close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ వేజ్‌లో పూలు వాడిపోవు

ఈ వేజ్‌లో పూలు వాడిపోవు

పువ్వులు ఎంత అందంగా ఉంటాయో... కానీ ఫ్లవర్‌వేజ్‌లో పెట్టి చూసుకుందాం అంటే ఒకటీ రెండు రోజులకే వాడిపోతాయి. అయితే, ఈ ‘కుల్‌వేజ్‌ లైఫ్‌ ఎక్స్‌టెండింగ్‌ ఫ్లవర్‌ వేజ్‌’ మాత్రం దాన్లో ఉంచిన పువ్వుల్ని మూడు వారాల వరకూ తాజాగా ఉంచుతుందట. రీఛార్జబుల్‌బ్యాటరీలతో పనిచేసే ఈ పూలకుండీ లోపల నీటిని ఎప్పుడూ చల్లగా ఉంచి సూక్ష్మ జీవులు పెరగకుండా చేసే థెర్మల్‌ కండక్టర్‌ ఉంటుంది. దానివల్ల రోజూ నీళ్లు మార్చకపోయినా దీన్లోని పువ్వులు ఎక్కువకాలం తాజాగా ఉంటాయి. మీకూ కావాలంటే hammacher.com వెబ్‌సైట్‌లో తెప్పించుకోవచ్చు. 


ఇవి... హైటెక్‌ దువ్వెనలు!

టెక్నాలజీ ఎంతగా పెరిగిపోయిందంటే... ఇప్పుడు దువ్వెనలే ఉంగరాల జుట్టుని సాపుగా చెయ్యడం, చుండ్రుని తొలగించడం లాంటి పనులు కూడా చేసేస్తున్నాయి. ఇక్కడున్న దువ్వెనలు అలాంటివే. మామూలుగా ఇంట్లో హెయిర్‌ స్ట్రెయిట్‌నర్‌తో జుట్టుని సాపుగా చేసుకోవడం అందరికీ కుదరదు. కానీ ఈ ‘హెయిర్‌ స్ట్రెయిట్‌నింగ్‌’ దువ్వెన ఉంటే ఆ పనిని తల దువ్వుకున్నంత సులభంగా చేసుకోవచ్చు. కరెంటుతో పనిచేసే ఈ బ్రష్‌ని బటన్లద్వారా కావల్సినంత వేడి చేసుకోవచ్చు. ఆ వేడితో దీనికున్న సిరామిక్‌ కుదుళ్లు ఉంగరాల జుట్టుని సాపుగా మెరిసేలా చేస్తాయి. ఇక చుండ్రు సమస్యకోసం వచ్చిందే ‘యాంటీ డాండ్రఫ్‌ హెయిర్‌ కోంబ్‌’. ఈ దువ్వెనలో ఉండే లైట్లు విడుదల చేసే లేజర్‌ కిరణాలు జుట్టు కుదుళ్లలో ఉండే చుండ్రుకు కారణమైన మృతకణాలను తొలగించి, సమస్యను దూరం చేస్తాయి. 


కాలు కింద పెడితే వెలిగినట్లే

రాత్రిపూట పడకగదిలో బెడ్‌లైట్‌ ఉన్నా చాలామందికి నిద్ర పట్టదు. కానీ ఏ అర్ధరాత్రో లేవాల్సొస్తే వెలుగు లేకపోతే ఇబ్బంది. ఎలాగోలా వెతుక్కుని ఏదో స్విచ్‌ నొక్కితే ఒక్కసారిగా కళ్లమీద పడే ఆ కాంతికి పక్కన పడుకున్నవారికి నిద్రాభంగం. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చిందే ‘మై లైట్‌.మి’. సెన్సర్ల ద్వారా పనిచేసే ఈ లైటును మంచం కిందిభాగంలో అమర్చి, ప్లగ్‌ను దగ్గర్లో ఉన్న బోర్డులో గుచ్చితే చాలు. మనం రాత్రిపూట మంచం మీది నుంచి అడుగు కింద పెట్టగానే గుర్తించి లైట్‌ వెలుగుతుంది. మంచం అడుగుభాగంలో ఉంటుంది కాబట్టి, పైనున్నవారికి ఆ వెలుగు ఇబ్బంది కలిగించదు. చీకటిగా ఉన్నప్పుడు మాత్రమే సెన్సర్లతో వెలిగే ఈ లైటుని ముప్ఫై సెకెన్ల నుంచి పది నిమిషాల్లోపు ఎంతసేపు వెలిగి ఆరిపోవచ్చన్నది మనమే సెట్‌ చేసుకోవచ్చు. పిల్లలు అర్ధరాత్రి లేచినపుడు చీకటిగా ఉంటే భయపడతారు. అందుకే, ఇవి వారి గదుల్లో పెట్టేందుకూ బాగుంటాయి. 


రూబిక్స్‌ క్యూబ్‌ మన ఫొటోలతో!

