సైన్యంకోసం కట్టిన దీవి! - Sunday Magazine
close

సైన్యంకోసం కట్టిన దీవి!

నీటి మధ్యలో దీవులుండడం, అక్కడ ఊళ్లూ ఇళ్లూ ఉండడం చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడున్న దీవిని చూస్తే మాత్రం ‘తీర్చిదిద్దినట్లు అంత నలుచదరంగా ఎలా ఏర్పడిందబ్బా...’ అని ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. అసలు విషయం ఏంటంటే... జర్మనీలోని స్టెయిన్‌హ్యుడ్‌ సరస్సులో ఉన్న ‘విల్హెల్మ్‌స్టెయిన్‌’ దీవిని 18వ శతాబ్దంలో కృత్రిమంగా నిర్మించారట. మిలటరీ కోసం శత్రు దుర్భేద్యమైన స్థావరాన్ని ఏర్పాటు చేసేందుకు అప్పట్లో పడవల్లో రాళ్లను తెప్పించి సరస్సు మధ్యలో పోసి, మూడెకరాల్లో ఈ దీవిని కట్టారట. జర్మన్ల మొదటి సబ్‌మెరైన్‌ని నిర్మించింది కూడా ఇక్కడే. ప్రస్తుతం ఈ చోటు పర్యటక ప్రదేశంగా ఆకట్టుకుంటోంది. అప్పటి విశేషాలన్నిటినీ తెలియజేసేలా మ్యూజియంను కూడా నిర్వహిస్తున్నారు.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న