close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నాన్న ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నారు...

ఏ సినిమా ఎంచుకున్నా అందులో తనదైన ముద్ర ఉండాలనుకునే కంగనా రనౌత్‌ త్వరలో విడుదల కాబోతున్న ‘తలైవి’లో జయలలిత పాత్రలో తెరమీద మెరవనుంది. ఇండస్ట్రీలో ఎదురయ్యే సమస్యలను గట్టిగా ప్రశ్నించడంతోపాటు వచ్చే విమర్శలను కూడా ధైర్యంగా ఎదుర్కొనే కంగన... తనకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను పంచుకుంటోందిలా...

ఇష్టమైన సినిమా

దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే... అయితే దాన్ని కూడా పూర్తిగా చూడలేదు.

మహేష్‌బాబుతో నటించాలని...

‘ఏక్‌నిరంజన్‌’ చేశాక మళ్లీ తెలుగు సినిమాల గురించి ఆలోచించలేదు. భవిష్యత్తులో మళ్లీ అవకాశం వస్తే గనుక మహేష్‌బాబుతో చేయాలని ఉంది.

డాక్టరు కావాలనుకున్నా

వును... నేను డాక్టర్‌ని కావాలనుకునే బైపీసీలో చేరా. అయితే ఇంటర్‌ రెండో ఏడాదిలో ఓసారి పరీక్ష పెడితే కెమిస్ట్రీలో ఫెయిల్‌ అయ్యా. దాంతో మెడిసిన్‌మీద ఆసక్తి పోయింది. ఆ తరువాత సినిమా రంగంలోకి రావాలనిపించడంతో ఇటువైపు నా ప్రయత్నాలుమొదలుపెట్టా.

అదే నా బలహీనత

క్కడికి వెళ్లినా సరే విపరీతంగా బట్టల్ని కొనేస్తా. ఆ సమయంలో ఎంత డబ్బు ఖర్చుపెడుతున్నానో కూడా ఆలోచించను. అలాగే బంగారం కూడా కొంటా. వ్యామోహం లేదు కానీ.. బంగారం కొనడం అంటే మాత్రం చెప్పలేనంత ఇష్టం.

వాళ్లు తయారుచేసినవే

మా ఇల్లంతా రకరకాల కళాకృతులూ, చిత్రాలూ, ఫొటోలూ ఉంటాయి. అవన్నీ మహిళా కళాకారులు తయారుచేసినవే. వాళ్లలో ప్రముఖులే కాదు, సాధారణ మహిళలూ ఉన్నారు.

పది సినిమాలే చూశా

చెబితే నమ్మరు కానీ... నేను ఇప్పటివరకూ చూసిన సినిమాలు పదే. అలా మూడుగంటల సేపు కదలకుండా సినిమా చూడటం అన్నా, టీవీ ముందు కాలక్షేపం చేయడం అన్నా నాకు నచ్చదు. బోర్‌కొడితే హాయిగా పుస్తకాలు చదువుకుంటా. లేదంటే గంటల తరబడి పాటలు వినడానికి ఇష్టపడతా.

బరువు పెరగను

నటిగా ఇప్పుడు రోజూ యోగా, వ్యాయామాలూ చేస్తూ, ఆహారంలో నియమాలు పాటిస్తూ ఎంతో జాగ్రత్తగానే ఉంటున్నా కానీ... కొన్నాళ్లక్రితం బరువు పెరిగేందుకు విపరీతంగా తినేదాన్ని. అయితే.. నేనేం చేసినా పెరగకపోయేసరికి నా శరీరతత్వం ఇంతేనని అర్థం చేసుకున్నా.

నాన్న మాట్లాడలేదు

ప్పుడు మా నాన్న నా నటనను మెచ్చుకుంటున్నారు కానీ... నాకు సినిమాలపైన ఆసక్తి ఉందని చెప్పినప్పుడు వద్దంటే వద్దన్నారు. ఇంట్లో తరచూ గొడవలు కూడా జరిగేవి. చివరకు ఓ రోజు నాన్న కోపంతో ‘నిన్ను వేడుకుంటున్నా... దయచేసి ఇంట్లోంచి వెళ్లిపో’ అనేశారు. ఆయన అలా అన్నప్పుడు చాలా బాధేసింది. ఏడుస్తూనే ఇంట్లోంచి వచ్చేసి ముంబయి రైలు ఎక్కేశా. ముంబయిలో కష్టపడుతున్నానని తెలిసినా కూడా నాన్న నాతో మాట్లాడలేదు. ఖర్చులకోసం డబ్బూ పంపించేవారు కాదు.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు