Weekly Horoscope: రాశిఫలం (జులై 18 - 24) - Sunday Magazine
close

Weekly Horoscope: రాశిఫలం (జులై 18 - 24)


అభీష్టసిద్ధి ఉంటుంది. శుభప్రదమైన కాలం. గౌరవం పెరుగుతుంది. సుఖసంతోషాలుంటాయి. ఉద్యోగంలో కలిసివస్తుంది. అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రచించండి. వ్యాపారంలో జాగ్రత్త. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు ఉత్తమ భవిష్యత్తునిస్తాయి. నిరంతర శ్రమ విజయాన్ని ఇస్తుంది. ధనయోగం సంపూర్ణం. శివారాధన శక్తినిస్తుంది.


ఇష్టకార్యాల్లో విశేషమైన ప్రగతిని సాధించే కాలమిది. ఎటుచూసినా లాభమే గోచరిస్తోంది. మనసులోని కోరిక తీరుతుంది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పని ఇప్పుడు పూర్తవుతుంది. ఉద్యోగంలో స్థిరమైన ఫలితాలు ఉంటాయి. అనుకున్న స్థాయికి చేరతారు. కుటుంబంలో శాంతి లభిస్తుంది. మహావిష్ణువును స్మరించండి, ఆరోగ్యం సహకరిస్తుంది.


మంచి విజయాన్ని అందుకుంటారు. సొంత నిర్ణయం వద్దు. ప్రతిదీ కుటుంబసభ్యులతో చర్చించండి. పనుల్లో జాప్యం జరుగుతుంది. ఉద్యోగ అభివృద్ధి విశేషంగా ఉంటుంది. వ్యాపారంలో అజాగ్రత్త వల్ల సమస్య వస్తుంది. బంధుమిత్రుల సూచనలు అవసరం. ఆవేశపరిచే సన్నివేశాలకు దూరంగా ఉండాలి. సూర్యారాధన ఉత్తమం.


అదృష్టయోగముంది. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. సంపద పెరుగుతుంది. గృహ వాహనాది యోగాలున్నాయి. పనుల్లో స్పష్టత ఉండాలి. అపార్థాలకు తావివ్వకూడదు. ఓర్పుతో పనులు పూర్తిచేయండి. ధైర్యంగా ముందుకెళ్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కొందరివల్ల పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆంజనేయస్వామిని ధ్యానిస్తే మేలు.


అద్భుతమైన ఫలితాలుంటాయి. ఎటుచూసినా విజయమే గోచరిస్తోంది. ధనధాన్య లాభాలు ఉంటాయి. వెతుకుతున్నది దొరుకుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ధర్మమార్గంలో పైకి వస్తారు. లక్ష్యాలను సాధిస్తారు. వారం మధ్యలో ఒక మంచి వార్త వింటారు. ఉన్నతమైన ఫలితం కోసం ఇష్టదైవాన్ని స్మరించండి.


ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. మొదలు పెట్టిన పనులు త్వరగా పూర్తి అవుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. దైవబలం విశేషంగా ఉంది. ఈ సమయంలో చేసే పనులు సంతృప్తికర జీవితాన్నిస్తాయి. మేలు చేసేవారున్నారు. సత్యం, ధర్మం రెండూ మిమ్మల్ని సదా కాపాడుతున్నాయి. వేంకటేశ్వరస్వామిని ప్రార్థించండి, మనశ్శాంతి లభిస్తుంది.


శ్రేష్ఠమైన ఫలితముంది. విజయాలు వాటంతటవే వస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ ఫలిస్తుంది. నూతన ప్రయత్నాలు మొదలుపెట్టండి. సమాజానికి అవసరమైన పనులు చేసి విశేషమైన అభివృద్ధిని పొందుతారు. భూ-గృహ ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తాయి. సన్మార్గంలో వృద్ధిని సాధిస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. లక్ష్మీస్తుతి మంచిది.


దృఢ సంకల్పంతో లక్ష్యాన్ని చేరుకోవాలి. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. సహనానికి పరీక్షా కాలంగా అనిపిస్తుంది. అధికారుల ప్రోత్సాహం శక్తినిస్తుంది. సమాజంలో గుర్తింపును పొందుతారు. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. వారం మధ్యలో సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నవగ్రహ స్తోత్రం పఠించండి, మనోబలం లభిస్తుంది.


చాలా మంచి కాలమిది. ధైర్యంగా పనులు మొదలుపెట్టండి. కోరుకున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. ఉత్తమ కార్యసిద్ధీ ధనలాభం ఉంటాయి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అధికారులతో సౌమ్యంగా వ్యవహరించండి. సంఘర్షణలు తొలగుతాయి. తొందరపడకుండా విసుగు చెందకుండా కృషిచేయాలి. ఇష్టదేవతాస్మరణ మంచిది.


అన్నివిధాలా మంచికాలం. వ్యాపారంలో ఉత్తమ ఫలితాలుంటాయి. ఆర్థికంగా మేలు జరుగుతుంది.  ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. వారం మధ్యలో ఒక మంచి పనిచేసి ప్రశంసలు పొందుతారు. నూతన ప్రయత్నాల ద్వారా గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మేలు చేసేవారున్నారు. ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టాలి. సూర్యనారాయణమూర్తిని స్మరిస్తే మేలు.


ఉద్యోగంలో కలిసివస్తుంది. నమ్మకంతో పనులు మొదలుపెట్టండి. మనసులో అనుకున్నదే చేయండి. మధ్యలో చంచలత్వం ఆవహిస్తుంది. కుటుంబసభ్యుల సూచనలతో లక్ష్యాన్ని చేరవచ్చు. నిర్ణయాలను ఒకసారి పునఃసమీక్షించుకోండి. బంగారు జీవితం లభించే సూచనలున్నాయి. వ్యాపారంలో శ్రమ ఉన్నా తొందర పడవద్దు. శివారాధనతో కార్యసిద్ధి లభిస్తుంది.


బుద్ధిబలంతో అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు. అభీష్టసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. దృఢ సంకల్పంతో ఒక మెట్టు పైకి ఎక్కుతారు. మంచి భావనతో చేసే మీ ప్రయత్నం ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. వ్యాపార లాభాలుంటాయి. బంధుమిత్రుల సహకారం అవసరం. సరైన నిర్ణయం సంతృప్తినిస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న