కారు ఇది. తేలికపాటి కార్బన్‌ ఫైబర్‌తో తయారై వీ12 ఇంజిన్‌, హార్స్‌పవర్‌ 1130... కలిగిన ఇది ప్రపంచంలోనే వేగంగా వెళ్లే కార్లలో ఒకటి. ఈ మోడల్‌లో కేవలం 99 నుంచి 150 కార్లను మాత్రమే తయారుచేశారు. 2.5సెకన్లలో గంటకు 60కిలోమీటర్ల వేగాన్ని చేరుకునే ఆస్టన్‌ మార్టిన్‌ని 2018 కారు అని కూడా అంటున్నారు.

లైకన్‌ హైపర్‌స్పోర్ట్‌... రూ.22కోట్లు

లెబనీస్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందిన ఈ సూపర్‌కార్‌ని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని డబ్ల్యూ మోటార్స్‌ కంపెనీ రూపొందిస్తోంది. అందుకే, దీన్ని ‘ఫస్ట్‌ అరబ్‌ సూపర్‌ కార్‌’గా పిలుస్తున్నారు. హార్స్‌పవర్‌ 780 కలిగిన ఈ కార్లు వేగంగా దూసుకుపోవడమే కాదు, చూడ్డానికీ చాలా స్టైలిష్‌గా ఉంటాయి. ఇక, ఈ కారు హెడ్‌లైట్‌లను చూస్తే ఎవరైనా కళ్లప్పగించాల్సిందేనట. ఎందుకంటే ఆ ఎల్‌ఈడీ బ్లేడుల్ని టైటానియంతో రూపొందించి లోపల 220 వజ్రాలను పొదుగుతారు. ‘వజ్రాలు వద్దు’ అనే వినియోగదారులకు వారు కోరిన రత్నాలను అమర్చి ఇస్తారు.

పగాని హ్వయ్‌రా బీసీ... రూ.18కోట్లు

మెర్సిడెజ్‌కి చెందిన ట్విన్‌ టర్బో వీ12 ఇంజిన్‌తో పాటు, 750 హార్స్‌పవర్‌ కలిగిన హ్వయ్‌రా బీసీ ఇప్పటివరకూ పగానీ కంపెనీ రూపొందించిన కార్లన్నిటికంటే తేలికైందీ ఎక్కువ సామర్థ్యం కలిగిందీ. ఆ కంపెనీ మొదటి వినియోగదారుడూ పగానీ ఏ మోడల్‌ కారుని విడుదలచేసినా సేకరించే అలవాటున్న ‘బెన్నీ కయోలా(బీసీ)’ పేరుమీద హ్వయ్‌రా బీసీని విడుదలచేసింది పగానీ.

బుగాటి షిరాన్‌... రూ.17.3 కోట్లు

డబ్ల్యూ16 ఇంజిన్‌, 1478 హర్స్‌పవర్‌... కలిగిన షిరాన్‌ కేవలం 2.5సెకన్లలో గంటకు వంద కిలోమీటర్ల వేగానికి పుంజుకోగలదట. ఈ మోడల్‌ కార్ల గరిష్ఠవేగ పరిమితి గంటకు 420 కిలోమీటర్లు. అందుకే, అయిదొందల కార్లను తయారుచేస్తే అంత ఖరీదున్నా కొద్దిరోజుల్లోనే మూడొందల కార్లు అమ్ముడుపోయాయి.

కొయినిగ్‌సెగ్‌ రెగెరా... రూ.12 కోట్లు

డైరెక్ట్‌ డ్రైవ్‌ టెక్నాలజీతో వచ్చిన ఈ కారులో మిగిలిన వాటిలోలా గేర్‌బాక్స్‌ ఉండదు. దాంతో కారు తేలిగ్గా ఉంటుందట. 3.2సెకన్లలో గంటకు 150 నుంచి 250కిలోమీటర్ల వేగానికి చేరుకోగలిగే ఇంజిన్‌ సామర్థ్యం దీని సొంతం. ట్విన్‌ టర్బో వీ8 గాసోలిన్‌ ఇంజిన్‌, హార్స్‌పవర్‌ 1822... కలిగిన ఈ మోడల్‌ కార్లను 80 మాత్రమే తయారుచేశారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.