close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
నవ్వూ అంటురోగమే!

వ్వూ ఓ అంటువ్యాధే అంటుంటారు. పలకరింపుగా నవ్వితే బదులుగా ఎదుటివాళ్లూ నవ్వుతారు. అయితే అది అంతవరకే. అలాకాకుండా అదేపనిగా ఆపకుండా నవ్వుతుంటే కొవిడ్‌లానే నవ్వూ పక్కవాళ్లకీ సోకుతుందట. దీనికి నిదర్శనమే టాంజానియికా లాఫర్‌ ఎపిడెమిక్‌. 1962లో ఆ దేశంలోని కషాషా అనే గ్రామంలోని ఓ మిషనరీ స్కూల్లో ముగ్గురు అమ్మాయిలతో జనవరి 31న మొదలైందీ నవ్వు వ్యాధి. ఆ వెంటనే స్కూల్లోని 95మంది విద్యార్థులకీ అంటుకుంది. కొందరిలో గœంటలుంటే, మరికొందరిలో 16 రోజుల వరకూ నవ్వు కొనసాగుతూనే ఉందట. టీచర్లు పాఠాలు చెప్పలేకపోవడంతో మార్చి 18న స్కూలు మూసేసి, మేలో తెరిచినప్పటికీ నవ్వు ఎటాక్స్‌ తగ్గకపోవడంతో జూన్‌ నెలాఖరుకి మళ్లీ మూత బడింది. ఆ నవ్వు రోగం అక్కడితో ఆగలేదు. ఆ ఊరి నుంచి పక్క ఊళ్ల పిల్లలకీ పాకింది. కషాషాలోని స్కూలు మూతపడటంతో వాళ్లని పక్క గ్రామాలకి పంపడంతో మొత్తంగా 14 స్కూళ్లను మూసేశారట. దాదాపు ఏడాదిన్నరకి గానీ అది తగ్గుముఖం పట్టలేదు. కేవలం నవ్వడమే కాదు, దీనివల్ల వాళ్లలో శ్వాసకోశ సమస్యలు, ఏడుపులు, అరుపులు, తేపులు, స్పృహ తప్పి పడిపోవడం... వంటి లక్షణాలూ ఉండేవట. ఇదో రకమైన మాస్‌ సైకోజెనిక్‌ ఇల్‌నెస్‌ అని తేల్చారు పర్‌డ్యూ యూనివర్సిటీ నిపుణులు. ఆ ఏడాదే దేశానికి స్వాతంత్య్రం రావడం, తల్లితండ్రులూ టీచర్లూ పిల్లలమీద ఎక్కువ ఆశలు పెట్టుకోవడంతో వాళ్లు ఒత్తిడికి గురై ఈ వ్యాధి బారినపడినట్లు మానసిక శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆనాటి ఆఫ్రికన్‌ సమాజంలో ఇంట్లోని కట్టుబాట్లకీ స్కూల్లో నేర్చుకునే ఆధునిక అంశాలకీ పొంతన కుదరకపోవడంతో ఆ పిల్లలు మానసిక సంఘర్షణకీ ఆత్మన్యూనతకీ లోనయి, ఏమీ చేయలేని పరిస్థితిలో నవ్వుతో దాన్ని కప్పిపుచ్చేందుకు
ప్రయత్నించి ఉంటారనీ, అదే వ్యాధిలా మారి ఉంటుందనీ సామాజికవేత్తలు విశ్లేషించారు. ఏడవలేక నవ్వడం అంటే ఇదే కాబోలు..!


మీకు తెలుసా!

ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ సైన్సులో చేసిన కృషిని గౌరవిస్తూ 1952లో కొత్తగా ఏర్పడిన ఇజ్రాయెల్‌ దేశానికి ఆయన్ను తొలి అధ్యక్షుడిగా ఉండమని అడిగారట. అందుకు, ఆయన సున్నితంగా తిరస్కరించారట. దాంతో ఐన్‌స్టీన్‌ మరణానంతరం ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ‘5-లిరా’ నోటుని ఆయన ముఖచిత్రంతో తీసుకొచ్చింది. ఆశ్చర్యం ఏంటంటే... ఐన్‌స్టీన్‌ జీవితకాలంలో ఎప్పుడూ ఇజ్రాయెల్‌ వెళ్లలేదు.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు