వీటిని మడవలేం... తొడగలేం! - Sunday Magazine
close

వీటిని మడవలేం... తొడగలేం!

దండెంపై వేసిన తువ్వాలు, హ్యాంగర్‌కి తగిలించిన టీ షర్ట్‌, కోటు, డ్రస్సు... ఇలా ఇక్కడున్న వాటన్నిటికీ ఓ గొప్ప ప్రత్యేకత ఉంది! అదేంటో చెబితే మీరందరూ కళ్లింత చేసుకుని మరోసారి పరిశీలించాల్సిందే. అదేంటంటే... ఇవన్నీ తయారైంది చెక్కతో! నిజం, అమెరికాకు చెందిన ఫ్రేజర్‌ స్మిత్‌ అనే ఉడ్‌ కార్వింగ్‌ ఆర్టిస్టు సృష్టించిన కళారూపాలు ఇవి. చెక్కనే ఎంతో తీరుగా చెక్కుతూ, వాటర్‌ కలర్స్‌ వాడుతూ ‘రియలిస్టిక్‌ ఉడ్‌ క్లాత్స్‌’గా మారుస్తున్నాడు. చూసేవాళ్లని ఆశ్చర్యంలో ముంచెత్తే ఈ కళాకృతుల్ని ఒక్కోదాన్ని తయారు చేయడానికి దాదాపు ఎనిమిది నెలల సమయం పడుతుందట. ఏమైనా, ఇవి చేసింది చెక్కతో అంటే ఇప్పటికీ నమ్మబుద్ధికావడం లేదు కదూ!


ఫొటోఫీచర్‌

రస్సులూ నదుల్లో దీవులుండడం, అక్కడ చిన్న చిన్న ఊర్లు ఏర్పడటం తెలిసిందే. కానీ రహదారిలా సన్నగా పొడవుగా ఏర్పడిన దీవుల్ని చూడాలంటే మాత్రం నెదర్లాండ్స్‌కి వెళ్లాల్సిందే. స్థానిక ఉట్రెక్ట్‌ ప్రావిన్స్‌లోని వింకెవీన్‌ సరస్సులో పదుల సంఖ్యలో కనిపించే ఈ ద్వీపాలన్నీ తక్కువ వెడల్పుతో ఉండడంతో ప్రతి ఇంటికీ రెండువైపులా నీరుండి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. పచ్చదనమూ నిండిన ఈ ప్రాంతం పర్యటకంగానూ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న