close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
చాక్లెట్‌ బైక్‌ బాగుందా..!

ఇక్కడున్న ఫొటోల్ని చూస్తే ‘అరె ఒకే దగ్గర పాతకాలపు లాంతరూ, గ్రామఫోన్‌... ఇప్పటి రోబో, మోడర్న్‌ బైక్‌ ఇంకా ఏవేవో బొమ్మలూ, కొన్ని జీవులూ ఉన్నాయి. ఇంతకీ వీటి ప్రత్యేకత ఏమిటబ్బా’ అనుకుంటున్నారా? అదేంటంటే... ఇవన్నీ చాక్లెట్‌తో చేసిన బొమ్మలు. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే చాక్లెట్‌... రుచిలో రారాజే అనడంలో సందేహం లేదు. అయితే నోటికి చేరక ముందే ఆ రుచిని కంటికీ అందిస్తున్నారు కొంతమంది కళాకారులు. బ్లాక్‌-వైట్‌ చాక్లెట్టుకు బాదం, పిస్తా వంటి రకరకాల పప్పుల్నీ కొన్ని ఫుడ్‌ కలర్స్‌నీ జోడించి అందమైన ఈ రూపాల్ని సృష్టిస్తున్నారు. చాక్లెట్‌ని కరిగించి కావాల్సిన అచ్చుల్లో పోస్తూ నచ్చినట్టు రూపుదిద్దుతున్నారు. బాగున్నాయి కదా..!

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు