close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆకులపైన అచ్చుగుద్దినట్టు...

అందమైన ఆకులకు మరింత అందాన్నీ, కొంత కళాపోషణనూ జత చేస్తూ పత్రాలనే చిత్రాలుగా మార్చే ‘లీఫ్‌ ఆర్ట్‌’ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. అక్కడితో ఆగిపోతే కొత్తగా చెప్పుకోడానికి ఏముంటుందనుకున్నారో... లేక చక్కని ఆకుల మీద చూడ చక్కని మనుషుల ముఖాలను చిత్రిస్తే అందం అదరహో అనుకున్నారో తెలియదు కానీ రంగులూ కుంచెలూ లేకుండానే ఆకులని చిత్తరువులుగా మార్చేస్తున్నారు ఈమధ్య కొంతమంది లీఫ్‌ ఆర్టిస్టులు. సెలబ్రిటీల ఫొటోల్నే కాదూ... మన చిత్రాల్నీ ఆకులపైన ముచ్చటగా చెక్కేస్తున్నారు. నిజానికి ఆకులపైన ఇలా చిత్రాలు రూపుదిద్దడం అంటే మాటలు కాదు. కొబ్బరి, రావి, టేకు, పనస వంటి ఆకుల్ని ఎండబెట్టి, ఆ ఆకులపైన స్కెచ్‌పెన్‌తో కావాల్సిన బొమ్మలను గీస్తారు. ఆ తర్వాత పిన్నీసు, బ్లేడు లాంటివి ఉపయోగించి అవసరం లేని భాగాన్ని జాగ్రత్తగా కట్‌ చేస్తారు. నిజం చెప్పండి...
ఈ ఫొటోల్ని చూస్తుంటే మీ చిత్రాన్నీ ఇలా చేయించుకోవాలనిపిస్తోంది కదూ!


మెలికలు తిరిగిన నల్లతాచులా కనిపిస్తోన్న ఈ రహదారిని చరిత్రలోకి తీసుకెళ్లే ఆధునిక బాటగా చెప్పాలేమో.  గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కొండవీడు కోటమీదకి వెళ్లేందుకు నిర్మించిన ఘాట్‌ రోడ్డు ఇది. ఈ దుర్గాన్ని రాజధానిగా చేసుకుని రెడ్డిరాజులు 14వ శతాబ్దంలో పాలించారు. సముద్ర మట్టానికి 1735 అడుగుల ఎత్తునుండే ఈ కొండపైకి వెళ్లేందుకు 2018లో అద్భుతమైన ఈ రోడ్డుని నిర్మించారు.  మూడు కి.మీ. పొడవుండే ఈ దారిలో ప్రయాణించి కొండపైకి వెళ్తే మనం 700 ఏళ్లు వెనక్కి వెళ్లినట్లే.  పైన కోట ఆనవాళ్లతోపాటు దేవాలయాల్నీ కొత్తగా ప్రారంభించిన మ్యూజియాన్నీ చూడొచ్చు.

- ఫొటో: రాకేష్‌కిరణ్‌ పులప
Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు