close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
సబ్బులోనే పీచు

న్నిరకాల సబ్బులు బజార్లో వస్తున్నా కూడా ఇంకేదైనా కొత్తది దొరుకుతుందా అని వెతికేవారికి ఇప్పుడు ‘లూఫా సోప్స్‌’ వచ్చేశాయి. రోజూ సబ్బుతోపాటూ లూఫా కూడా వాడకపోతే స్నానం చేసినట్లుగా అనిపించదని చెప్పేవారికి ఇవి సరైన ఎంపిక. చూడ్డానికి సబ్బులానే ఉన్నా ఇందులో పీచు కూడా ఉండటం వల్ల అదనంగా లూఫా వాడాల్సిన అవసరం ఉండదు. ఈ సబ్బుల తయారీలో ఎక్కువగా ఉండేది సహజ పీచే గనుక మృతకణాలు తొలగిపోవడంతోపాటూ చర్మం కూడా తాజాగా ఉంటుంది. ఇక సబ్బు అరిగిపోయినా ఈ పీచును కొన్నాళ్లపాటు హాయిగా వాడుకోవచ్చు కూడా. ఇలా రెండురకాలుగానూ ఉపయోగపడే ఈ సబ్బులు ఎన్నో రంగులూ, రకాల్లో దొరుకుతున్నాయి. ఆలస్యమెందుకు నచ్చినవి ఎంచుకుంటే సరి.


పదిహేను నిమిషాల్లో ఆరిపోతాయి

క్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు ఫలానా కుర్తీనో లేదా షర్టో వేసుకోవాలుకుంటాం.. తీరా చూస్తే అదేమో వాషింగ్‌మెషీన్‌లో ఉంటుంది. ఆ ప్రక్రియ అంతా పూర్తయి... కోరుకున్న డ్రెస్‌ చేతికొచ్చేసరికి కనీసం గంట లేదా గంటన్నర సమయం పడుతుంది. పోనీ దాన్ని డ్రయ్యర్‌లో వేయకుండా ఇవతలకు తీసి కాసేపు ఎండలో ఆరేసి ఇస్త్రీ చేసినా కూడా ఆ తడి పూర్తిగా పోదు. ఇలాంటి సమస్య లేకుండా చాలా తక్కువ సమయంలో నచ్చిన డ్రెస్‌ని పూర్తిగా ఆరబెట్టాలనుకుంటే ఈ ‘మోరస్‌ జీరో అల్ట్రా ఫాస్ట్‌ కౌంటర్‌టాప్‌ టంబుల్‌ డ్రయ్యర్‌’ని ఎంచుకుంటే సరి. చూడ్డానికి చిన్న డబ్బాలా ఉండే దీనిలో తడిగా ఉన్న దుస్తుల్ని వేస్తే... కేవలం పావు గంటలో అవి పూర్తిగా ఆరిపోయి వేసుకునేందుకు సిద్ధమవుతాయి. ఇది చూడ్డానికి చిన్నగానే ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా తీసుకెళ్లడమూ సులువే. బాగుంది కదూ!


నట్టింట్లో నాచు గడియారం

గోడ గడియారం ఉండేది కేవలం సమయం చూసుకోవడానికే కాబట్టి... ఏదో ఒకటి కొనుక్కుంటే చాల్లే అనుకునే రోజులు కావివి. ఇల్లు ఎంత ఆధునికంగా ఉంటుందో నట్టింట్లో పెట్టుకునే వస్తువులు కూడా అంతే ట్రెండీగా, ఆకట్టుకునేలా ఉండాలని కోరుకునేవారి సంఖ్యే ఎక్కువ. ఆ వస్తువుల్లో గడియారం కూడా ఒకటి. అది కూడా వినూత్నంగా ఉండాలనుకుంటే ఈసారి నాచుతో తయారుచేసిన గడియారాన్ని ఎంచుకుంటే సరి. సహజమైన నాచును ప్రత్యేక పద్ధతిలో ప్రిజర్వ్‌ చేసి మరీ దీన్ని తయారుచేయడం వల్ల రోజూ నీళ్లు చల్లకపోయినా నాలుగైదేళ్లవరకూ తాజాగానే ఉంటుంది. ఈ గడియారాల్లో ఉండేది కేవలం నాచే అయినా దట్టమైన అడవి, దీవి, కొండలు... వంటి అందాలు కనిపించేలా రకరకాల డిజైన్లూ, రంగులతో వీటిని తయారుచేస్తున్నారు.


పార్టీలో జిగేల్‌మనేలా...

ఇంట్లో ఏదయినా చిన్న పార్టీ ఉందనుకున్నప్పుడు చేసుకునే ఏర్పాట్లలో హుషారైన సంగీతం కూడా ఒకటి. దానికి తగినట్లుగా జిగేల్‌మనే లైట్లు కూడా లేకపోతే ఎలా అనుకునే వారి కోసమే ఇప్పుడు ‘డిస్కోబాల్‌లైట్లు’ వచ్చేశాయి. చూడ్డానికి చాలా చిన్నగా పెన్‌డ్రైవ్‌లా కనిపించే దీన్ని ఫోను, కంప్యూటరు, ల్యాప్‌టాప్‌, మైక్రోఫోను... ఇలా యూఎస్‌బీ పోర్టు ఉన్న దేనికైనా జతచేస్తే చాలు. ఆ ప్రాంతమంతా రంగులమయం అయిపోయి డిస్కోలో ఉన్న వాతావరణం కనిపిస్తుంది. ఇది బ్యాటరీతో పనిచేసినా కావాలనుకున్నప్పుడు వెలుతురును తగ్గించుకుని లేదా పెంచుకునే సదుపాయం కూడా ఇందులో ఉంటుంది. రకరకాల బల్బులూ వైర్లూ లాంటి సమస్య లేకుండా ఇంటిని జిగేల్‌మనిపించా లనుకునేవారికి ఇది సరైన పరిష్కారం. బాగుంది కదూ!

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు