దేవతలు కాదు.. మేకప్‌ మాయ! - Sunday Magazine
close

దేవతలు కాదు.. మేకప్‌ మాయ!

‘అమ్మోరు తల్లి’లో ముక్కుపుడక అమ్మవారి పాత్రలో నయనతార ఎంత చక్కగా ఒదిగిపోయిందో ఆ సినిమా చూసిన వాళ్లందరికీ తెలిసిందే. తలచుకోగానే అమ్మవారు భక్తుడి ఎదురుగా ప్రత్యక్షమవ్వడం ఆ సినిమా నేపథ్యం అయినా... కొందరు మేకప్‌ ఆర్టిస్టులు మాత్రం అలా జరిగితే ఎలా ఉంటుందో చూడాలనుకున్నారట. దాంతో అప్పటివరకూ పెళ్లి కూతుళ్లకూ, టీవీ నటీనటులకూ మేకప్‌ వేసిన వాళ్లంతా చిన్న ప్రయోగం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆ మేకప్‌ ఆర్టిస్టులు కొందరు వ్యక్తులను ఎంపికచేసుకుని వాళ్లకు మేకప్‌ వేసి... ఇదిగో ఇలా దుర్గ, కాళి, వేంకటేశ్వరస్వామి, కుమారీ అమ్మన్‌... అంటూ రకరకాల దేవతల్ని ఆవిష్కరించేశారు. ఈ మేకప్‌కు సహజత్వం తీసుకొచ్చేందుకు ఆభరణాలూ, ఆయుధాలూ, వస్త్రాలూ... పీఠం, ఆర్చి, దీపాలూ... .ఇలా అన్నింటినీ సిద్ధం చేసుకున్నారట. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్లే అలంకరణకు వందశాతం న్యాయం చేయగలిగామని చెబుతున్నారు. అన్నట్లు ఈ మేకప్‌ పేరు ఏంటో తెలుసా... ‘డివోషనల్‌ రియలిస్టిక్‌ మేకప్‌’.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న