close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ ‘మమ్మీ’ ఓ అద్భుతం!

నిపోయాక రెండుమూడేళ్లు గడిచేసరికే శరీరం చిక్కి శల్యమై పోతుంది. ఎన్నో రసాయనాలు పూసి చేసిన మమ్మీ అయినా చెక్కుచెదరకుండా ఉండటం అసాధ్యం. కానీ చైనాలో రెండువేల సంవత్సరాలనాటి జిన్‌ జుయ్‌ మృతదేహం మాత్రం ఇందుకు అతీతం. మిగిలిన మమ్మీలకు భిన్నంగా శరీరంలో అన్ని అవయవాలూ అలాగే ఉండటంతో పాటు రక్తనాళాల్లో కొద్దిపాళ్లలో ఎ- గ్రూపు రక్తం కూడా ఉండటం శాస్త్రజ్ఞుల్ని చకితుల్ని చేసింది. కనురెప్పలూ జుట్టూ కూడా అలాగే ఉన్నాయి. చర్మం మృదుత్వాన్నీ కోల్పోలేదట. పొట్టలో పుచ్చగింజలు కూడా ఉండటంతో అవి తిన్న కొన్ని గంటలకే ఆమె మరణించి ఉంటుందనీ, ఆమెది ఊబకాయమనీ, బీపీ మధుమేహంవంటి వాటితోపాటు రక్తనాళాల్లో గడ్డలు ఉండటంతో గుండె దెబ్బతిందనీ,  50 ఏళ్ల వయసులో ఆమె చనిపోయిందనీ చెబుతున్నారు. జిన్‌ ఆడంబరంగా జీవించి ఉంటుందని ఊహిస్తున్నారు. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లకు కారణాన్ని అన్వేషిస్తూ 1971లో మావంగ్‌డుయ్‌ కొండల్లో జరిపిన తవ్వకాల్లో జిన్‌జుయ్‌ సమాధి బయటపడిందట. ఒకదాంట్లో ఒకటి అమర్చిన నాలుగు శవపేటికల లోపల ఆమ్లపూరితమైన ఒక రకమైన ద్రవ పదార్థంలో 20 పొరల సిల్కు వస్త్రంలో చుట్టిన శరీరాన్ని ఉంచారట. బహుశా శరీరం పాడవకుండా ఉండేందుకే ఆ ద్రవాన్ని వాడినట్లుగా భావిస్తున్నారు. కానీ ఆ ద్రవ పదార్థ రహస్యాన్ని మాత్రం ఇంతవరకూ ఏ శాస్త్రవేత్తలూ కనిపెట్టలేకపోయారు. బ్యాక్టీరియా చేరకుండా శవపేటికల్ని బొగ్గూ మట్టీ... వంటి వాటితో సీలు చేశారట.  సమాధిలో విలువైన వంద పట్టు వస్త్రాలూ 160 బొమ్మలూ కూడా ఉన్నాయట. ఆ బొమ్మలు ఆమె పరిచారికలకి సంకేతాలట. హన్‌ కాలంనాటి బ్యూటీగా పేర్కొంటూ ఇప్పటికీ చైనాలో ఆమె జీవితం గురించి నాటకాలు వేస్తుంటారట. ఏమైనా- రెండువేల ఏళ్లనాటి ఈ ‘మమ్మీ’ నిజంగా అద్భుతమే కదూ!



మీకు తెలుసా!

రంగుల ఇంద్రధనుస్సుని చూడాలంటే ఎప్పుడోగానీ సాధ్యం కాదు కదా. కానీ హవాయ్‌ పర్వతాలు అందాల హరివిల్లుకి నిలయాలు అంటోంది అమెరికన్‌ వాతావరణ సంస్థ. తరచూ కమ్ముకొచ్చే వర్షమేఘాల వల్ల అక్కడ ఇంద్రధనుస్సు విరియడమే కాదు, అక్కడ వీచే స్వచ్ఛమైన గాలులూ, పర్వతాల కారణంగా ఎంతో అందంగా కనిపిస్తుందట.


అలాగా!

భార్యలు ఇల్లు తుడిచే టైంలో భర్తలు ఎంత జాగ్రత్తగా నడుస్తారంటే... నక్సలైట్లు పెట్టిన బాంబు ఉన్నా అంత జాగ్రత్తగా నడవలేరేమో.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు