సిల్లీ పాయింట్‌ - Sunday Magazine
close

సిల్లీ పాయింట్‌

భూమ్మీద ఉన్న మొత్తం చీమల బరువు మనుషుల బరువు మొత్తానికి సమానం.

* ‘సిల్లీ’... అన్న ఇంగ్లిషు పదాన్ని ఒకప్పుడు ‘గొప్ప అదృష్టం’ అన్న అర్థంలో వాడేవారు.

* ప్రపంచంలోనే అతిపెద్ద జంతువైన నీలి తిమింగలం గుండె అయిదడుగుల పొడవుతో దాదాపు 200కిలోల బరువుంటుంది.

* ఐస్‌క్రీమ్‌ ప్లాస్టిక్‌... రెండింటికీ దగ్గర సంబంధం ఉంది. వాటిని మొట్టమొదట కర్పూరం సాయంతోనే తయారుచేశారట!

* పులులు మిమిక్రీ కూడా చేయగలవు! తాను వేటాడే జంతువులాగే అరిచి... తన దగ్గరకి రప్పిస్తాయవి.

* ప్రపంచ దేశాల జెండాల్లో మన చుట్టూ ఉన్న అన్ని రంగులూ ఉంటాయి... ఒక్క ఊదా తప్ప.

* హాలీవుడ్‌ సినిమాల్లో చూపించే న్యూయార్క్‌, వాషింగ్టన్‌ నగరాలు నిజానికి అమెరికాలోనివి కావు. అక్కడ ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎక్కువ కాబట్టి కెనడాలోనే తీస్తారు!

* 2015 వరకూ పచ్చబొట్టు పొడిపించుకున్నవాళ్లని... భారత సైన్యంలో చేర్చుకునేవారు కాదు.

* ప్రపంచవ్యాప్తంగా కోకాకోలా దొరకని దేశాలు నార్త్‌ కొరియా, క్యూబాలే. ఈ రెండు దేశాలకూ అమెరికాతో అధికారిక వాణిజ్యం లేదు.

* స్విట్జర్లాండ్‌లో... మొరిగే కుక్కని గద్దించడం కూడా నేరం కిందకే వస్తుంది!

* బట్టతలతో బాధపడ్డ తొలి చరిత్ర పురుషుడు... రోమన్‌ చక్రవర్తి జూలియస్‌ సీజర్‌!


జఫ్ఫా... ఈ పదం వినగానే మనకు నవ్వు వస్తుంది. సినిమాల్లో దాన్ని పరిచయం చేసింది బ్రహ్మానందం మరి.  అయితే, ఈ పేరుతో ఇజ్రాయెల్‌ లో ఓ నగరం ఉంది. స్థానికంగా పండే ఓ రకం ఆరెంజ్‌కి కూడా ‘జఫ్ఫా ఆరెంజ్‌’ అని పేరు పెట్టారు.


మగ ఫిన్‌ తిమింగలాలు ఆడ తిమింగలాలను ఆకర్షించేందుకు పాట పాడినట్లూ శబ్దాలు చేస్తాయి. ఇవి వెయ్యి కిలోమీటర్ల దూరం వరకూ వినిపిస్తాయట. ఈ శబ్దం శాస్త్రవేత్తలకు సముద్రం లోతుని కనుక్కునేందుకూ ఉపయోగపడుతుంది.


భూమ్మీద ఎత్తు తక్కువగా ఉండే మనుషులు ఎక్కువగా ఇండోనేషియాలోనే ఉన్నారు. అక్కడ అబ్బాయిలూ అమ్మాయిల్లో సగటు ఎత్తు 5.1 అడుగులేనట. పొడవైన మనుషులున్న చోటు నెదర్లాండ్స్‌. అక్కడి ప్రజల సగటు ఎత్తు ఆరడుగులు.


పాండాలు చైనాకు చెందినవి. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోని జూల్లో వాటిని సందర్శకులకోసం ఉంచుతుంటారు. అయితే, అవెక్కడున్నా వాటిమీద పూర్తి హక్కు మాత్రం చైనాదే.


డ్రాగన్స్‌ బ్రీత్‌ రకం మిరపకాయను ఒక్కటి తింటే ప్రాణాలు పోవడం ఖాయమట. దీని కారం శరీరాన్ని షాక్‌కి గురిచేసి వాయునాళాలు మూసుకుపోయేలా చేయడమే అందుకు కారణం.


పిల్లలు ఆడుకునే ప్లే డౌని మొదట వాల్‌పేపర్లు శుభ్రం చేసేందుకు తయారుచేశారు. అవి అమ్ముడవకపోవడంతో రసాయన రహితమైన ఆ డౌని చిన్నారులు ఆడుకునేందుకు ఉపయోగించొచ్చని అలా మార్కెటింగ్‌ చెయ్యడం మొదలుపెట్టింది ఆ సంస్థ.


ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి రెండొందలమంది పురుషుల్లో ఒకరు మంగోల్‌ సామ్రాజ్యాధినేత చంఘిజ్‌ఖాన్‌ వారసులేనన్నది శాస్త్రవేత్తల నమ్మకం. జీవితకాలంలో అతడు వేరు వేరు స్త్రీల ద్వారా లెక్కలేనంత మంది పిల్లలకు తండ్రి అయ్యాడట.ప్రపంచంలో మంత్రగాడిని(విజార్డ్‌) అధికారికంగా నియమించుకున్న ఏకైక దేశం.న్యూజిలాండ్‌.


Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న