Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (జూన్‌ 20 - 26) - Sunday Magazine
close

Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (జూన్‌ 20 - 26)

గ్రహబలం

డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి

శుభకాలం నడుస్తోంది. ఇప్పుడు చేసే పనులు గొప్పఫలితాన్నిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి జరుగుతుంది. ఎటుచూసినా అదృష్టమే గోచరిస్తోంది. అనుకున్నది సాధిస్తారు. సొంత నిర్ణయం శక్తినిస్తుంది. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఖర్చు పెరిగినా ఆర్థికంగా బాగుంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. లక్ష్మీధ్యానం శుభప్రదం.


ముఖ్యకార్యాల్లో శీఘ్రవిజయం ఉంటుంది. బుద్ధిబలంతో అనుకున్నది సాధిస్తారు. గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. తగినంత మానవ ప్రయత్నం అవసరం. ఎదురుచూస్తున్న పనులు కొన్ని సఫలమవుతాయి. దేనికీ వెనకాడవద్దు. తోటివారి సలహాలు పనిచేస్తాయి. జీవితంలో ఎదుగుదలకు ప్రణాళికలు వేసుకునే సమయమిది. శివధ్యానం మంచిది.


లక్ష్మీకటాక్ష సిద్ధి కలుగుతుంది. అదృష్టవంతులవుతారు. శ్రేష్ఠమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో ఉత్తమస్థితి గోచరిస్తోంది. అద్భుతాలు సృష్టిస్తారు. మిత్రుల సహకారం అవసరం. వారం మధ్యలో ఒక మంచిపని చేస్తారు. పనులు త్వరగా పూర్తవుతాయి. వ్యాపారంలో లాభం వస్తుంది. నృసింహస్వామిని ప్రార్థించండి, కార్యసిద్ధి ఉంటుంది.


మనోబలంతో లక్ష్యం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో ఆందోళన కలిగించే పరిస్థితులున్నాయి. తొందర పనికిరాదు. వృథా ప్రయాస ఉంటుంది. విఘ్నాలు ఎదురైనా బుద్ధిబలంతో అనుకున్నది సాధిస్తారు. పట్టుదల ముందుకు నడిపిస్తుంది. మిత్రుల ద్వారా ఒక మంచి జరుగుతుంది. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ఇష్టదైవాన్ని సందర్శిస్తే మంచిది.


అద్భుతమైన శుభకాలం. అనుకున్న పనులు సకాలంలో అవుతాయి. ఆనందించే అంశముంది. ముఖ్యవ్యక్తులకు మీద్వారా మంచి జరుగుతుంది. ఇంటాబయటా అనుకూల ఫలితాలుంటాయి. గృహవాహనాది యోగాలు అనుకూలిస్తాయి. నూతన ప్రయత్నాల్లో విజయముంటుంది. అదృష్టవంతులవుతారు. లక్ష్మీదేవిని ధ్యానించండి, మంచి జీవితం లభిస్తుంది.


ఉద్యోగఫలాలు అద్భుతంగా ఉంటాయి. ప్రణాళిక ప్రకారం పనిచేస్తే ఉన్నతస్థితి లభిస్తుంది. వ్యాపారంలో కలిసివస్తుంది. మనసులో అనుకున్నది కార్యరూపం దాలుస్తుంది. ఆర్థికస్థితిగతులు మెరుగవుతాయి. వెతకబోయిన తీగ కాలికి తగులుతుంది. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. విష్ణుదర్శనం మేలుచేస్తుంది.


ఆర్థికాంశాలు శుభప్రదం. ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగపరంగా ఉన్నతస్థితి కలుగుతుంది. ధర్మబద్ధంగా నిర్ణయం తీసుకుని, కార్యాచరణను రూపొందించండి. అవసరమైన సహకారం అందుతుంది. పెద్దల ఆశీర్వచనం లభిస్తుంది. సమాజంలో గుర్తింపు ఉంటుంది. వ్యాపారరీత్యా కొంత అనుకూలం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి, స్థిరత్వం వస్తుంది.


శుభాలు జరుగుతాయి. ప్రయత్నాలు కార్య రూపాన్ని దాలుస్తాయి. మనోబలం అవసరం. అధికారులతో సౌమ్యంగా వ్యవహరించండి. స్పష్టమైన ప్రణాళికలతో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో తగినంత గుర్తింపు ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబపరంగా మేలు చేకూరుతుంది. ఇష్టదైవాన్ని స్తుతించండి, శుభవార్త వింటారు.


విజయం చేరువలోనే ఉంది. బలమైన ప్రయత్నం చేయాలి. లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని పని ప్రారంభిస్తే అద్భుతమైన విజయం లభిస్తుంది. ఉద్యోగపరంగా కోరుకున్న ఫలితం లభిస్తుంది. వ్యాపారబలం ఉంది. వస్తుప్రాప్తి, వాహనయోగాలు ఉన్నాయి. మొహమాటంవల్ల శ్రమ పెరుగుతుంది. కుటుంబసభ్యుల సహకారం తీసుకోవాలి. సూర్యస్తుతి ఉత్తమం.


ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. మనసులోని సంకల్పం నెరవేరుతుంది. ఎదరుచూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తి అవుతుంది. క్రమంగా అవరోధాలు తొలగుతాయి. ఏకాగ్రతకు భంగం కలిగించేవారున్నారు. ఓర్పుతో లక్ష్యాన్ని చేరాలి. సహనానికి పరీక్షాకాలంగా అనిపిస్తుంది. ఖర్చు పెరగకుండా చూసుకోవాలి. దుర్గాదేవిని స్మరించండి, శుభపరిణామాలుంటాయి.


వ్యాపారబలం అద్భుతంగా ఉంది. కోరుకున్న విధంగానే ఫలితాలు సిద్ధిస్తాయి. ధైర్యం ముందుకు నడిపిస్తుంది. కాలం మిశ్రమంగా ఉంది. అవసరాలకు తగ్గట్టు కార్యాచరణను రూపొందించాలి. అపార్థాలకు అవకాశముంది. ఆచితూచి సంభాషించండి. ధర్మమార్గంలో ఫలితాలు రాబట్టాలి. సమయ స్ఫూర్తితో ఉద్యోగంలో విజయం సాధిస్తారు. విష్ణుస్మరణ మంచిది.


ఉత్తమకాలం నడుస్తోంది. బాధ్యతలకు తగ్గట్టుగా కార్యాచరణ ఉండేటట్టు చూసుకోవాలి. ఉద్యోగంలో అధికారలాభముంటుంది. సంతోషించే వార్తలు వింటారు. ఆనందప్రదంగా కాలం ముందుకు సాగుతుంది. వ్యాపారంలో ధనలాభముంటుంది. గృహ, వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. ఇష్టకార్యసిద్ధి ఉంది. శివస్మరణ మనశ్శాంతినిస్తుంది.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న