close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ ఏడాది గడిచిందిలా...


ప్రపంచంలో మొదటిసారిగా ఓ రోబోకి సౌదీ అరేబియా పౌరసత్వం ఇచ్చింది. మనిషిని పోలిన ఆ రోబో పేరు సోఫియా. ఎలాంటి ప్రశ్నలు వేసినా జవాబిచ్చే సోఫియాకి అక్టోబరులో పౌరసత్వం వచ్చింది.
* ట్విటర్‌ ఆరంభం(2006) నుంచీ 140 అక్షరాల్లోనే ట్వీట్లు చేయాలనేది నియమం. దాంతో కొన్నిసార్లు భావప్రకటనకు అడ్డంకిగా ఉంటుందన్న అభిప్రాయం రావడంతో నవంబరు నుంచి ట్వీట్‌లో అక్షరాల పరిమితిని 280కి పెంచారు.
* youthquake 2017కి గానూ ‘వర్డ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ ప్రకటించిన పదం.
* యూట్యూబ్‌ ఆధిపత్యానికి చెక్‌ చెప్పే లక్ష్యంతో ఫేస్‌బుక్‌ ‘వాచ్‌’ ఆప్‌ని తెచ్చింది. దీనికి సంబంధించిన ట్రయల్‌ వెర్షన్‌ని అమెరికాలో విడుదల చేసింది.
* 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆ ఏడాది కొత్త రూ.500,రూ.2000 నోట్లు రాగా, ఈ ఆగస్టులో కొత్త రూ.200, రూ.50 నోట్లు వచ్చాయి.
* ‘ఒక దేశం ఒకటే పన్ను’... నినాదంతో జీఎస్టీని కేంద్రం ఈ ఏడాది జులై నుంచి ప్రవేశపెట్టింది. పన్నుల విధానంలో ఇది ఓ పెను మార్పు.
* 2017 జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ప్రమాణ స్వీకరణ చేశారు.
* 92 ఏళ్లుగా వేరుగా ప్రకటిస్తూ వచ్చిన రైల్వే బడ్జెట్‌ని ఈ ఏడాది సాధారణ బడ్జెట్‌తో కలిపే ప్రకటించడం విశేషం.
* వీఐపీ సంస్కృతికి చిహ్నంగా కార్లపైన ఉండే ఎరుపూ, నీలం రంగు బుగ్గల్ని కేంద్రం నిషేధించింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి... ఇలా అందరి కార్లపైనుంచీ ఆ బుగ్గల్ని తొలగించారు. మే 1నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
* కోటి రూపాయలు గెల్చుకోవడమంటే, ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమమే గుర్తొస్తుంది. కానీ, డిజిటల్‌ చెల్లింపుల్ని ప్రోత్సహించడానికి కేంద్రం ప్రకటించిన ‘లక్కీ గ్రాహక్‌ యోజన’ పథకంలో రూపే కార్డుతో ఫోన్‌ బిల్లు కట్టి మహారాష్ట్రకు చెందిన శ్రద్ధా మోహన్‌ రూ.కోటి గెల్చుకుంది.
* భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత విలాసవంతమైన రైలు ‘తేజస్‌’ని మేలో తీసుకొచ్చారు. ముంబయి-గోవాల మధ్య తిరిగే ఈ రైల్లో ఆటోమేటెడ్‌ డోర్లు, ఎల్‌సీడీ తెరలు, వైఫై లాంటి సదుపాయాలున్నాయి.
* దేశ 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ జులైలో బాధ్యతలు చేపట్టారు.
* ఆత్మహత్య ఆఖరి అంకంగా సాగే బ్లూవేల్‌ గేమ్‌ లింకులను తొలగించాలని ఇంటర్నెట్‌ సేవలు అందించే సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో ఆదేశించింది. ఈ ఆన్‌లైన్‌ గేమ్‌ కారణంగా కొందరు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
* తెలుగు బిడ్డ ముప్పవరపు వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఆగస్టులో ప్రమాణ స్వీకారం చేశారు.
* అమెజాన్‌ వ్యవస్థాపకుడైన జెఫ్‌ బెజోస్‌... మొదటిసారి బిల్‌గేట్స్‌ని అధిగమించి ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా రికార్డు సాధించాడు. ప్రస్తుతం జెఫ్‌ సంపద విలువ సుమారు రూ.6.5 లక్షల కోట్లు.
* ఫిబ్రవరిలో ఒకే రాకెట్‌మీద 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి ఇస్రో రికార్డు సృష్టించింది.
* ఈ ఏడాది గూగుల్‌ టాప్‌-10 సెర్చ్‌ అంశాల్లో డిజిటల్‌ కరెన్సీ ‘బిట్‌కాయిన్‌’ ఒకటి. జనవరిలో ఒక బిట్‌కాయిన్‌ విలువ వెయ్యి డాలర్లు(రూ.65వేలు) కాగా, డిసెంబరు నాటికి అది 17వేల డాలర్లు(రూ.11 లక్షలు).
* పదిహేడేళ్ల తర్వాత మనదేశానికి చెందిన మానుషి చిల్లర్‌ ‘ప్రపంచ సుందరి’ కిరీటాన్ని అందుకుంది.
* తెలుగు, ఉర్దూ, తమిళం, హిందీ, గుజరాతీ మొదలైన భారతీయ భాషలకు చెందిన 70 వరకూ (దాదాగిరీ, బాపు, అన్న, అబ్బ, మిర్చిమసాలా, కీమా... మొదలైన) పదాల్ని ఈ ఏడాది ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో చేర్చారు.
* సచిన్‌ తెందూల్కర్‌ ధరించిన పదో నంబరు జెర్సీకి అనధికారికంగా వీడ్కోలు చెబుతున్నట్టు  బీసీసీఐ ఈ నవంబరులో ప్రకటించింది.
* నవంబరులో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు హైదరాబాద్‌లో జరిగింది.
* ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘హైదరాబాద్‌ మైట్రో రైలు’ నవంబరు 28న పరుగు మొదలుపెట్టింది.
* డిసెంబరులో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ బాధ్యతలు చేపట్టారు.
* ‘ప్రపంచ తెలుగు మహాసభలు’ ఈ ఏడాది డిసెంబరు 15-19 మధ్య హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.