ష్టమైనవారి ఫొటోను ఎన్నిసార్లు చూసినా సంతోషమే. ఇకపోతే, రూబిక్స్‌ క్యూబ్‌లో వేరు వేరు రంగులుంటాయనీ ఒక్కో రంగునీ ఒక్కోవైపుకి తెస్తే ఆట పూర్తవుతుందనీ తెలిసిందే. ఈ రెండింటికీ సంబంధం ఏంటంటారా... ఇప్పుడు రూబిక్స్‌ క్యూబ్‌ల మీద రంగులు పోయి మనకు నచ్చినవారి ఫొటోలు చేరుతున్నాయి. అవును, పర్సనలైజ్‌డ్‌ బహుమతుల్ని అందించే ఆన్‌లైన్‌ సైట్లతో పాటు అమెజాన్‌లాంటి వెబ్‌సైట్లూ ఫొటోలతో రూబిక్స్‌ క్యూబ్‌లను తయారు చేసిస్తున్నాయి. కుటుంబసభ్యులూ సన్నిహితుల ఫొటోలను అప్‌లోడ్‌ చేసి, ఆర్డరిస్తే వాటిని రూబిక్స్‌ మీద ప్రింట్‌ చేసిస్తాయి ఈ సైట్లు. వీటిలో ఒక పెద్ద ఫొటోని ఒకవైపున ఉన్న అన్ని రూబిక్స్‌ మీదా కనిపించేలా కానీ ఒకేలా ఉన్న తొమ్మిది ఫొటోలను ఒకవైపున ఉన్న తొమ్మిది రూబిక్స్‌ మీదా ఒక్కోటిగా గానీ ప్రింట్‌ చేయించుకోవచ్చు. ఇవి బహుమతులుగా ఇవ్వడానికీ బాగుంటాయి. 


సూప్‌ చిటికెలో...

ల్లటి వాతావరణంలో వేడి వేడిగా సూప్‌ తాగాలనిపిస్తుంది. వర్షాకాలంలో నిజానికి అలాంటి ఆహారమే మంచిది. కానీ అదేమీ చిన్న పని కాదు. కూరగాయల ముక్కల్ని కొయ్యాలీ మిక్సీలో వెయ్యాలి, మళ్లీ దాన్ని వేరే గిన్నెలో పోసి కాయాలి. ఇదంతా లేకుండా... కావాల్సిన కూరగాయల్ని మిక్సీ జార్‌లో వేసి బటన్‌ నొక్కితే ఓ పావుగంటలో సూప్‌ రెడీ అయిపోతే భలే ఉంటుంది కదా... నిజంగానే అలాంటి ఎలక్ట్రిక్‌ సూప్‌ మేకర్లు వచ్చేశాయి. మిక్సీ జార్‌లా ఉండే వీటిలో కూరగాయలూ దినుసులూ నీళ్లూ వేసి, సూప్‌ బాగా మెత్తగా కావాలా, కొంచెం ముక్కలుగా కావాలో తెలిపే బటన్లు నొక్కితే చాలు. అదే కూరగాయల్ని ముక్కలుగా కోసుకుని, తర్వాత మెత్తటి పేస్ట్‌లా చేసి, ఉడికించేస్తుంది. అయిపోయాక బీప్‌ శబ్దం రాగానే మనం తీసుకుని తాగెయ్యడమే. 


పరుగూ ఈతా ఒకేసారి

రువుని తగ్గించుకుని శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ట్రెడ్‌మిల్‌ పైనైనా మామూలుగా అయినా నడక, పరుగు మంచి వ్యాయామాలు. అయితే, కాళ్ల మీద ఎక్కువ బరువుపడే అలాంటి వ్యాయామాలను కీళ్ల నొప్పులున్నవారిని చెయ్యొద్దంటారు వైద్యులు. అలాంటివారికోసం జపాన్‌కు చెందిన వాటర్‌ వాకర్‌ స్పా రూపొందించిందే ఈ ‘ఆక్వాట్రెడ్‌మిల్‌’. పెద్ద నీటితొట్టెలా ఉండే దీని అడుగుభాగంలో ట్రెడ్‌మిల్‌ ఉంటుంది. నీటిలో మన బరువు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ ట్రెడ్‌మిల్‌పైన పరుగు కీళ్లమీద ఒత్తిడి పెంచకపోగా నొప్పుల్ని కూడా తగ్గిస్తుందట. నీటిలో వ్యాయమం మెదడుకూ మంచిదే. ఇది ఈత వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలనూ ఇస్తుందట. 


కళ్లు మోసం చేస్తాయి!

కుర్చీలూ మంచాల్లో చాలా వెరైటీలు వచ్చాయి. అయితే చూడగానే అవాక్కయ్యేలా రూపొందించినవే ఈ ‘ఇన్విజిబుల్‌ ఆక్రిలిక్‌ ఫర్నిచర్‌’. ఆక్రిలిక్‌ అద్దంలా పారదర్శకంగా ఉంటుంది. చెక్కేమో ఎంత దూరంలో ఉన్నా కనిపిస్తుంది. అందుకే, ఆ రెండిటినీ కలిపి ఫర్నిచర్‌ని తయారుచేస్తే దూరం నుంచి చూసేవారికి చెక్కతో చేసింది మాత్రమే కనిపించి ఆక్రిలిక్‌తో చేసిన భాగంలో ఏమీ లేనట్లుంటుంది.దాంతో అవి గాల్లో తేలుతున్నట్లూ సగమే ఉన్నట్లూ అనిపిస్తూ చూసినవారిని ఆశ్చర్యంలో పడేస్తాయి. ఈ ఆలోచనతోనే జపనీస్‌ డిజైనర్‌ నెన్డో, బ్రెజిల్‌ డిజైనర్‌ టటియానే చెక్కనూ ఆక్రిలిక్‌నూ కలిపి ఫర్నిచర్‌ను రూపొందిస్తున్నారు. వీటిలో పూర్తిగా ఆక్రిలిక్‌తో చేసి వాటికి మూడొంతుల వరకూ చెక్క రంగు వేసినవీ వస్తున్నాయి. ఇందులో రంగు వెయ్యకుండా వదిలేసిన భాగం పారదర్శకంగా ఉంటుందన్నమాట. కొత్తగా ఉన్నాయి కదూ...

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.