weekly horoscope: రాశిఫలం (జూన్‌ 6 - 12) - Sunday Magazine
close

weekly horoscope: రాశిఫలం (జూన్‌ 6 - 12)

గ్రహబలం (జూన్‌ 6 - 12)
డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి

మనోబలం ముందుకు నడిపిస్తుంది. అభీష్టసిద్ధి ఉంది. చిన్న చిన్న అవాంతరాలను బుద్ధిబలంతో జయించండి. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. ధనయోగం ఉంది. వారం మధ్యలో ఒకపనిలో గుర్తింపు వస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆదిత్యహృదయం చదవండి, ఆనందం సిద్ధిస్తుంది.


ధైర్యంగా, ధర్మబద్ధంగా పనులు మొదలుపెట్టండి. విజయం వరిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలుంటాయి. స్వయంకృషితో అభివృద్ధిని సాధిస్తారు. విఘ్నాలు తొలగుతాయి. మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. భవిష్యత్తు సహకరిస్తుంది. కుటుంబపరంగా శక్తి లభిస్తుంది.  సౌమ్య సంభాషణ మేలు. దుర్గాధ్యానం శుభప్రదం.


అభీష్టసిద్ధి ఉంటుంది. సకాలంలో పనులు ప్రారంభించాలి. ఉద్యోగంలో తగిన ప్రతిఫలం దక్కుతుంది. పెద్దల ఆశీర్వచనాలు లభిస్తాయి. ఆవేశపడకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాయం వృద్ధి చెందుతుంది. నలుగురికీ మీవల్ల మంచి జరుగుతుంది. ఎదురుచూస్తున్న పనిలో పురోగతి ఉంటుంది. ఇష్టదైవధ్యానం శుభాన్నిస్తుంది.


ఉద్యోగంలో అభివృద్ధి ఉంది. వ్యాపారలాభం పెరుగుతుంది. నూతన కార్యాలు విజయాన్నిస్తాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారలాభం ఉంటుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆర్థికంగా జాగ్రత్త అవసరం. తెలియని సమస్య ఎదురుకాకుండా చూసుకోవాలి. సమాజంలో పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఇష్టదైవస్మరణ మంచిది.


ఉత్తమ కాలం నడుస్తోంది. పట్టుదలతో పనిచేసి విజయం సాధించండి. కోరికలు నెరవేరుతాయి. మొహమాటంతో కొత్త సమస్యలొస్తాయి. ఉద్యోగంలో అద్భుతమైన ఫలితం ఉంటుంది. కొన్ని నిర్ణయాలు కలిసివస్తాయి. ఎదురుచూస్తున్న పని ఒకటి పూర్తి అవుతుంది. పలు మార్గాల్లో కార్యసిద్ధి ఉంటుంది. ఇష్టదేవతారాధన మంచిది.


ధైర్యంగా పనులు ప్రారంభించండి. తప్పకుండా విజయం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం చాలావరకూ శక్తినిస్తుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితముంటుంది. మనసులో చెడు ఊహించవద్దు. ప్రశాంతచిత్తంతో ముందుకు సాగాలి. సొంత నిర్ణయాలు ఫలిస్తాయి. ముఖ్య కార్యాల్లో లోతుగా ఆలోచించాలి. ఆదిత్యహృదయం చదివితే ఆరోగ్యం సహకరిస్తుంది.


కోరుకున్న జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వారం మధ్యలో ఆశించిన ఫలితాలు వస్తాయి. ధనలాభం అనుకూలం. ఆపదల నుంచి బయటపడతారు. అపోహలు తొలగుతాయి. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. విఘ్నాలను అధిగమిస్తారు. సమష్టికృషి ఫలిస్తుంది. అంచలంచెలుగా పైకి వస్తారు. సూర్యస్తుతి మంచిది.


లక్ష్యాన్ని సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్త. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే ఉజ్వలమైన భవిష్యత్తు లభిస్తుంది. అవరోధాలు తొలగుతాయి. బంధువుల ద్వారా ఒక పని అవుతుంది. ఆనందించే అంశం ఒకటి ఉంది. మొహమాటం వల్ల వ్యయం పెరుగుతుంది. వారాంతంలో శుభవార్త వింటారు. ఇష్టదేవతను స్మరిస్తే మేలు.


ఉద్యోగంలో అద్భుత ఫలితం ఉంటుంది. వ్యాపారబలం బాగుంది. ఆర్థికస్తోమత పెరుగుతుంది. అధికారలాభం సూచితం. మీద్వారా సమాజానికి మేలు చేకూరుతుంది. తెలివిగా ఆపదల నుంచి బయటపడతారు. వివాదాలకు అవకాశముంది. ఆర్థికంగా నష్టపరిచేవారున్నారు. సంప్రదింపుల్లో గోప్యత అవసరం. ఇష్టదైవాన్ని స్మరించండి.


ఉద్యోగపరంగా అభివృద్ధి సూచితం. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారనష్టం రాకుండా తగు ప్రణాళికలు సిద్ధం చేయాలి. తెలియని సమస్య ఒకటి ఇబ్బంది పెడుతుంది. దైవానుగ్రహంతో ఆపద తొలగుతుంది. కొందరి వల్ల మేలు జరుగుతుంది. వారం మధ్యలో కార్యసిద్ధి గోచరిస్తోంది. ఆర్థికంగా బాగుంటుంది. శ్రీవెంకటేశ్వర స్వామిని స్మరిస్తే మేలు.


అద్భుతమైన శుభకాలం నడుస్తోంది. ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. విఘ్నాలను అధిగమిస్తారు. పలుమార్గాల్లో విజయం ఉంటుంది. ఆర్థికంగా మేలు జరుగుతుంది. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. పెద్దల ప్రశంసలందుతాయి. కుటుంబపరంగా శాంతి లభిస్తుంది. ఖర్చు తగ్గించాలి. సూర్యధ్యానం మంచిది.


ధర్మబద్ధంగా పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థికస్థితి మెరుగవుతుంది. దేనికీ తొందరపడవద్దు. ఉద్యోగంలో మంచి ఫలితాలుంటాయి. గృహవాహనాది విషయాల్లో కలిసివస్తుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. బాధ్యత పెరుగుతుంది. గతంలో ఆగిన పనులు పునః ప్రారంభమవుతాయి. ఇష్టదేవతను స్మరించండి, మనశ్శాంతి లభిస్తుంది.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న